కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన ప్రవేశ పరీక్షలకు సంబంధించిన తేదీలను ఒక్కొక్కటిగా కేంద్రం ప్రకటిస్తోంది. తాజాగా మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్(యూజీ)–2021 పరీక్షకు సంబంధించిన తాజా షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ఫారమ్ నింపాల్సి ఉంటుంది. దీని కోసం నీట్ అధికారిక వెబ్‌సైట్ ntaneet.nic.in ని సందర్శించాలి. నీట్ యుజి–2021 పరీక్షను 2021 సెప్టెంబర్ 12న నిర్వహించనున్నారు.
గతేడాది కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని అనేక జాగ్రత్తల మధ్య సెప్టెంబర్ 13న నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 13.66 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 7,71,500 మంది అర్హత సాధించారు. గతేడాది నుంచి 13 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లలో ఎంబిబిఎస్ కోర్సులో ప్రవేశాలకు సైతం నీట్ యూజి స్కోర్‌ను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ పరీక్ష ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ.. మొత్తం 11 భాషల్లో జరుగుతుంది. నీట్ యూజీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, కావాల్సిన డాక్యుమెంట్స్‌ను పరిశీలింద్దాం.
మీ ఈ–మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి.
తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను పూరించండి. వెంటనే మీకు అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. దాన్ని నోట్ చేసుకోండి.
అవసరమైన డాక్సుమెంట్స్ను అప్‌లోడ్ చేయండి.
అప్లికేషన్ ఫీజు చెల్లించండి. ఫీజు చెల్లించిన ఫామ్‌ను డౌన్లోడ్ చేసుకొని మీ వద్దే ఉంచుకోండి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.