• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • NEET UG 2021 CANDIDATES SHOULD KEEP THESE DOCUMENTS READY FOR NEET REGISTRATION PROCESS NS

NEET UG 2021: నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అలర్ట్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

NEET UG 2021: నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అలర్ట్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

నీట్ పరీక్షకు సంబంధించిన తేదీని ఇటీవల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్రకటించింది. అయితే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం కింద సూచించిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఇటీవల నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(NEET UG 2021)ని ఆగస్టు 1 న నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అప్లికేషన్ ఫామ్ ను ఇంకా విడుదల చేయలేదు. మార్చి లో అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే అప్లికేషన్లు ప్రారంభమయ్యే నాటికి అభ్యర్థులు కావాల్సిన డాక్యుమెంట్లను, వివరాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. నీట్ కు అప్లై చేసే సమయంలో కావాల్సిన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయడం అత్యంత ముఖ్యమైన అంశం. సూచించిన ఫార్మాట్లో ఆ డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

    నీట్ రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు సిద్ధంగా ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్లు ఇవే..
    Passport size photograph: అప్లికేషన్ ఫామ్ ను నింపే సమయంలో అభ్యర్థులు స్కాన్ చేసిన పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫొటో సైజ్ 10 కేబీ నుంచి 200 కేబీ వరకు ఉండాలి. JPG ఫార్మాట్లోనే ఉండాలి. ఫొటోలో 80 శాతం స్పేస్ లో అభ్యర్థి ముఖం కనిపించేలా ఉండాలి. చెవులు కూడా కనిపించేలా ఉండాలి. వైట్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కలర్ ఫొటోను మాత్రమే అప్ లోడ్ చేయాలి. నీట్ 2021 ఇన్ఫర్మేషన్ బులిటెన్ లో సూచించిన తేదీ అనంతరం తీసుకున్న ఫొటోను మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

    Postcard size photograph: అభ్యర్థులు పోస్ట్ కార్డ్ సైజ్ ఫొటోను సైతం అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఫొటోను అడ్మిట్ కార్డు, అటెండెంట్ షీట్ పై పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫొటో సైజ్ 4*6 ఇంచులు ఉండాలి. JPG ఫార్మాట్లో ఉండాలి. ఫొటో సైజు 50kb-300kb ఉండాలి. కంప్యూటర్ జనరేటెడ్ ఫొటోలను అస్సలు అప్ లోడ్ చేయవద్దు. కెమెరాతో తీయించుకున్న ఫొటోలను మాత్రమే అప్ లోడ్ చేయాలి.

    Scanned copy of signature: అభ్యర్థులు ఫొటోగ్రాఫ్ మాదిరిగానే సిగ్నేచర్ స్కానింగ్ కాపీని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ వైట్ పేపర్ పై మాత్రమే చేయాల్సి ఉంటుంది. సిగ్నచర్ లోని అన్ని అక్షరాలు క్యాపిటల్ లెటర్స్ లో అస్సలు ఉండొద్దని అధికారులు స్పష్టం చేశారు.

    Left-hand thumb impression: అభ్యర్థులు థంబ్ ఇంప్రెషన్ ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు బొటన వేలు ముద్రను వైట్ పేపర్ పై వేసి స్కాన్ చేయాలి. ఆ స్కాన్ కాపీని JPG ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫైల్ సైజ్ 10kb నుంచి 50 కేబీ మధ్యలో ఉండాలి.

    Class 10 passing certificate: అభ్యర్థులు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ స్కాన్ కాపీని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫైల్ సైజ్ 100kb నుంచి 400kb వరకు ఉండాలి.
    Published by:Nikhil Kumar S
    First published: