NEET TOPPER WHO SCORED 720720 SHARE TRICKS TO ACE MEDICAL ENTRANCE EXAM NTANEET NIC IN GH VB
NEET Exam Tips: నీట్-2021 ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారా.. గత ఏడాది పరీక్ష టాపర్ ఇస్తున్న టిప్స్ ఇవే.. తెలుసుకోండి..
గతేడాది నీట్ టాపర్ ఆకాంక్ష సింగ్ (ఫైల్)
NEET: మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్- 2021 పరీక్షకు సర్వం సిద్ధమైంది. కరోనా నేపథ్యంలో గత కొన్ని నెలలుగా ఈ పరీక్ష నిర్వహణపై నెలకొన్న స్తబ్దత తొలగిపోయింది. ఇప్పటికే అడ్మిట్ కార్డులు సైతం జారీ అయిన నేపథ్యంలో.. గత ఏడాది పరీక్ష టాపర్ అయిన్ ఆకాంక్ష సింగ్, అభ్యర్థులకు కొన్ని సూచనలు ఇస్తున్నారు. అవేంటో చూద్దాం.
మెడికల్ ఎంట్రన్స్(Medical Entrance)ఎగ్జామ్ నీట్ - 2021 పరీక్షకు సర్వం సిద్ధమైంది. కరోనా(Corona) నేపథ్యంలో గత కొన్ని నెలలుగా ఈ పరీక్ష నిర్వహణపై నెలకొన్న స్తబ్దత తొలగిపోయింది. ఇప్పటికే అడ్మిట్ కార్డులు(Admit Cards) సైతం జారీ అయిన నేపథ్యంలో.. గత ఏడాది పరీక్ష టాపర్ అయిన్ ఆకాంక్ష సింగ్(Akankhsa Singh), అభ్యర్థులకు కొన్ని సూచనలు ఇస్తున్నారు. అవేంటో చూద్దాం. ఉత్తరప్రదేశ్(Uttarapradesh)లోని కుషీనగర్‌కు(Khushinagar) చెందిన 18 ఏళ్ల ఆకాంక్ష సింగ్.. గత ఏడాది మెడికల్ ఎంట్రన్స్‌లో టాపర్‌గా నిలిచింది. దీంతో పాటు ఏకంగా 720కి 720 మార్కులు సాధించి వైద్యవిద్య ప్రవేశ పరీక్షలో సత్తా చాటింది. యూపీలోని పూర్వాంచల్ నుంచి మెడికల్ ఎంట్రన్స్‌లో టాపర్‌గా నిలిచిన మొదటి యువతి ఆమే కావడం విశేషం. పూర్తి మార్కులు సాధించినప్పటికీ, టై- బ్రేకింగ్ పాలసీ ప్రకారం ఆమె ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆకాంక్ష ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మెడిసిన్ చదువుతోంది. ఈ ఏడాది నీట్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఆమె పలు సలహాలు ఇచ్చింది. ఈ విషయంపై ఆకాంక్ష న్యూస్ 18 తో మాట్లాడింది.
వాటికి ప్రభావితం కావద్దు
2021 బ్యాచ్ మాదిరిగానే గత సంవత్సరం కూడా మెడికల్ ప్రవేశ పరీక్ష నిర్వహణపై గందరగోళం నెలకొంది. అయితే బయటి పరిస్థితులతో ప్రభావితం కాకుండా ప్రశాంతంగా ఉండటం ముఖ్యమని ఆకాంక్ష చెబుతోంది. పరీక్ష తేదీ వాయిదా పడటంతో, ఆ సమయాన్ని సబ్జెక్టుల రివిజన్‌కు కేటాయించానని చెప్పింది. బయట వాతావరణంతో సంబంధం లేకుండా తన పని తాను చేసుకున్నానని, పరీక్షకు హాజరయ్యేటప్పుడు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నానని ఆకాంక్ష వివరించింది.
టైమ్‌టేబుల్ అవసరం
చివరి దశలో ప్రిపరేషన్, రివిజన్ కోసం ఒక టైమ్‌టేబుల్ సిద్ధం చేసుకోవడం మంచిదని ఆకాంక్ష సూచిస్తోంది. చివర్లో అన్ని చాప్టర్లపై సమానంగా దృష్టి పెట్టాలని, కాన్సెప్ట్స్‌ను బాగా అర్థం చేసుకోవడంపై దృష్టి సారించాలని పేర్కొంది. ఈ సమయంలో వివిధ రకాల కొత్త పుస్తకాలు చదివి గందరగోళానికి గురికాకుండా.. బేసిక్ సిలబస్ ముందుగా పూర్తి చేసి, ఎక్కువ మార్కులు పొందేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.
మాక్ టెస్టులు
మాక్ టెస్ట్‌లపై విద్యార్థులు దృష్టి పెట్టాలని ఆకాంక్ష చెబుతోంది. ఇందులో తప్పులను సరిచేసుకుంటూ, నేర్చుకున్న కాన్సెప్ట్స్‌ను రివిజన్ చేసుకోవాలని చెబుతోంది. చివరి దశలో శాంపిల్ క్వశ్చన్స్, చర్చలు, అధ్యాపకుల సూచనలు బాగా ఉపయోగపడతాయని తెలిపింది. ఫిజిక్స్ తనకు ఇష్టమైన సబ్జెక్ట్ అని చెబుతోంది ఆకాంక్ష. దీని నుంచి ప్రాబ్లం బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయని, బాగా సిద్ధమైతే పరీక్షలో మంచి మార్కులతో పాటు వెయిటేజీ సైతం పొందవచ్చని చెప్పింది. అయితే తనకు జీవశాస్త్రం కఠినమైన సబ్జెక్టుగా ఉండేదని ఆకాంక్ష వివరించింది.
నీట్ పరీక్ష వ్యూహం
ప్రాక్టీస్ విషయంలో మాత్రమే కాకుండా.. పరీక్ష రాసే సమయంలో కూడా ఒక వ్యూహం ఉండాలని ఆకాంక్ష చెబుతోంది. ఈ సంవత్సరం ప్రశ్నల సంఖ్య పెరిగింది. కానీ కేటాయించిన సమయం మాత్రం అలాగే ఉంది. అందువల్ల పరీక్షలో ముందు సరళమైన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలని, ఆ తర్వాత కష్టమైన లేదా థియరీ బేస్డ్ ప్రశ్నలు చూడాలని చెప్పింది. విద్యార్థులకు ఇష్టమైన సబ్జెక్ట్ విభాగాన్ని ముందుగా ఎంచుకోవాలని చెబుతోంది. పరీక్ష పూర్తిచేసిన తరువాత రివిజన్ కోసం కనీసం 30-40 నిమిషాలు ఉండేలా చూసుకోవాలని సూచిస్తోంది.
టైమ్ మేనేజ్మెంట్ కోసం ప్రాక్టీస్
పరీక్షను నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి మాక్ టెస్టుల ద్వారా ప్రాక్టీస్ చేయాలని ఆకాంక్ష చెబుతోంది. తాను మాక్ టెస్టుల ద్వారా రెండు గంటల్లోనే పరీక్ష పూర్తిచేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నానని తెలిపింది. టైమ్ మేనేజ్మెంట్ కోసం అభ్యర్థులు ఇలా ప్రాక్టీస్ చేయాలని సూచిస్తోంది. టైమ్‌టేబుల్, స్మార్ట్‌వర్క్, ప్రిపరేషన్‌కు బౌండరీస్ తెలుసుకోవడం.. ఇప్పుడు అభ్యర్థులు ఈ మూడు అంశాలపైనే దృష్టి పెట్టాలని ఆకాంక్ష సూచించింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.