Home /News /jobs /

NEET RESULTS ARE EXPECTED TO BE OUT BY AUGUST END THE CUT OFF FOR TOP MEDICAL COLLEGES IS EXPECTED TO RISE HERE FULL DETAILS TO KNOW GH SRD

NEET-2022 Results: త్వరలో నీట్ ఫలితాలు.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ పొందడానికి కటాఫ్ ఎంత ఉండొచ్చంటే?

NEET-2022 Results

NEET-2022 Results

NEET-2022: ఫలితాల కంటే ముందు ఆన్సర్ కీ జారీ చేయనున్నారు. ఆ తరువాత అభ్యంతరాలు తెలపడానికి ప్రత్యేక విండో ఆప్షన్ పొందుతారు. వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ అధ్యయనం చేసి, తుది ఆన్సర్ కీలో మార్పులు చేస్తుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
జాతీయ స్థాయి మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్-2022 ఫలితాలు (NEET-2022 Results) త్వరలో విడుదల కానున్నాయి. ఈ ఏడాది 18 లక్షల మంది పైగా విద్యార్థులు (Students) నీట్ కోసం రిజిస్ట్రర్ చేసుకున్నారు. గత ఏడాది కంటే ఈసారి దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు పెరిగారు. ఫలితాలు విడుదలైన తరువాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inలో అందుబాటులోకి రానున్నాయి. సాధారణంగా నీట్ ఫలితాలు పరీక్ష జరిగిన నెలన్నరలోపు వెల్లడి అవుతాయి. నీట్ పరీక్ష ఈసారి జూలై 17న జరిగింది. దీంతో ఫలితాలు ఆగస్టు 31లోపు వచ్చే అవకాశం ఉంది. కాగా, గతేడాది నీట్ పరీక్ష సెప్టెంబర్ 12న జరగ్గా, ఫలితాలు నవంబర్ 1న విడుదలయ్యాయి. 2020లో సెప్టెంబర్ 13న నీట్ జరగ్గా, అక్టోబర్ 16న ఫలితాలు వెలువడ్డాయి.

* ఫైనల్‌ ఆన్సర్‌ కీ ఆధారంగా ఫలితాలు
ఫలితాల కంటే ముందు ఆన్సర్ కీ జారీ చేయనున్నారు. ఆ తరువాత అభ్యంతరాలు తెలపడానికి ప్రత్యేక విండో ఆప్షన్ పొందుతారు. వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ అధ్యయనం చేసి, తుది ఆన్సర్ కీలో మార్పులు చేస్తుంది. తుది ఆన్సర్‌ కీ ఆధారంగా ఫలితాలు ఉంటాయి. నీట్‌లో ఉత్తీర్ణత సాధించాలంటే జనరల్ విద్యార్థులు 50 పర్సంటైల్, కెటగిరి విద్యార్థులు 40 పర్సంటైల్, పీహెచ్‌డీ విద్యార్థులు 45 పర్సంటైల్ స్కోర్ సాధించాలి.



అయితే టాప్ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ కోసం కట్-ఆఫ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.గతేడాది కంటే ఈసారి పేపర్ చాలా కఠినంగా ఉన్నప్పటికీ, కట్-ఆఫ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రవేశం పొందాలంటే విద్యార్థులు నీట్‌లో 600 మార్కుల స్కోర్ సాధించాలి.

* నీట్-2021 కట్ ఆఫ్ పర్సంటైల్- స్కోర్
గతేడాది నీట్‌లో అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీకి కటాఫ్ పర్సంటైల్ 50 కాగా, కటాఫ్ స్కోర్ 138- 720 మార్కుల మధ్య ఉండేది. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ అభ్యర్థులకు కటాఫ్ పర్సంటైల్ 40, కట్-ఆఫ్ స్కోర్ 108 - 137 మార్కులు. అన్‌రిజర్వ్‌డ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ (PH) కేటగిరీలకు చెందిన అభ్యర్థులకైతే 122- 137 మార్కులు కట్ ఆఫ్‌గా, 45 పర్సంటైల్‌గా నిర్ణయించారు.

ఇది కూడా చదవండి : కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదల ఎప్పుడంటే.. పూర్తి వివరాలివే..

ప్రతి ఏటా నీట్ కోసం రెండు వేర్వేరు కటాఫ్‌లను విడుదల చేస్తారు. మొదటిది ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అవసరమైన కనీస మార్కుల సంఖ్యను సూచించే క్వాలిఫైయింగ్ కట్-ఆఫ్. దీని తర్వాత అడ్మిషన్ కట్-ఆఫ్ ఉంటుంది. దీని ఆధారంగా ప్రవేశాలకు ర్యాంకులు కేటాయిస్తారు.

విద్యామందిర్ క్లాసెస్ చీఫ్ అకడమిక్ ఆఫీసర్ సౌరభ్ కుమార్ మాట్లాడుతూ.. నీట్‌లో అర్హత సాధించడానికి కటాఫ్ దాదాపు 150 మార్కులు ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే లాస్ట్ సీటు 350 మార్కులకు చేరుకోవచ్చన్నారు. ఇక ప్రభుత్వ కళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీట్‌ పొందాలంటే విద్యార్థులు 600 మార్కులు స్కోర్ చేయాల్సి ఉంటుంది. గతేడాదితో పోలిస్తే కెమిస్ట్రీ, బోటనీ పటిష్టంగా ఉన్నాయని, నిర్ణయాత్మక అంశంగా ఇవి ఉండవచ్చని ఆయన అన్నారు.
Published by:Sridhar Reddy
First published:

Tags: EDUCATION, JOBS, NEET, NEET 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు