హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET Results: రేపే NEET రిజల్ట్స్.. స్కోర్‌కార్డ్‌ చెక్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్ ఇవే..

NEET Results: రేపే NEET రిజల్ట్స్.. స్కోర్‌కార్డ్‌ చెక్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NEET Results: మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్‌ సెప్టెంబర్ 7న ప్రకటించనున్నట్లు తెలిపింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA). రేపు సాయంత్రం లోగా NEET- 2022 ఫలితాలు neet.nta.nic.in పోర్టల్‌లో రిలీజ్ కానున్నాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే NEET (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) జులై నెలలో ముగిసింది. ఎగ్జామ్ కీ (Exam Key) కూడా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్‌ సెప్టెంబర్ 7న ప్రకటించనున్నట్లు తెలిపింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA). రేపు సాయంత్రం లోగా NEET- 2022 ఫలితాలు neet.nta.nic.in పోర్టల్‌లో రిలీజ్ కానున్నాయి. అభ్యర్థులు తమ స్కోర్ కార్డులను చెక్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్‌తో పాటు పాస్ మార్కులు, ఇతర వివరాలు తెలుసుకుందాం.

నీట్ పలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రేపు ప్రకటిస్తుంది. నీట్ ఎగ్జామ్ రాసిన దాదాపు 18 లక్షల మంది అభ్యర్థులు గత కొన్ని రోజులుగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహిస్తుంది.

నీట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు మెడికల్, డెంటల్ కోర్సులతో పాటు నర్సింగ్, ఆయుష్‌లలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశం పొందేందుకు అర్హులు. ఆయుష్‌ కోర్సులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ జరగనుంది. ఈ సంవత్సరం పరీక్షకు రిజిస్ట్రేషన్లు భారీ సంఖ్యలో వచ్చాయి. గతేడాది కంటే ఏకంగా 2.5 లక్షల మంది విద్యార్థులు పెరిగారు. దీంతో పాస్ మార్కులపై సందిగ్ధం నెలకొంది.

* అవసరమైన డాక్యుమెంట్లు

NEET ఫలితాలు చెక్ చేసేందుకు అభ్యర్థులు ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డును సిద్ధంగా ఉంచుకోవాలి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్కోర్‌ చెక్ చేయడానికి నీట్ అడ్మిట్ కార్డ్‌లో పేర్కొన్న రోల్ నంబర్ అవసరం. విద్యార్థులు తమ స్కోర్ కార్డులోని వివరాలను అడ్మిట్ కార్డులోని వివరాలతో పోల్చి చూడాలి. తర్వాత స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఇది కూడా చదవండి : Scholarships: యూనివర్సిటీ, కాలేజీ విద్యార్థులకు బంపరాఫర్.. CBSE నుంచి సెంట్రల్ స్కాలర్‌షిప్స్..


* కటాఫ్ స్కోర్ ఎంత?

ఈ ఏడాది నీట్ కటాఫ్ ఎక్కువగానే ఉంటుందని అంచనా. పాసింగ్ మార్కులు గతేడాది కంటే స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. టాప్ కాలేజీల్లో ప్రవేశానికి అవసరమైన స్కోర్లు 600 మార్కుల వరకు ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. నీట్‌లో క్వాలిఫయింగ్ మార్కులు సాధించిన ప్రతి ఒక్కరూ, తాము కోరుకున్న కాలేజీల్లో ప్రవేశం పొందలేరు. కౌన్సెలింగ్ ప్రక్రియలో టాప్ కాలేజీలను సెలక్ట్ చేసుకుంటే.. మెరిట్ ఆధారంగా కాలేజీలు అలాట్ అవుతాయి. ప్రతి కాలేజీ, కోర్సుకు సొంత కటాఫ్ ఉంటుంది.

* పాస్ మార్కుల వివరాలు..

విద్యార్థులు నీట్‌లో పాస్ అవ్వడానికి కనీసం 50 పర్సంటైల్ స్కోర్‌ పొందాలి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన అభ్యర్థులకు మినిమం 40 పర్సంటైల్ స్కోర్ రావాలి. బెంచ్‌మార్క్ వైకల్యాలున్న అభ్యర్థులకు.. జనరల్ కేటగిరీ వారైతే కనీస మార్కులు 45 పర్సంటైల్ కాగా, SC, ST, OBC అభ్యర్థులకు 40 పర్సంటైల్‌గా నిర్ణయించారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, Exam results, JOBS, NEET, NEET 2022

ఉత్తమ కథలు