హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET Result Errors: నీట్ 2021 ఫలితాల్లో ఎర్రర్స్.. మళ్లీ పరీక్ష..?

NEET Result Errors: నీట్ 2021 ఫలితాల్లో ఎర్రర్స్.. మళ్లీ పరీక్ష..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కీ ఆధారంగా లెక్కించిన మార్కులకు, అసలు ఫలితాలకు చాలా తేడా వచ్చిందని కొందరు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై నీట్‌ స్కామ్ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ట్వీట్లు చేస్తున్నారు.

నవంబర్ 1న ప్రకటించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) 2021 ఫలితాల్లో లోపాలు తలెత్తాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (NTA) అధికారిక వెబ్‌సైట్‌లో (neet.nta.nic.com) ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆన్సర్స్ కీ ఆధారంగా విద్యార్థులు మార్కులపై ఒక అంచనాకు వచ్చారు. కానీ కీ ఆధారంగా లెక్కించిన మార్కులకు, అసలు ఫలితాలకు చాలా తేడా వచ్చిందని కొందరు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై నీట్‌ స్కామ్ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ట్వీట్లు చేస్తున్నారు. నీట్ రిజల్ట్ 2021 హ్యాష్‌ట్యాగ్‌తో కొందరు విద్యార్ధులు ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశారు.

Neet 2021 Topper: నెట్‌ఫ్లిక్స్‌లో షోస్ చూస్తూ రోజుకు 4 గంటలే చదివాడు... నీట్‌లో 720/720 స్కోర్... ఇదెలా సాధ్యమైందంటే

ఆన్సర్ కీ, ఓఎంఆర్ మార్కుల ఆధారంగా లెక్కిస్తే నీట్ ఫలితాలు మొత్తం పెద్ద కుంభకోణమని దితి పన్వర్ అనే విద్యార్థి ట్వీట్ చేశారు. నీట్ రిజల్డ్ 2021, ఓఎంఆర్ హ్యాష్ ట్యాగ్, నీట్ స్కామ్ హ్యాష్‌ట్యాగ్స్‌తో ఈ ట్వీట్ చేశారు. ఓఎంఆర్ మార్కులకు అసలు ఫలితాలకు మార్కులు తేడా వచ్చాయని, మరోసారి పరిశీలించాలంటూ కమల్జీత్ సాహు ట్వట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ‘మా జీవితాలు నాశనం చేయవద్దు. నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించి న్యాయం చేయాల’ని మరో విద్యార్థి బొమ్మతి శ్రీనిఖ ట్వీట్ చేశారు.

మెడికల్ ప్రవేశ పరీక్షలో తమ స్కోర్ కార్డులపై రెండు ర్యాంకులు రావడంపై కొందరు విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ‘ఎన్టీఏ ఇచ్చిన ఆల్ ఇండియా ర్యాంకు, కౌన్సిలింగ్ ర్యాంకు రెండింటిని స్కోర్ కార్డులో ఇచ్చారు. నా విషయంలోనే కౌన్సిలింగ్ కోసం మూడు భిన్నమైన ర్యాంకులు ఇచ్చారు’ అని ఓ విద్యార్థి హిందూస్థాన్ టైమ్స్‌తో వెల్లడించారు. ఏజెన్సీ విడుదల చేసిన ఆల్ ఇండియా ర్యాంకు, కౌన్సిలింగ్ ర్యాంకులు వేర్వేరుగా ఉంటాయని ఎన్టీఏ తెలిపింది. ర్యాంకింగ్ నుంచి వయసు ప్రమాణాలను ఏజెన్సీ తొలగించింది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (MCC) మాత్రం దీన్ని పరిగణనలోకి తీసుకుంటూనే ఉంది. అటు ఎన్టీఏ, ఎంసీసీ వేర్వేరు ర్యాంకులు పరిశీలిస్తున్నాయి. మెడికల్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన వివాదాల కారణంగా విద్యార్థుల ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. నీట్ 2021 పేపర్ లీక్ సహా పలు వివాదాల్లో చిక్కుకుంది.

IT Freshers Hiring: ఫ్రెషర్స్​కు అదిరిపోయే శుభవార్త.. ఆ సంస్థల్లో 1.6 లక్షల నియామకాలు.. వివరాలివే..


దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాలు పొందడానికి 138 నుంచి 720 వరకు స్కోరు ఉంది. కౌన్సిలింగ్ ప్రక్రియను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (MCC) త్వరలో విడుదల చేయనుంది. రెండు దశల్లో కౌన్సిలింగ్ జరుగుతుంది. ఆల్ ఇండియా కోటా సీట్లు, స్టేట్ లెవల్ సీట్ల ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఇందులో 15 శాతం ఆల్ ఇండియా కోటా, 85 శాతం స్టేట్ కౌన్సిలింగ్ అథారిటీల ద్వారా భర్తీ చేస్తారు. మొత్తం 16.14 లక్షల మంది నీట్ 2021 పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 15.44 లక్షల మంది సెప్టెంబరు 12న నిర్వహించిన పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 77857 మంది విద్యార్ధులు 50 శాతం మార్కులు సాధించారు.

First published:

Tags: NEET 2021, Results