హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET 2020 Results: నీట్ ఫలితాలు వాయిదా.. వారి కోసం మళ్లీ పరీక్ష

NEET 2020 Results: నీట్ ఫలితాలు వాయిదా.. వారి కోసం మళ్లీ పరీక్ష

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NEET 2020 Results: నీట్ 2020 పరీక్ష ఫలితాల ప్రకటన వాయిదా పడింది. సుప్రీం ఆదేశాల మేరకు ఈ నెల 16న ఫలితాలను విడుదల చేయనున్నారు.

  నీట్ 2020 పరీక్ష ఫలితాల ప్రకటన వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12న(నేడు) నీట్ పరీక్ష ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. అయితే దేశం అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫలితాల ప్రకటనను అధికారులు వాయిదా వేశారు. కరోనా కంటైన్మైంట్ జోన్లలో ఉండడం కారణంగా కొందరు విద్యార్థులు పరీక్షకు హాజరుకాలేకపోయారు.  దీంతో ఆ విద్యార్థులకు ఈ నెల 14న పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సూచించింది. వారితో కలిపి పరీక్ష రాసిన విద్యార్థులందరి ఫలితాలను ఒకేసారి ఈ 16న విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం సూచనలతో నీట్ పరీక్ష ఫలితాలు వాయిదా పడ్డాయి. కరోనా కారణంగా పరీక్షకు హాజరు కాలేకపోయిన విద్యార్థులకు ఈ నెల 14న పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

  అనంతరం ఈ నెల 16న నీట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. దీంతో నేడు ఫలితాలు విడుదల అవుతాయని ఎదురు చూసిన విద్యార్థులు, తల్లిదండ్రులు నిరాశకు గురయ్యారు. దేశ వ్యాప్తంగా మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలు నిర్వహించేందుకు నీట్ 2020 పరీక్షను సెప్టెంబర్ 13న నిర్వహించారు. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు, కట్టుదిట్టమైన ఏర్పట్ల నడుమ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష రాయడానికి దేశ వ్యాప్తంగా 15.97 లక్షల మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. 13 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్ష ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 542 మెడికల్ కళాశాలల్లోని 80, 005 సీట్లను భర్తీ చేయనున్నారు.

  దీంతో పాటు 313 దంత వైద్య కళాశాలల్లోని 26, 949 సీట్లను సైతం భర్తీ చేయనున్నారు. ఈ ఏడాది 1205 ఎయిమ్స్, 200 JIPMER సీట్లు కూడా నీట్ లో భాగమయ్యాయి. ఈ సారి నీట్ పరీక్ష కట్ మార్కు ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే కరోనా కారణంగా పరీక్ష వాయిదా పడి ఆలస్యంగా జరగడంతో ప్రిపరేషన్ కు విద్యార్థులకు ఎక్కువ సమయం దొరికింది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: NEET 2020, Results

  ఉత్తమ కథలు