హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET Result 2020: కాసేపట్లో నీట్ 2020 ఫలితాలు... చెక్ చేయండి ఇలా

NEET Result 2020: కాసేపట్లో నీట్ 2020 ఫలితాలు... చెక్ చేయండి ఇలా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NEET 2020 Results | కాసేపట్లో నీట్ 2020 ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాల ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్-NEET 2020 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA విడుదల చేయనుంది. వాస్తవానికి ఈ ఫలితాలు ఇప్పటికే విడుదలౌతాయని అనుకున్నారు. కానీ ఫలితాలను అక్టోబర్ 16న విడుదల చేస్తామని గత సోమవారం నాడు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో విద్యార్థులు ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విద్యార్థులు https://ntaneet.nic.in/ లేదా https://mcc.nic.in/ లేదా https://nta.ac.in/ వెబ్‌సైట్లలో ఫలితాలు తెలుసుకోవచ్చు. విద్యార్థులు ఫలితాలు విడుదలైన 90 రోజుల్లోగా తమ రిజల్ట్స్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా మొత్తం 15.97 లక్షల మంది విద్యార్థులు నీట్ 2020 ఎగ్జామ్‌కు రిజిస్టర్ చేసుకున్నారు. సెప్టెంబర్ 13న నీట్ ఎగ్జామ్ జరిగింది. 14.37 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా పరీక్ష రాయకపోయిన విద్యార్థులకు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 14న మరోసారి నీట్ 2020 ఎగ్జామ్ నిర్వహించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. మరి కొందరు విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాశారు. ఈ రెండు పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి.

DRDO Jobs 2020: డీఆర్‌డీఓ జాబ్ నోటిఫికేషన్... దరఖాస్తుకు 4 రోజులే గడువు

Jobs: మొత్తం 550 ఉద్యోగాల భర్తీకి ఎన్ఎల్‌సీ ఇండియా నోటిఫికేషన్... నేటి నుంచి దరఖాస్తులు

NEET 2020 Results: నీట్ 2020 ఫలితాలు చెక్ చేయండి ఇలా


విద్యార్థులు ముందుగా https://ntaneet.nic.in/ లేదా https://mcc.nic.in/ లేదా https://nta.ac.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

అడ్మిట్ కార్డులో ఉన్న రోల్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.

వివరాలు ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయాలి.

ఫలితాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి.

ఫలితాల కాపీని ప్రింట్ తీసుకొని భవిష్యత్తు రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.

నీట్‌లో 50 పర్సెంటైల్ లేదా అంతకన్నా ఎక్కువ వచ్చిన వారు క్వాలిఫై అయినట్టు గుర్తిస్తారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 40 పర్సెంటైల్, దివ్యాంగులు 45 పర్సెంటైల్ సాధిస్తే క్వాలిఫై అయినట్టు పరిగణిస్తారు. నీట్ 2020 మార్కుల ఆధారంగా ఎన్‌టీఏ ఆల్ ఇండియా ర్యాంక్ లిస్ట్ ప్రిపేర్ చేస్తుంది. ర్యాంకులు సాధించిన విద్యార్థులు మెడికల్, డెంటల్ కాలేజీల్లో సీట్ల కోసం మెరిట్ బేస్డ్ కౌన్సిలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. నేషనల్ మెడికల్ కమిషన్ ఈ కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. ప్రతీ మెడికల్ కాలేజీలో ఆల్ ఇండియా కోటా కింద 15 శాతం సీట్లు రిజర్వ్ అయి ఉంటాయి.

First published:

Tags: Breaking news, Exams, NEET, NEET 2020, Results

ఉత్తమ కథలు