news18-telugu
Updated: October 12, 2020, 9:20 AM IST
ప్రతీకాత్మక చిత్రం
దేశ వ్యాప్తంగా ఉన్న వైద్య కశాశాలల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాల తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీప్రకటించింది. అక్టోబర్ 12(ఈ రోజు) నీట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఆన్ లైన్ లో ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలను విడుదల చేసే సమయం మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ntaneet.nic.in వెబ్ సైట్లో ఈ ఫలితాలను విడుదల కానున్నాయి. ఫలితాలను తెలుసుకునేందుకు అభ్యర్థులు వారి రోల్ నంబర్ తో పాటు పుట్టిన తేదీని వెబ్ సైట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. పరీక్ష ఫలితాలతో పాటు ఫైనల్ కీని సైతం అధికారులు విడుదల చేయనున్నారు. నీట్ ఫలితాలను ర్యాంక్ లీస్ట్ తో విడుదల చేయనున్నారు.
NEET Result Direct Linkనీట్ 2020 పరీక్షను సెప్టెంబర్ 13న నిర్వహించారు. కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు, కట్టుదిట్టమైన ఏర్పట్ల నడుమ నిర్వహించిన ఈ పరీక్ష రాయడానికి దేశ వ్యాప్తంగా 15.97 లక్షల మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. 13 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్ష ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 542 మెడికల్ కళాశాలల్లోని 80, 005 సీట్లను భర్తీ చేయనున్నారు. దీంతో పాటు 313 దంత వైద్య కళాశాలల్లోని 26, 949 సీట్లను సైతం భర్తీ చేయనున్నారు. ఈ ఏడాది 1205 ఎయిమ్స్, 200 JIPMER సీట్లు కూడా నీట్ లో భాగమయ్యాయి.
Published by:
Nikhil Kumar S
First published:
October 12, 2020, 9:13 AM IST