Home /News /jobs /

NEET RESULT 2019 KNOW ABOUT NEET RESULTS MERIT LIST CUT OFF AND RESERVATION DETAILS SS

NEET Result 2019: నీట్ 2019 ఫలితాలు... మెరిట్, సీట్ల వివరాలు తెలుసుకోండి

నీట్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

నీట్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

NEET Result 2019 | నీట్ స్కోర్ల ఆధారంగా రాష్ట్ర కౌన్సిలింగ్ అథారిటీలు మెడికల్, డెంటల్ సీట్లను కేటాయిస్తాయి.

    నీట్ 2019 ఫలితాలు రాగానే వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థుల దృష్టి అంతా మెరిట్, సీట్లు, కోటాలపై ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో సీట్ల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్-NEET 2019 పరీక్షను నిర్వహించింది. క్వాలిఫై అయిన విద్యార్థులు ఎంబీబీఎస్, బీడీఎస్ కాలేజీల్లో సీట్లను పొందొచ్చు. ఆల్ ఇండియా కోటా సీట్లకు ఎంపికైన 15 శాతం లోపు అభ్యర్థులకు సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను కేటాయిస్తుంది మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ-MCC. మిగతా 85 శాతం రాష్ట్ర కోటా కిందకు వస్తుంది. నీట్ స్కోర్ల ఆధారంగా రాష్ట్ర కౌన్సిలింగ్ అథారిటీలు మెడికల్, డెంటల్ సీట్లను కేటాయిస్తాయి. అంటే టాప్ 15 శాతంలో ఉన్నవాళ్లు ఇండియాలో ఎక్కడైనా మెడికల్ కాలేజీలో సీట్లను పొందొచ్చు.

    Read this: నీట్ 2019 ఫలితాలు... చెక్ చేసుకోండి ఇలా

    డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(DGHS), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నీట్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తుంటాయి. నీట్ మెడికల్ మెరిట్ లిస్ట్ 2019, నీట్ డెంటల్ మెరిట్ లిస్ట్ 2019 ఆధారంగా అడ్మిషన్ ప్రక్రియ ఉంటుంది. నీట్ 2019 మెరిట్ లిస్ట్‌లో చోటు సంపాదించడానికి జనరల్ కేటగిరీ అభ్యర్థులు 50 పర్సెంటైల్, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 40 పర్సెంటైల్, వికలాంగులు 45 పర్సెంటైల్ పొందాల్సి ఉంటుంది. ఈసారి ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు కూడా 10 శాతం సీట్లు కేటాయించడం విశేషం. ప్రభుత్వ కాలేజీల్లో ఓబీసీలకు 27 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం సీట్లు కేటాయించారు.

    నీట్ 2019 ఫలితాలు విడుదలైన తర్వాత కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. నీట్ కౌన్సిలింగ్ వివరాలను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ హోమ్ పేజీలో చూడొచ్చు. నీట్ 2018 కౌన్సిలింగ్ గతేడాది ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు జరిగింది. గతేడాది జనరల్ కేటగిరీకి 119, ఎస్సీ ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు 96 మార్కుల కటాఫ్ ఉంది.

    Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి


    ఇవి కూడా చదవండి:

    Air India Jobs: ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు... టెన్త్‌తో పాటు అనుభవం తప్పనిసరి

    SBI-Aadhaar: ఒక్క నిమిషంలో మీ ఎస్‌బీఐ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయండి ఇలా...

    Reliance Jio: జియో యూజర్లకు హాట్‌స్టార్ యాక్సెస్ ఫ్రీ... క్రికెట్ మ్యాచ్‌లు చూడండి ఇలా
    First published:

    Tags: CAREER, Exams, JOBS, NEET, NOTIFICATION, Results

    తదుపరి వార్తలు