NEET REGISTRATION WHICH WILL END IN A FEW HOURS CHECK THE REGISTRATION FEE DOCUMENTS APPLICATION PROCEDURE GH VB
NEET UG 2022: మరికొన్ని గంటల్లో ముగియనున్న నీట్ రిజిస్ట్రేషన్.. రిజిస్ట్రేషన్ ఫీజు, దరఖాస్తు విధానం తెలుసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
నీట్ యూజీ దరఖాస్తు ప్రక్రియ (Application Process) మరికొద్ది గంటల్లోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ- NTA) వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అభ్యర్థులను కోరుతోంది.
నేషనల్ లెవెల్ మెడికల్ కాలేజీల్లో(National Level Medical College) మెడిసిన్(Medicine) చదివేందుకు విద్యార్థులు(Students) నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(NEET Entrance Exam) కోసం ప్రిపేర్ అవుతుంటారు. అయితే ఈ ఏడాది నీట్ యూజీ ఎగ్జామ్ (NEET UG 2022) జులై 17న జరగనుంది. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్(Registration) ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అంతేకాదు ఈ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ (Application Process) మరికొద్ది గంటల్లోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ- NTA) వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అభ్యర్థులను కోరుతోంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్- అండర్ గ్రాడ్యుయేట్ (NEET-UG) 2022 దరఖాస్తు ప్రక్రియ మే 15న ముగియనుంది. అంతకుముందు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 6గా ఉంది. ఇటీవలే ఈ తేదీని పొడిగించారు. మరి నీట్ పరీక్షకు ఎలా అప్లై చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత, ఏ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలో తెలుసుకుందాం.
ఎన్టీఏ నీట్ యూజీ 2022 ఎంట్రన్స్ ఎగ్జామ్ జూలై 17న పెన్ & పేపర్ ఆధారిత పరీక్షగా జరుగుతుంది. పరీక్ష 200 నిమిషాలు ఉంటుంది. 200 ప్రశ్నలు ఉంటే 180 ప్రశ్నలకు మాత్రమే ఆన్సర్ చేయాలి. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు ఇస్తారు. నీట్ 2022 ఎగ్జామ్ 13 భాషల్లో కండక్ట్ చేస్తారు. అధికారిక వెబ్సైట్- neet.nta.nic.in ద్వారా నీట్ యూజీ 2022 పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
స్టెప్ 3: 'New Registration' పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీలో ఇన్స్ట్రక్షన్స్ చదివి కిందకి స్క్రోల్ చేసి 'Click Here To Proceed' లింక్‌పై నొక్కండి. అప్లికేషన్ ఫారమ్‌ను నమోదు చేసి ఫిల్ చేయండి.
స్టెప్ 4: అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి. అవసరమైన రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించండి.
స్టెప్ 5: అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్లోడ్ చేసి, భవిష్యత్ ఉపయోగం కోసం ప్రింట్అవుట్ తీసుకోండి.
అప్లికేషన్ ఫీజు
జనరల్ కేటగిరీ - ఫీజు రూ.1,500 నుంచి రూ.1,600కి పెరిగింది. భారతదేశం వెలుపల ఉన్న అభ్యర్థులకు - ఫీజు రూ.7,500 నుంచి రూ.8,500కి పెరిగింది. EWS/ఓబీసీ/NCL ఫీజు రూ.1,500. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.800గా నిర్ణయించారు.
1. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో. ఈ ఫొటో JPG ఫార్మాట్ లో 10 KB - 200 KB లోపు సైజులో స్కాన్ చేసిన కాపీగా ఉండాలి.
2. స్కాన్ చేసిన సిగ్నేచర్ ఫొటో. ఈ ఫొటో JPG ఫార్మాట్ లో 4 KB - 30 KB లోపు సైజులో ఉండాలి.
3. ఎడమ, కుడి చేతి వేళ్లు, బొటనవేలు ముద్రలు ఫొటోలు 10 KB - 200 KB మధ్య సైజుల్లో ఉండాలి.
4. పదో తరగతి పాస్ సర్టిఫికేట్
5. కేటగిరి సర్టిఫికేట్ (వర్తిస్తే)
6. డిజేబిలిటీ సర్టిఫికెట్ లేదా PwD సర్టిఫికేట్ (వర్తిస్తే)
7. సిటిజన్ షిప్ సర్టిఫికెట్ (వర్తిస్తే)
ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోని వారు అప్లికేషన్ విండో క్లోజ్ అయ్యే చివరి నిమిషం వరకు ఆలస్యం చేస్తే.. తప్పులు చేసే అవకాశముంది. కాస్త ముందుగా నిదానంగా దరఖాస్తు చేసుకోవడం మంచిది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.