NEET Phase 2 Registration: నేటితో ముగియనున్న నీట్ ఫేజ్ 2 రిజిస్ట్రేషన్, కరెక్షన్ గడువు.. మరి రిజల్ట్స్ ఎప్పుడంటే?

ప్రతీకాత్మక చిత్రం

నేషనల్​ ఎలిజిబిలిటీ కమ్​ ఎంట్రన్స్​ టెస్ట్​ (NEET)​ ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ (NEET Registration) ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇప్పటివరకు ఫేజ్​2 పరీక్ష కోసం నమోదు చేసుకోని అభ్యర్థులు ఈ రోజు రాత్రి 11.50 గంటలలోపు www.neet.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

  • Share this:
దేశవ్యాప్తంగా మెడికల్ ప్రవేశాలకు నిర్వహించే నేషనల్​ ఎలిజిబిలిటీ కమ్​ ఎంట్రన్స్​ టెస్ట్​ (NEET)​ ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ (NEET Phase 2 Registration) నేటితో ముగియనుంది. ఇప్పటివరకు ఫేజ్​2 పరీక్ష కోసం నమోదు చేసుకోని అభ్యర్థులు ఈ రోజు రాత్రి 11.50 గంటలలోపు www.neet.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్​ (NEET Registration) చేసుకున్న వారు.. దరఖాస్తు ఫారమ్​లో ఏవైనా తప్పులు చేసుంటే వాటిని సరిచేసుకోవచ్చు. అధికారిక నోటిఫికేషన్​ (NEET Notification) ప్రకారం, అభ్యర్థుల లింగం, జాతీయత, ఈ–మెయిల్​ ఐడీ (E-Mail), కేటగిరీ వంటివి సరిచేసుకునే (NEET (UG) 2021 Form Correction Phase 2) అవకాశం ఉంటుంది. అభ్యర్థులు చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు NEET ఫేజ్ 2 రిజిస్ట్రేషన్​ని నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అధికారులు సూచించారు.

నీట్​ 2021 ఫేజ్​ 2 రిజిస్ట్రేషన్, కరెక్షన్​​ ఎలా చేసుకోవాలి?

1. ముందుగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అధికారిక వెబ్‌సైట్​ www.neet.nta.nic.in ని సందర్శించండి.
2. హోమ్ పేజీలో ‘కరెక్షన్ ఫర్​ నీట్​ యూజీ 2021 ఫేజ్ 2’  (NEET (UG) 2021 Form Correction Phase 2)లింక్‌పై క్లిక్ చేయండి.
3. కొత్త విండో ఓపెన్​ అవుతుంది. అక్కడ మీ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్​ చేసి లాగిన్​ అవ్వండి.
AP EAPCET-2021 Counselling: ఏపీలో ప్రారంభమైన ఎంసెట్ కౌన్సెలింగ్.. కావాల్సిన ధ్రువపత్రాలు, తెలుసుకోవాల్సిన విషయాలివే

4. లాగిన్​ అయిన తర్వాత మీరు గతంలో తప్పుగా నమోదు చేసిన వివరాలను సరిదిద్దండి.
5. ఆ తర్వాత 'సబ్​మిట్​' ఆప్షన్​పై క్లిక్ చేయండి. మీ భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తు ఫారమ్​ను ప్రింటవుట్‌ తీసుకోండి.
UGC-NET 2021: విడుదలైన యూజీసీ నెట్ పరీక్షల తేదీలు.. వివరాలివే..

నెలాఖరులోగా నీట్​ ఫలితాలు..
అభ్యర్థులు తమ వివరాలను సరిచేసుకోవడానికి ఇదే చివరి అవకాశమని నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (ఎన్​టీఏ) స్పష్టం చేసింది. అందువల్ల, తప్పులు ఏమైనా నమోదు చేసి ఉంటే సరిచేసుకోవాలని కోరింది. గతంలో వన్ టైమ్ కరెక్షన్స్ చేసిన అభ్యర్థులకు కూడా ఈ కరెక్షన్​ విండోను అందుబాటులోకి తెచ్చింది. ఫేస్​2 రిజిస్ట్రేషన్​, కరెక్షన్​పై ఏవైనా సందేహాలుంటే ఎన్​టీఏ హెల్ప్ డెస్క్‌ నంబర్​ 011-40759000లో సంప్రదించవచ్చు. లేదా neet@nta.ac.inకు ఈ–మెయిల్ చేయవచ్చు.

నీట్​ అధికారిక వెబ్​సైట్​లో ఫేజ్ 2 రిజిస్ట్రేషన్​కి సంబంధించిన అన్ని వివరాలను చూసుకోవచ్చు. ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా సెప్టెంబర్​ 12న జరిగిన నీట్​ పరీక్షల ఫలితాలు ఈ నెలాఖరులోగా విడుదలయ్యే అవకాశం ఉంది.
Published by:Nikhil Kumar S
First published: