హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET PG 2021: కరోనా ఎఫెక్ట్.. మరో పరీక్షను వాయిదా వేసిన కేంద్రం

NEET PG 2021: కరోనా ఎఫెక్ట్.. మరో పరీక్షను వాయిదా వేసిన కేంద్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా నేపథ్యంలో దేశంలో మరో ప్రవేశ పరీక్షను వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి

కరోనా నేపథ్యంలో దేశంలో మరో పరీక్ష వాయిదా పడింది. ఇటీవల సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలను రద్దు చేస్తూ, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా నీట్ పీజీ ఎగ్జామ్ ను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర వైద్య శాఖ మంత్రి హర్ష వర్దన్ తెలిపారు. పరీక్షను తిరిగి ఎప్పుడు నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. వాస్తవానికి ఈ పరీక్ష మరో మూడు రోజుల్లో అనగా ఏప్రిల్ 18న జరగాల్సి ఉంది. అయితే దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న ఈ తరుణంలో పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ సమయంలో ఆఫ్ లైన్ పరీక్షను నిర్వహించడం సరికాదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది. పరీక్షను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే.. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 18న జరగాల్సి ఉన్న నీట్ పీజీ 2021 పరీక్షను వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ పరీక్ష తిరిగి నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. అభ్యర్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.


దేశంలో కరోనా ఎఫెక్ట్ తో వివిధ పరీక్షలను ముందు జాగ్రత్తగా వాయిదా వేస్తూ ఆయా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. నిన్న సీబీఎస్ఈ పది పరీక్షలను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది.  దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్ననేపథ్యంలో విద్యార్థులు పరీక్షలు రద్దు చేయాలని సోషల్ మీడియా ద్వారా ఆందోళన నిర్వహించడంతో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇటీవల తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను సైతం అధికారులు వాయిదా వేశారు. తాజాగా తెలంగాణ టెన్త్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేశారు. అయితే ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేసి సెకండ్ ఇయర్ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

First published:

Tags: CBSE Board Exams 2021, Exams, NEET 2021

ఉత్తమ కథలు