మెడికల్ కాలేజీలోని పీజీ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్ కోసం నీట్ పీజీ పరీక్ష సకాలంలో నిర్వహించబడుతుంది. నీట్ పీజీ 2023ని(NEET PG) వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. నీట్ పీజీ 2023 కోసం దాదాపు 2.09 లక్షల మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ ఏడాది ఈ పరీక్షను మార్చి 5న నిర్వహించనున్నారు. దీనిని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అంటే NBE నిర్వహిస్తుంది.
తోసిపుచ్చిన సుప్రింకోర్టు..
ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులు పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. నీట్ పీజీ 2023 పరీక్షను మార్చి 5న నిర్వహించనున్నారు. అయితే ఈ పరీక్షను మరో 2-3 నెలలు పొడిగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ డిమాండ్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
షెడ్యూల్ ప్రకారం కౌన్సెలింగ్ ..
షెడ్యూల్ ప్రకారం జులై 15న కౌన్సెలింగ్ జరుగుతుందని ద్విసభ్య ధర్మాసనానికి ఏఎస్‌జీ ఐశ్వర్య భాటి తెలిపారు. ASG మాట్లాడుతూ.. "రాబోయో తేదీల్లో పరీక్షను నిర్వహించడానికి తమ వద్ద తేదీలు ఖాళీగా లేవన్నారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ తరపున ఐశ్వర్య భాటి కోర్టుకు హాజరవుతున్నారు.
విచారణ వాయిదా..
నీట్ పీజీ 2023ని వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ గతంలో 24 ఫిబ్రవరి 2023న కూడా విచారణకు వచ్చింది. ఈ వ్యాజ్యాన్ని విచారిస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. జస్టిస్ రవీంద్ర భట్ మరియు జస్టిస్ దీపాంకర్ దత్‌లతో కూడిన డివిజన్ బెంచ్ NBEMS కోరిన సమాచారం మరియు అభ్యర్థుల పరిష్కారాలతో తన స్టాండ్‌ను సమర్పించాలని ఆదేశించింది. అనంతరం విచారణను ఫిబ్రవరి 27 సోమవారానికి వాయిదా వేయగా.. దీనికి కోర్టు తాజాగా తీర్పును ఇచ్చింది. యాథావిధంగా మార్చి 05న పరీక్షను నిర్వహించాలని తెలిపింది.
BREAKING: Supreme Court refuses to postpone NEET-PG 2023. #SupremeCourtOfIndia #SupremeCourt #NEETPG2023 pic.twitter.com/NGN92KfrKA
— Bar & Bench (@barandbench) February 27, 2023
అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ ఇలా..
-అధికారిక వెబ్‌సైట్- natboard.edu.in కి వెళ్లండి .
-హోమ్ పేజీలో ఇచ్చిన NNET-PG ట్యాబ్‌ను ఎంచుకోండి.
-అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేసి వివరాలను పూరించండి.
-ఇ-అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
-పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లడానికి అడ్మిట్ కార్డ్ ప్రింట్ అవుట్ తీసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, NEET, Neet exam