Home /News /jobs /

NEET PG COUNSELING WILL START FROM JANUARY 12 HEALTH MINISTER GAVE INFORMATION MK

NEET PG Counselling Date: జనవరి 12 నుంచి NEET పీజీ కౌన్సెలింగ్ ప్రారంభం...కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడి

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పీజీ కౌన్సెలింగ్ జనవరి 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ వాడియా ట్వీట్‌ చేశారు. రెసిడెంట్ డాక్టర్లకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన హామీ మేరకు, సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం 2022 జనవరి 12 నుంచి ఎంసీసీ ద్వారా నీట్-పీజీ కౌన్సెలింగ్ ప్రారంభిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.

ఇంకా చదవండి ...
    NEET PG Counselling Date:  నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పీజీ కౌన్సెలింగ్ జనవరి 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ వాడియా ట్వీట్‌ చేశారు. రెసిడెంట్ డాక్టర్లకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన హామీ మేరకు, సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం 2022 జనవరి 12 నుంచి ఎంసీసీ ద్వారా నీట్-పీజీ కౌన్సెలింగ్ ప్రారంభిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ఈ నిర్ణయం ద్వారా కరోనాపై పోరులో దేశానికి మరింత బలం చేకూరుస్తుందని ఆయన ట్వీట్ ద్వారా ఆశాభావం వ్యక్తం చేశారు. నీట్ యూజీ, పీజీల్లో ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం, ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తూ నీట్ కౌన్సెలింగ్‌ను ప్రవేశపెట్టేందుకు ఇటీవల సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. ఆ తర్వాత మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) UG, PG కౌన్సెలింగ్ 2021కి సంబంధించి నోటీసు కూడా జారీ చేసింది. ఎంసీసీ జారీ చేసిన నోటీసులో సైతం సుప్రీంకోర్టు నిర్ణయాన్ని విద్యార్థులకు తెలియజేసింది. అలాగే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్ mcc.nic.in లో త్వరలో విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.



    ఈ అంశంపై మార్చి నెలలో సమగ్ర విచారణను కోర్టు నిర్వహించనుంది. సుప్రీంకోర్టులో, ఆల్ ఇండియా కోటా మెడికల్ సీట్లలో, OBCలకు 27 శాతం , EWS విద్యార్థులకు 10 శాతంగా సీట్లలో కోటా నిర్ణయించారు. అంతే కాదు ఈ కోటాకు రక్షణ కల్పించాలని కేంద్రం , వైద్య సలహా కమిటీ (MCC) జూలై 29 నోటిఫికేషన్‌ను పిటిషన్ ద్వారా సవాలు చేసింది.

    నీట్ కౌన్సెలింగ్‌లో జాప్యం కారణంగా కొత్త అడ్మిషన్లు నిలిచిపోయాయి అన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మరోవైపు కరోనా కాలంలో, ఆసుపత్రుల్లో పనిచేస్తున్న రెసిడెంట్ వైద్యులపై పనిభారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వైద్యులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: NEET

    తదుపరి వార్తలు