నీట్ పీజీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితం తర్వాత ఇప్పుడు కౌన్సెలింగ్ వంతు వచ్చింది. దీనిలో ఎంపికైన అభ్యర్థులు ఇప్పుడు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా NEET PG 2023 కౌన్సెలింగ్ కోసం వేచి చూస్తున్నారు. దీనికి సంబంధించి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే.. కోర్టు విచారణ సందర్భంగా కౌన్సెలింగ్ జూలై 15, 2023 నుండి ప్రారంభమవుతుందని NBE తెలిపింది. దీనితో పాటు స్కోర్‌కార్డులు కూడా త్వరలో విడుదల కానున్నాయి. గత నెలలో.. నీట్ పీజీ వాయిదా పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. జూలై 15 నుంచి నీట్ పీజీ కౌన్సెలింగ్‌ను ప్రారంభించాలని NBE కోరుకుంటున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. మార్చిలో నీట్ పీజీ పరీక్ష జరిగినా ఆగస్టు 11లోపు కౌన్సెలింగ్ ప్రారంభం కాబోదని భావించిన వారిపై ఈ విధంగా స్పందించారు.
ఈ కారణంగానే జులై 15 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరం MD, MS, DNB మరియు డిప్లొమా కోర్సులకు నీట్ PG పరీక్ష యొక్క కట్-ఆఫ్ క్రింది విధంగా ఉంది. ఇది జనరల్ మరియు EWS కేటగిరీకి 291, జనరల్ - PWBD అభ్యర్థులకు 274 మరియు SC, ST మరియు OBC అభ్యర్థులకు 257 కటాఫ్ ఉంది. ఎంపికైన అభ్యర్థులు ఇప్పుడు ప్రవేశ ప్రక్రియను పూర్తి చేయడానికి NEET PG కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ అధికారిక వెబ్‌సైట్ mcc.nic.inని సందర్శించడం ద్వారా 50 శాతం ఆల్ ఇండియా కోటా సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు .
దేశవ్యాప్తంగా 2023-24లో వైద్య విద్యాసంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేషన్(పీజీ) మెడికల్ సీట్ల భర్తీకి మార్చి 05వ తేదీ ఆదివారం నీట్ ప్రవేశపరీక్ష(NEET Entrance Exam) జరిగిన విషయం తెలిసిందే. ప్రైవేటు, ప్రభుత్వ వైద్య విద్యాసంస్థల్లో డీఎన్బీ, పీజీ డిప్లొమా, ఎంఎస్, ఎండీ కోర్సులకు పరీక్ష నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 63,842 వేల పీజీ సీట్లు ఉండగా, వాటిలో తెలంగాణ లో 2,544 సీట్లు ఉన్నాయి. వీటిలో 1060 సీట్లు ప్రైవేట్ విద్యాసంస్థల్లో.. 1393 సీట్లు ప్రభుత్వ విద్యాసంస్థల్లో సీట్లు ఉన్నాయి. మార్చి 5న జరిగిన ఈ పరీక్షను దేశవ్యాప్తంగా 271 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. వీటిలో తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం , కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సత్తుపల్లి, సూర్యాపేట , కోదాడ కేంద్రాల్లో నిర్వహించగా.. ఫలితాలను మార్చి 15న విడుదల చేశారు.
తెలంగాణ నుంచి సుమారు 8 వేల మంది నీట్ పరీక్ష రాశారని, వారిలో సుమారు 50 శాతం మంది క్వాలిఫై అయి ఉంటారని వైద్యవర్గాలు వెల్లడించాయి. మొత్తం 800 మార్కులకు జనరల్ కేటగిరి, ఈడబ్యుఎస్ కేటగిరిలకు కటాఫ్ మార్కులు 291 కాగా, పీడబ్ల్యూడీలకు 275, ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ మార్కులు 257 గా నిర్ణయించారు. అభ్యర్థులు స్కోర్ కార్డును మార్చి 25 నుంచి nbe.edu.in ఇన్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బోర్డు వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, NEET, NEET 2023, Neet pg