• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • NEET PG ADMIT CARDS TO BE RELEASED ON ON APRIL 12 HERE FULL DETAILS NS

ఆ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తి లేదన్న అధికారులు.. రేపే హాల్ టికెట్లు విడుదల

ఆ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తి లేదన్న అధికారులు.. రేపే హాల్ టికెట్లు విడుదల

ప్రతీకాత్మక చిత్రం

NEET PG 2021: నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తి లేదని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్(NBE) తెలిపింది. కట్టుదిట్టమైన కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్ష నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

  • Share this:
    నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్(NEET PG) అడ్మిట్ కార్డులు ఏప్రిల్ 12న విడుదల కానున్నాయి. ఏప్రిల్ 18న జరగనున్న ఈ పరీక్ష వాయిదా పడుతుందని అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షను వాయిదా వేసే ఆలోచన లేదని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్(NBE) స్పష్టం చేసింది. కట్టుదిట్టంగా కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది. హాల్ టికెట్లు వెబ్ సైట్లోకి అందుబాటులోకి వచ్చిన అనంతరం అభ్యర్థులకు మెసేజ్ అలర్ట్ రానుంది. కరోనా ఆంక్షలు ఉన్న ప్రాంతాల్లో అడ్మిట్ కార్డులు ట్రావెల్ పాస్ లుగా పని చేస్తాయని అధికారులు తెలిపారు. సోషల్ డిస్టెన్స్ పాటించేలా కరోనా కేంద్రాల సంఖ్యను ఈ సారి భారీగా పెంచారు. దేశవ్యాప్తంగా ఈ సారి ఈ పరీక్షకు దాదాపు 1.75 లక్షల మంది హాజరు కానున్నారు.

    పరీక్ష కేంద్రాల్లో ప్రవేశానికి వేర్వేరు టైం స్లాట్లను కేటాయించారు. విద్యార్థులు ఏ సమయానికి కేంద్రానికి రావాలన్న విషయాన్ని ఎస్ఎంఎస్ ద్వారా అభ్యర్థులకు తెలియజేస్తారు. ఎగ్జామ్ సెంటర్ లోకి అభ్యర్థులు ప్రవేశించే ముందు టెంటరేచర్ ను పరీక్షించనున్నారు. ఎవరికైనా టెంపరేచర్ సాధారణ కంటే అధికంగా ఉంటే వారికి ప్రత్యేక గదిలో పరీక్ష నిర్వహించనున్నారు.

    NEET PG Admit Card ఎలా డౌన్ లోడ్ చేయాలంటే..
    -అభ్యర్థులు మొదటగా nbe.edu.in/natboard.edu.in వెబ్ సైట్లను సందర్శించాల్సి ఉంటుంది.
    -అనంతరం అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ ను నమోదు చేయాల్సి ఉంటుంది.
    -అనంతరం మీకు అడ్మిట్ కార్డ్ లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీ అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవాలి.
    -అనంతరం అడ్మిట్ కార్డు ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు