హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET PG 2022: నీట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష వాయిదాపై సుప్రీం కీలక తీర్పు.. వివరాలివే

NEET PG 2022: నీట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష వాయిదాపై సుప్రీం కీలక తీర్పు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్-నీట్‌ పీజీ 2022 (NEET PG 2022) కి సంబంధించి సుప్రీంకోర్లు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష వాయిదా వేయాలన్న పిటిషనర్ల వాదనను సుప్రీం తోసిపుచ్చింది.

నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్-నీట్‌ పీజీ 2022 (NEET PG 2022) కి  సంబంధించి సుప్రీంకోర్లు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష (Exam) వాయిదా వేయాలన్న పిటిషనర్ల వాదనను సుప్రీం తోసిపుచ్చింది. ఎగ్జామ్ ను వాయిదా వేయడానికి నిరాకరించింది. నీట్‌ పీజీ-2021 కౌన్సిలింగ్‌ ఇంకా పూర్తి కానందున.. చదువుకోవడానికి తగినంత సమయం లేకపోవడంతో ఎగ్జామ్స్ ను వాయిదా వేయాలని కోరుతూ వైద్యుల బృందం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో పిటిషనర్ల వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌పై విచారణ జరిపింది. శుక్రవారం ఈ మేరకు తీర్పును వెల్లడించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు (Supreme Court) పలు కీలక వాఖ్యలు చేసింది.

పరీక్షలను వాయిదా వేస్తే గందరగోళం ఏర్పడుతుందని తెలిపింది. ఇలా జరిగితే వైద్యుల కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో పరీక్షను వాయిదా వేయలేమని సుప్రీం స్పష్టం చేసింది. ఇంకా.. నీట్‌ పీజీ 2022 పరీక్షలు వాయిదా వేయాలన్నది సరైన ఆలోచన కాదని వాఖ్యానించింది. వాయిదా వేస్తే 2 లక్షల మంది విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపింది.

NEET 2022: మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? ఫ్రీ కోచింగ్ ఇస్తున్న ఆన్‌లైన్ రిసోర్సెస్ ఇవే..

ఇంకా ఎగ్జామ్ ను వేయడం వల్ల రోగులకు వైద్యం, వైద్యుల కెరీర్ పై ప్రభావం చూపుతుందని సుప్రీం వెల్లడించింది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మే 21న నీట్ పీజీ పరీక్షను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థులు మే 16 నుంచి అధికారిక వెబ్ సైట్ nbe.edu.in నుంచి అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచనున్నారు.

First published:

Tags: Career and Courses, Exams, NEET 2022