Home /News /jobs /

NEET PG 2022 PG EDIT WINDOW OPEN AND CORRECT THE MISTAKES IN YOUR APPLICATION LIKE THIS GH EVK

NEET PG 2022: నీట్​ పీజీ 2022 ఎడిట్​ విండో ఓపెన్.. మీ అప్లికేషన్​లో తప్పులను ఇలా సరి చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NEET 2022 | దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక మెడికల్​ కాలేజీల్లో పోస్ట్​ గ్రాడ్యుయేషన్​ అడ్మిషన్ల కోసం ఏటా నిర్వహించే​ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్- ఫర్​​ పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్ పీజీ) 2022 ఎడిట్​​ విండో ఓపెన్ అయ్యింది. గతంలో నీట్​ పీజీకి దరఖాస్తు చేసే సమయంల?

ఇంకా చదవండి ...
దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక మెడికల్​ కాలేజీ (Medical College) ల్లో పోస్ట్​ గ్రాడ్యుయేషన్​ అడ్మిషన్ల కోసం ఏటా నిర్వహించే​ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్- ఫర్​​ పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్ పీజీ) 2022 ఎడిట్​​ విండో ఓపెన్ అయ్యింది. గతంలో నీట్​ పీజీకి దరఖాస్తు చేసే సమయంలో ఏవైనా వివరాలు తప్పుగా నమోదు చేసి ఉంటే ఈ ఎడిట్​​ విండో ద్వారా వివరాలను సరిచేసుకోవచ్చు. సవరించిన దరఖాస్తులను అభ్యర్థులు ఏప్రిల్ 7లోపు సబ్​మిట్​ చేయాల్సి ఉంటుంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారిక వెబ్‌సైట్ www.nbe.edu.in ద్వారా అప్లికేషన్​లోని కరెక్షన్​ విండో ద్వారా తప్పులను సరిచేసుకోవచ్చు. అభ్యర్థులు తమ​ నీట్​​ ఐడీ, పాస్​వర్డ్​తో లాగిన్ అయ్యి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు.

Job Openings: ప్ర‌ముఖ ఆడిట్ కంపెనీలో డిగ్రీ అర్హ‌త‌తో జాబ్స్‌.. అప్లికేష‌న్ ప్రాసెస్‌

ఇక, నీట్ అప్లికేషన్​లో తప్పుగా అప్​లోడ్​ చేసిన ఫోటోలను సరిచేయడానికి ఫైనల్ కరెక్షన్​ విండో ఏప్రిల్ 26న ఓపెన్ అవుతుంది. ఈ కరెక్షన్ విండో ఏప్రిల్ 30, 2022 వరకు అందుబాటులో ఉంటుంది. నీట్​ పీజీ 2022 పరీక్షను మే 21న దేశవ్యాప్తంగా, విదేశాల్లోని అనేక పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తారు.

నీట్​ పీజీ 2022లో మార్పులు చేయడం ఎలా?

Step 1 - నేషనల్​ బోర్డ్​ ఆఫ్​ ఎగ్జామినేషన్​ అధికారిక వెబ్‌సైట్ www.nbe.edu.inకి వెళ్లండి.

ISRO Jobs: ఇస్రో-ఐఐఆర్ఎస్‌లో జాబ్స్‌.. వేత‌నం రూ. 56,100.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

Step 2 - హోమ్‌పేజీలో, 'NEET PG 2022' లింక్‌పై క్లిక్ చేయండి.

Step 3 - మీ లాగిన్ డీటెయిల్స్​ను ఎంటర్ చేయండి.

Step 4 - ఇప్పుడు, కరెక్షన్​ విండోపై క్లిక్ చేసి, దరఖాస్తు ఫారమ్‌లో మార్పులు చేయండి.

ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, నీట్​ పీజీ2022 దరఖాస్తు ఫారమ్‌ను సబ్​మిట్​ చేయండి. కన్ఫర్మేషన్​ పేజీని డౌన్‌లోడ్ చేయండి. తదుపరి అవసరాల కోసం హార్డ్ కాపీని మీ వద్దే ఉంచుకోండి.

Jobs in Andhra Pradesh: విశాఖ‌ప‌ట్నం ఏపీవీవీపీలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

నీట్ పీజీ 2022 అడ్మిట్ కార్డులు మే 16న విడుదలవుతాయి. అడ్మిట్ కార్డ్‌లో అభ్యర్థుల పరీక్ష నగరం, పరీక్షా కేంద్రం, ఎగ్జామ్​ డేట్​, పరీక్షా కేంద్రంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి సమగ్ర వివరాలను పొందుపరుస్తారు. కాగా, నీట్​ పీజీ 2022 పరీక్షను దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పరీక్షా కేంద్రాల్లో మే 21న నిర్వహిస్తారు. వీటి ఫలితాలు జూన్ 20, 2022 నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాల విడుదల తేదీపై త్వరలోనే మరింత స్పష్టత రానుంది. నీట్​ పీజీ2022కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు నేషనల్​ బోర్డ్​ ఆఫ్​ ఎగ్జామినేషన్​ www.nbe.edu.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
Published by:Sharath Chandra
First published:

Tags: Career and Courses, EDUCATION, NEET 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు