హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET PG 2022: నీట్ పీజీ స్టేట్ కోటా కౌన్సిలింగ్‌ గడువు పొడిగింపు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

NEET PG 2022: నీట్ పీజీ స్టేట్ కోటా కౌన్సిలింగ్‌ గడువు పొడిగింపు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నీట్ పీజీ-2022 కౌన్సిలింగ్‌ ప్రక్రియ జరుగుతున్న క్రమంలో.. తాజాగా మెడికల్ కౌన్సిలింగ్‌ కమిటీ(MCC) కీలక ప్రకటన జారీ చేసింది. నీట్ పీజీ స్టేట్ కోటా కౌన్సిలింగ్‌‌ ప్రక్రియకు సంబంధించిన అడ్మిషన్‌ లాస్ట్ డేట్‌ను పొడిగించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

నీట్ పీజీ-2022 కౌన్సిలింగ్‌ ప్రక్రియ జరుగుతున్న క్రమంలో.. తాజాగా మెడికల్ కౌన్సిలింగ్‌ కమిటీ(MCC) కీలక ప్రకటన జారీ చేసింది. నీట్ పీజీ స్టేట్ కోటా కౌన్సిలింగ్‌‌ ప్రక్రియకు సంబంధించిన అడ్మిషన్‌ లాస్ట్ డేట్‌ను పొడిగించింది. దీంతో రాష్ట్ర కోటా సీట్లకు అడ్మిషన్, కౌన్సిలింగ్‌ కోసం చివరి తేదీ ఇప్పుడు జనవరి 14గా నిర్ణయించింది.

జనవరి 14న ముగించాలని..

నీట్ పీజీ కౌన్సిలింగ్‌- 2022కు సంబంధించి స్టేట్ అథారిటీ‌స్ కోసం MCC ఓ నోటీస్ జారీ చేసింది. ఇందులో నీట్ పీజీ ఆలిండియా కోటా (AIQ) కౌన్సిలింగ్‌ ముగిసే తేదీ(జనవరి 14)నే స్టేట్ కోటా కౌన్సిలింగ్‌‌ కూడా ముగించాలని సూచించింది. నీట్ పీజీ-2022 కౌన్సిలింగ్‌ స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ షెడ్యూల్ ప్రకారం.. ఆల్ ఇండియా కోటా (AIQ) సీట్ల కోసం కౌన్సిలింగ్‌ చివరి తేదీ జనవరి 14గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే అదే తేదీనే(జనవరి 14) స్టేట్ కౌన్సిలింగ్‌ ప్రక్రియను కూడా ముగించాలని మెడికల్ కౌన్సిలింగ్‌ కమిటీ తాజాగా స్టేట్ అథారిటీలను కోరింది.

అధికారిక ప్రకటన ఇలా..

‘2022-23 పీజీ కౌన్సిలింగ్‌ కోసం అడ్మిషన్ చివరి తేదీని పొడిగింపుపై అనేక రాష్ట్రాల మెడికల్ కౌన్సిలింగ్‌ కమిటీల నుంచి రిప్రజెంటేషన్స్ స్వీకరించాం. AIQ కౌన్సిలింగ్‌, స్టేట్ కౌన్సిలింగ్‌ కోసం ఒకే టైమ్‌లైన్ ఉండాలని అధికారులు నిర్ణయించారు. దీంతో స్టేట్ కోటాకు అడ్మిషన్/కౌన్సిలింగ్‌ చివరి తేదీ 14.01.2023 వరకు పొడిగించాం’ అని మెడికల్ కౌన్సిలింగ్‌ కమిటీ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

ఇతర కోటా సీట్లకు కూడా..

ఆల్ ఇండియా కోటా, సెంట్రల్ యూనివర్సిటీ, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్, డీమ్డ్ యూనివర్సిటీ, PG DNBలకు సంబంధించిన MD, MS, డిప్లొమా, PG DNB అండ్ MDS ప్రోగ్రామ్‌ల్లో ఖాళీగా ఉన్న PG సీట్ల కోసం ప్రత్యేక స్ట్రే వేకెన్సీ రౌండ్‌ను కూడా మెడికల్ కౌన్సిలింగ్‌ కమిటీ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుంది.

స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ అలాట్‌మెంట్ రిజల్ట్స్..

నీట్ పీజీ కౌన్సిలింగ్‌- 2022 స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ అలాట్‌మెంట్ ఫలితాలను జనవరి 10న ప్రకటించింది. ఎంసీసీ అధికారిక వెబ్‌సైట్mcc.nic.in‌లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ NEET PG రోల్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్‌ని ఉపయోగించి నీట్ పీజీ స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కేటాయింపు ఫలితాన్ని చెక్ చేసుకోవచ్చు. అయితే ఇది తాత్కాలికం మాత్రమే. NEET PG తాత్కాలిక సీట్ల కేటాయింపు- 2022 విడుదలైన తర్వాత, అభ్యర్థులు అభ్యంతరాలను తెలియజేయవచ్చు. అభ్యంతరాలు చెల్లుబాటు అయితే, అధికారులు అలాట్‌మెంట్‌ను పునఃపరిశీలిస్తారు. ఆ తరువాత స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కోసం తుది సీట్ల కేటాయింపును వెల్లడించనున్నారు.

First published:

Tags: Career and Courses, JOBS, NEET 2022

ఉత్తమ కథలు