హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET PG: త్వరలో నీట్ పీజీ 2022 కౌన్సెలింగ్ షెడ్యూల్.. మెడికల్ సీటు కోసం అవసరమైన డాక్యుమెంట్స్ ఇవే

NEET PG: త్వరలో నీట్ పీజీ 2022 కౌన్సెలింగ్ షెడ్యూల్.. మెడికల్ సీటు కోసం అవసరమైన డాక్యుమెంట్స్ ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NEET PG 2022 కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అభ్యర్థులు తప్పనిసరిగా తీసుకురావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ లిస్ట్‌ను MCC తాజాగా నోటిఫై చేసింది. విద్యార్థులు కొన్ని డాక్యుమెంట్స్‌ తప్పనిసరిగా తీసుకురావాలని సంస్థ పేర్కొంది. అవేంటో చూద్దాం.

ఇంకా చదవండి ...

NEET PG: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్‌- పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG) 2022 కౌన్సెలింగ్ షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. ఈ వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు ప్రకటించింది మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC). షెడ్యూల్ విడుదలైన తర్వాత mcc.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. NEET PG 2022 కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అభ్యర్థులు తప్పనిసరిగా తీసుకురావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ లిస్ట్‌ను MCC తాజాగా నోటిఫై చేసింది.

Bank New Rule: ఈ బ్యాంక్ చెక్ నిబంధనల్లో మార్పు.. ఆ తేదీ నుంచి అమల్లోకి..

నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ అంతా గతేడాది మాదిరిగానే జరగనుంది. కౌన్సెలింగ్ ప్రక్రియలో నాలుగు రౌండ్లు ఉంటాయి. అవి.. రౌండ్ 1, రౌండ్ 2, మాప్-అప్ రౌండ్, స్ట్రే వేకెన్సీ. ఈ రౌండ్స్‌కు సంబంధించిన వివరాలను MCC త్వరలో షెడ్యూల్ ద్వారా విడుదల చేయనుంది. అయితే రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ కోసం విద్యార్థులు కొన్ని డాక్యుమెంట్స్‌ తప్పనిసరిగా తీసుకురావాలని సంస్థ పేర్కొంది. అవేంటో చూద్దాం.

 NEET PG కౌన్సెలింగ్‌కు అవసరమైన డాక్యుమెంట్స్

1. NEET PG 2022 అడ్మిట్ కార్డ్

2. NEET PG 2022 రిజల్ట్ కార్డ్

3. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్

4. వ్యాలీడ్ ID ప్రూఫ్

5. MBBS లేదా BDS ప్రొఫెషనల్ పరీక్షల మార్క్ షీట్లు

6. MBBS లేదా BDS డిగ్రీ సర్టిఫికేట్

7. ఇంటర్న్‌షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్

8. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్

9. కుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే)

10. డిసెబిలిటీ సర్టిఫికేట్ (వర్తిస్తే)

TS Inter Students: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈ ఒక్కరోజే ఛాన్స్.. వివరాలివే

నీట్ పీజీ కౌన్సెలింగ్ సమయంలో అభ్యర్థులు కోర్సులు, కాలేజీల కోసం తమ ప్రాధాన్యతలను (preferences) పేర్కోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అభ్యర్థుల ప్రిఫరెన్స్ ఆధారంగా అధికార యంత్రాంగం సీట్లను కేటాయిస్తుంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) జూన్ 1న NEET PG 2022 ఫలితాలను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. NEET PG 2022 కటాఫ్‌ స్కోర్ సాధించి, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు NEET PG కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి అర్హులు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య సంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ESIC, AFMS ఇన్‌స్టిట్యూట్‌లలోని AIQ సీట్ల కోసం NEET PG 2022 కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

ప్రభుత్వ సంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ESIC, AFMS ఇన్‌స్టిట్యూట్స్‌లో 50 పర్సంటైల్ స్కోర్ AIQ ఉన్న సీట్ల కోసం MCC.. NEET PG, NEET MDS 2022 కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తుందని విద్యార్థులు గమనించాలి. రాష్ట్రాల కౌన్సెలింగ్ ఏజెన్సీలు రాష్ట్ర కోటా సీట్లలో 50 శాతం సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తాయి.

First published:

Tags: EDUCATION, Medical college, NEET, NEET 2022

ఉత్తమ కథలు