నీట్ ఎండీఎస్ ఫలితాలు వెలువడ్డాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలను ప్రకటించింది. మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (NEET MDS) అధికారిక వెబ్‌సైట్ natboard. edu.in లో ఈ ఫలితాలు విడుదల అయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు పోర్టల్‌ను సందర్శించడం ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. నీట్ MDS 2023 పరీక్ష మార్చి 1, 2023న జరిగింది. అభ్యర్థుల వ్యక్తిగత స్కోర్‌కార్డ్‌ని అధికారిక వెబ్‌సైట్ నుండి మార్చి 20, 2023న లేదా తర్వాత డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఇంటర్న్‌షిప్ ముగిసిన తర్వాత NEET MDS కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. కౌన్సెలింగ్ అభ్యర్థులకు సంబంధించిన తాజా అప్‌డేట్‌లను పొందడానికి అధికారిక వెబ్‌సైట్‌ను https://natboard.edu.in/index సందర్శించాలి.
ఫలితాన్ని ఇలా చెక్ చేసుకోండి..
-ముందుగా అభ్యర్థులు NBEMS అధికారిక వెబ్‌సైట్‌ని nbe.edu.in లేదా natboard.edu.in సందర్శించండి.
-ఇక్కడ NEET-MDS 2023 ఫలితంపై క్లిక్ చేయండి.
-NEET MDS PDF స్క్రీన్‌పై కనిపిస్తుంది.
-అక్కడ మీ యొక్క ఫలితాన్ని చెక్ చేసుకోవచ్చు.
-తదుపరి అవసరం కోసం ఆ రిజల్ట్స్ కాపీని ప్రింట్ అవుట్ తీసుకోండి.
నీట్ ఎండీఎస్ కట్ ఆఫ్ ఇలా ఉంది. జనరల్ అభ్యర్థులకు మినిమం క్వాలిఫైంగ్ మార్కులు 50 శాతం రావాలి. వీరికి కట్ ఆఫ్ 272గా ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు అర్హత మార్కులు 40 శాతం. వీరికి కట్ ఆఫ్ మార్కులు 238గా ఉంది. జనరల్ దివ్యాంగులకు 45 శాతం అంటే.. 255 మార్కులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, NEET, NEET 2022