NEET MDS: నీట్ ఎండిఎస్​ కౌన్సెలింగ్​కు లైన్​ క్లియర్​..4 వారాల్లోగా నిర్వహిస్తామని సుప్రీంకు తెలిపిన కేంద్రం

ప్రతీకాత్మకచిత్రం

నీట్​ ఎండీఎస్​ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్–మాస్టర్స్​ ఇన్​ డెంటల్ సర్జరీ) కౌన్సెలింగ్​కు లైన్​ క్లియర్​ అయ్యింది. నాలుగు వారాల్లోగా కౌన్సెలింగ్​ ప్రక్రియ ప్రారంభిస్తామని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.

  • Share this:
నీట్​ ఎండీఎస్​ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్–మాస్టర్స్​ ఇన్​ డెంటల్ సర్జరీ) కౌన్సెలింగ్​కు లైన్​ క్లియర్​ అయ్యింది. నాలుగు వారాల్లోగా కౌన్సెలింగ్​ ప్రక్రియ ప్రారంభిస్తామని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. కాగా, నీట్ ఎండిఎస్–2021 ప్రవేశ పరీక్ష పూర్తై ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కౌన్సెలింగ్​ నిర్వహించకపోవడంపై కొంత మంది విద్యార్థులు సుప్రీం కోర్డును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు వెంటనే కౌన్సెలింగ్​ ప్రక్రియ ప్రారంభించాలని గతవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో, రాబోయే 4 వారాల్లో కౌన్సెలింగ్​ ప్రక్రియ ప్రారంభిస్తామని సుప్రీం కోర్టుకు ఈ రోజు జరిగిన విచారణలో కేంద్రం తెలియజేసింది. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సుప్రీంకు లిఖిత పూర్వక సమాధానమిచ్చింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ విధానాల ప్రకారం ఈ కౌన్సెలింగ్​ను నిర్వహిస్తామని తెలిపింది.

కాగా, దంతవైద్యంలో మాస్టర్స్​ డిగ్రీ (ఎండీఎస్​) ప్రవేశాలకు కౌన్సెలింగ్​ నిర్వహించడంలో కేంద్రం తాత్సారం చేస్తుందని, తద్వారా విద్యాసంవత్సరం నష్టపోతున్నామని గత వారం కొంత మంది విద్యార్థులు సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై జస్టిస్​ డీవై చంద్ర చూడ్​, ఎంఆర్​ షాతో కూడిన దర్మాసనం విచారణ చేపట్టింది. ‘వాళ్లంతా అర్హత పొందిన బ్యాచిలర్​ ఇన్​ డెంటల్​ సర్జరీ (బీడీఎస్​) విద్యార్థులు. గతేడాది నుంచి వారికి కౌన్సెలింగ్​ ఎందుకు నిర్వహించడంల ఏదు. వారికి డిగ్రీ రాకుండా మీరు అడ్డుకుంటున్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం సరైన పద్ధతి కాదు. కౌన్సెలింగ్​ ఆలస్యం కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రానికి స్పృహ ఉండాలి. వెంటనే కౌన్సెలింగ్​ ప్రక్రియ ప్రారంభించాలి. కౌన్సెలింగ్​ ఎప్పడు నిర్వహిస్తారో వారం రోజుల్లోగా చెప్పాలి. వారం వ్యవధిలో నీట్​ ఎండీఎస్​ కౌన్సెలింగ్​ షెడ్యూల్​ను విడదల చేయాలి.”అని కేంద్రాన్ని ఆదేశించింది.

నాలుగు వారాల్లోగా నిర్వహిస్తాం..

కాగా, ఈ నీట్ ఎమ్‌డిఎస్ పరీక్షను డిసెంబర్ 2020 లో నిర్వహించారు. ఈ పరీక్ష దాని ఫలితాలు కూడా 2020 డిసెంబర్‌లోనే విడుదలయ్యాయి. అయితే, అప్పటి నుండి కేంద్రం కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించలేదు. నీట్ ఎండిఎస్ కోర్సుల్లో విద్యార్థులు ప్రవేశం పొందటానికి కౌన్సెలింగ్ ప్రక్రియ చాలా ముఖ్యమైన దశ. రాత పరీక్ష తర్వాత ఒక విద్యార్థి ఈ రౌండ్ క్లియర్ చేస్తేనే కళాశాల్లో ప్రవేశాలు పొందుతారు. విద్యార్థులు కౌన్సెలింగ్ అథారిటీకి ఎన్ని సార్లు అభ్యర్థనలు చేసినప్పటికీ, కౌన్సెలింగ్ తేదీలపై ఎటువంటి స్పష్టతనివ్వలేదు. దీంతో, తమకు న్యాయం చేయాలని కొంత మంది విద్యార్థులు సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు.

ఇది క్లిక్ చేసి చూడండి...
Published by:Krishna Adithya
First published: