Home /News /jobs /

NEET JEE MERGE WITH CUET UGC PLAN TO CONDUCT ONLY ONE ENTRANCE EXAM FOR NEET JEE ADMISSIONS KNOW DETAILS VB

One Nation-One Test: NEET, JEE, UGC విద్యార్థులకు అలర్ట్.. ఇక నుంచి ఒక్కటే పరీక్ష.. వివరాలిలా..

One Nation-One Test: NEET, JEE, UGC విద్యార్థులకు అలర్ట్.. ఇక నుంచి ఒక్కటే పరీక్ష.. వివరాలిలా..

One Nation-One Test: NEET, JEE, UGC విద్యార్థులకు అలర్ట్.. ఇక నుంచి ఒక్కటే పరీక్ష.. వివరాలిలా..

One Nation-One Test: వచ్చే ఏడాది నీట్‌, జేఈఈ పరీక్షలకు హాజరవ్వాలనుకుంటున్న విద్యార్థులకు ముఖ్య గమనిక. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) మెడికల్ మరియు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలను కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET UG)తో విలీనం చేసే ఆలోచనలో ఉంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India
వచ్చే ఏడాది నీట్‌(NEET), జేఈఈ(JEE) పరీక్షలకు హాజరవ్వాలనుకుంటున్న విద్యార్థులకు ముఖ్య గమనిక. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) మెడికల్ మరియు ఇంజనీరింగ్(Engineering) ప్రవేశ పరీక్షలను కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET UG)తో విలీనం చేసే ఆలోచనలో ఉంది. అన్ని అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్షలకు ఒకే పరీక్ష విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. జాతీయ ఇంజినీరింగ్ మరియు మెడికల్ ప్రవేశ పరీక్షలను ప్రస్తుతం ఉన్న CUETతో విలీనం చేసే అవకాశాన్ని ప్రభుత్వం అన్వేషిస్తోందని UGC చైర్మన్ M జగదేష్ కుమార్ తెలిపారు.

GAIL Recruitment 2022: గెయిల్ లో ఉద్యోగాలు.. నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..


ఇంటిగ్రేటెడ్ ప్రవేశ పరీక్షను త్వరగా ప్రారంభించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని.. ఆ విధంగా ప్రయత్సిస్తోందని యూజీసీ చైర్మన్ తెలిపారు. ఈ విధానం వచ్చే ఏడాది నుంచి ప్రారంభించవచ్చన్నారు. ఇక ప్రధానంగా మూడు పరీక్షలను ప్రతిష్టాత్మకంగా  ప్రభుత్వం నిర్వహిస్తోంది. వాటిలో నీట్, జేఈఈ (మెయిన్) అండ్ CUET. ఇందులో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొంటున్నారు. ఈ మూడు పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది. యుజిసి ప్రెసిడెంట్ ఎం జగదీష్ కుమార్ ప్రతిపాదన ప్రకారం గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మూడు ప్రవేశ పరీక్షలలో నాలుగు సబ్జెక్టులకు హాజరయ్యే బదులు.. ఒక్క పరీక్ష రాస్తే సరిపోతుందని అన్నారు.ఈ పరీక్ష ద్వారానే వివిధ విభాగాల్లో ప్రవేశాలకు అవకాశం ఉంటుందన్నారు. వీటిపై విద్యావంతుల ఏకాభిప్రాయాన్ని చర్చించేందుకు ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ ఒక కమిటీని సిద్ధం చేస్తోంది. ఇది రెండు మూడు నెలల్లో కార్యరూపం దాల్చనుంది. ప్రస్తుతం జరిగే ప్రవేశపరీక్షలను పూర్తిగా ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. వివిధ రకాల సిఫార్సులను ఈ కమిటీ యూజీసి ముందు నివేదించనుంది. దాని ద్వారా పరీక్ష విధివిధానాలు తెలుస్తాయి.

Singareni Jobs For Sale: రండి బాబు రండి.. సింగరేణి జూనియర్ అసిస్టెట్ ఉద్యోగాలు అమ్మబడును..!


కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్(సీయూఈటీ) అనేది దేశం యొక్క నూతన విద్యా విధానంలో ఒక ప్రత్యేక భాగం. దీని ద్వారా ఇప్పటివరకు యూనివర్సిటీల్లో మెరిట్ ఆధారిత లేదా ప్రవేశ పరీక్ష ఆధారిత అడ్మిషన్ విధానాన్ని తొలగించి పరీక్ష స్కోర్ ఆధారంగా అడ్మిషన్ ఇవ్వబడుతుంది. ఇప్పుడు మెడికల్, ఇంజినీరింగ్ పరీక్షలను కూడా విలీనం చేయాలని యూజీసీ ప్రతిపాదించింది.

RRB Group D Update: ఆర్ఆర్బీ గ్రూప్ D అభ్యర్థులకు అలర్ట్.. అందుబాటులోకి హాల్ టికెట్స్.. డౌన్ లోడ్ చేసుకోండిలా..


కొత్త పరీక్ష ప్రారంభమైనప్పుడల్లా.. ప్రైవేట్ కోచింగ్ పరిశ్రమలు దానిపై ప్రయోజనం పొందడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటాయి. వీటిని తల్లిదండ్రులుగానీ విద్యార్థులు గానీ అడ్డుకోలేరు. ఎందుకంటే పోటీ చాలా తీవ్రంగా ఉంంటుది. కావునా.. కోచింగ్ కు ఎంత ఖర్చు అయినా స్థోమత ఉన్నవాళ్లు పెడతారు. దీంతో కోచింగ్ ఇనిట్యూట్ ల దందా సాగుతుంటుంది. "వన్ నేషన్ వన్ టెస్ట్" పేపర్‌పై బాగుంది కానీ దేశవ్యాప్తంగా ప్రతి విద్యార్థికి సమాన న్యాయం లభించదు. మారిన వాస్తవికతకు అనుగుణంగా బోధనా పరిస్థితులు అవసరం. దీనివల్ల కోచింగ్ సెంటర్లు ఎక్కువ ప్రయోజనం పొందుతాయని విద్యానిపుణులు భావిస్తున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, CUCET 2022, Cuet, CUET 2022, JOBS, UGC, UGC NET

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు