ఈ సారి జాతీయ స్థాయి మెడికల్, ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ పరీక్ష ర్యాంకుల కేటాయింపులో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఈ సారి ర్యాంకుల కేటాయింపు ప్రక్రియపై కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులకు మార్కులు సమానంగా వచ్చిన సమయంలో ర్యాంకులను కేటాయించేటప్పుడు వయస్సు ఎక్కువ ఉన్న వారికి ప్రాధాన్యత ఇచ్చి ముందు ర్యాంకు కేటాయించే విధానాన్ని తొలిగించింది. 2020లో నిర్వహించిన నీట్(NEET) ఎగ్జామ్ లో ఇద్దరు విద్యార్థులు సమానంగా 720 మార్కులు సాధించారు. దీంతో ఆ విద్యార్థులకు ర్యాంకులు కేటాయించడానికి వయస్సును పరిగణలోకి తీసుకున్నారు. ఒకే మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులకు ఒకే ర్యాంకు కేటాయించకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పాలసీని అమలు చేస్తోంది. దీనిని tie-breaking method అని పిలుస్తారు. గతేడాది JEE Main-2020లో అధికారులు అవలభించిన tie-breaking method ఇలా ఉంది.
ఒక వేళ ఇద్దరు అభ్యర్థులు మొత్తం స్కోర్ ఒకేలా సాధిస్తే మాథ్స్ లో సాధించిన మార్కులను, అనంతరం ఫిజిక్స్ లేకపోతే కెమిస్ట్రీలో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. ఒక వేళ ఈ మార్కులు కూడా సేమ్ ఉంటే విద్యార్థులు నెగటీవ్ రెస్పాన్సెస్ ను పరిగణలోకి తీసుకుంటారు. తర్వాత వయస్సును పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఈ సారి కెమెస్ట్రీ సబ్జెక్టు వరకు కూడా మార్కులు ఒకేలా ఉంటే.. చివరిగా నెగటీవ్, పాజిటీవ్ రెస్పాన్సెస్ రేషియో తక్కువ ఉన్న వారిని పరిగణలోకి తీసుకుని ర్యాంకు కేటాయిస్తారు.
IISc PG Certification Program: ఐదు నెలలో పీజీ కోర్సు చేయొచ్చు..
ఈ సారి నీట్ ర్యాంకుల కేటాయింపు ఇలా..
ఒక వేళ ఇద్దరు విద్యార్థులు ఒకే మొత్తం మార్కులు సాధిస్తే బయోలజీ(బాటనీ&జువాలజీ)లో అభ్యర్థులు సాధించిన మార్కులు/పర్సంటేజ్ ను పరిగణలోకి తీసుకుంటారు. ఒక వేళ ఈ సబ్జెక్టులోనూ ఒకే మార్కులు ఉంటే కెమిస్ట్రీ మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. అనంతరం తప్పుగా ఆన్సర్ చేసిన ప్రశ్నలకు, కరెక్ట్ ఆన్సర్ ప్రశ్నల నిష్పత్తి తక్కువ ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Exams, JEE Main 2021, NEET 2021