Home /News /jobs /

NEET JEE Main 2020: నీట్, జేఈఈ పరీక్షల షెడ్యూల్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

NEET JEE Main 2020: నీట్, జేఈఈ పరీక్షల షెడ్యూల్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్(ఫైల్ ఫోటో)

కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్(ఫైల్ ఫోటో)

NEET, JEE Main Exam 2020: నీట్(NEET), జేఈఈ(JEE)-మెయిన్స్ పరీక్షల నిర్వహణపై కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. కరోనా కారణంగా జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలన్న డిమాండ్ల నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ స్పష్టంచేశారు.

ఇంకా చదవండి ...
    నీట్(NEET), జేఈఈ(JEE)-మెయిన్ పరీక్షల నిర్వహణపై కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. కరోనా కారణంగా జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలన్న డిమాండ్ల నేపథ్యంలో...దీనిపై పునరాలోచించే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది.  షెడ్యూల్ ప్రకారమే ఈ పరీక్షలు జరుగుతాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ స్పష్టంచేశారు. జేఈఈ-మెయిన్ పరీక్షలకు సంబంధించి 7 లక్షల మంది విద్యార్థులు ఇప్పటికే తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకున్నారని వెల్లడించారు. అలాగే నీట్ పరీక్షకు సంబంధించి 10 లక్షల మందికి పైగా విద్యార్థులు అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలిపారు. ఆరునూరైనా పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు కోరుకుంటున్నారని..దీనికి ఇదే తార్కాణమని చెప్పారు. జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించాలని కోరుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి తమకు మెయిల్స్ అందినట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో జేఈఈ పరీక్షా కేంద్రాలను 570 నుంచి 660కి పెంచగా...నీట్ కేంద్రాలను 2,546 నుంచి 3,842కి పెంచినట్లు మంత్రి తెలిపారు.

    NEET JEE Main 2020, NEET JEE Main 2020 schedule, NEET JEE Main 2020 dates, education ministry, ramesh pokhriyal news, neet exam date, jee mains exam date
    (ప్రతీకాత్మక చిత్రం)


    ప్రభుత్వ నిర్ణయం మేరకు నీట్ పరీక్షను సెప్టెంబరు 13న నిర్వహించనుండగా...జేఈఈ మెయిన్స్ పరీక్షను సెప్టెంబర్ 1 నుంచి 6 తేదీ వరకు నిర్వహించనున్నారు. నీట్ కోసం 15.97 లక్షల మంది విద్యార్థుల దరఖాస్తు చేసుకోగా...జేఈఈ మెయిన్స్ కోసం 8.57 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. కరోనా కారణంగా ఇది వరకే ఈ పరీక్షలు రెండుసార్లు వాయిదాపడ్డాయి.
    Published by:Janardhan V
    First published:

    Tags: JEE Main 2020, NEET 2020

    తదుపరి వార్తలు