హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET JEE 2022: నీట్, జేఈఈలో టై బ్రేకర్ రూల్స్ మార్చిన ఎన్‌టీఏ.. కొత్తగా అమల్లోకి వచ్చిన నిబంధనలు ఇవే..

NEET JEE 2022: నీట్, జేఈఈలో టై బ్రేకర్ రూల్స్ మార్చిన ఎన్‌టీఏ.. కొత్తగా అమల్లోకి వచ్చిన నిబంధనలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌లో ఇద్దరి మార్కులు సమం అయినప్పుడు ఎన్‌టీఏ ర్యాంకులను ఎలా కేటాయిస్తుంది అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇందు కోసం సరికొత్త టైబ్రేకర్ విధానాన్ని పాటించనున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది.

మరికొన్ని రోజుల్లో ప్రతిష్టాత్మకమైన జేఈఈ, నీట్ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించనుంది. ఔత్సాహిక అభ్యర్థులు ఇందుకోసం ముమ్మరంగా సన్నద్ధం అవుతున్నారు. ఈ రెండు పరీక్షల్లో ఏ ఇద్దరు అభ్యర్థుల మధ్య మార్కులు టై(సమానం) అయితే ఎన్‌టీఏ ర్యాంకులను ఎలా కేటాయిస్తుంది అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇందు కోసం సరికొత్త టైబ్రేకర్ విధానాన్ని పాటించనున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. అభ్యర్థులు నిష్పక్షపాతంగా ర్యాంక్ పొందేందుకు, తుది ప్రవేశ ప్రక్రియ కోసం షార్ట్‌లిస్ట్ చేయడానికి అనుమతించడం ఈ విధానం లక్ష్యమని ఎన్‌టీఏ ప్రకటించింది.

టై బ్రేకర్‌ విధానంలో అభ్యర్థుల మార్కులతో పాటు వారి వయస్సును పరిగణనలోకి తీసుకుంటారు. గతేడాది 2021లో జరిగిన పరీక్షల్లో అభ్యర్థుల వయస్సు ప్రమాణాలు తొలగించారు. ఉదాహరణకు 2020లో, ఒడిశాకు చెందిన సోయెబ్ అఫ్తాబ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆకాంక్ష సింగ్ ఇద్దరూ 720కి 720 మార్కులు సాధించారు. అయితే, సోయెబ్‌ ఆకాంక్ష కంటే పెద్దవాడు. దీంతో అతనికి AIR 1 ఇచ్చారు. అయితే ఈ ఏడాదికి సంబంధించిన టై బ్రేకర్ విధానం కొత్త నిబంధనలు ఇలా ఉన్నాయి.

* JEE మెయిన్ -2022 టై బ్రేకర్ పాలసీ

JEE మెయిన్‌లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఒకే మార్కులు వచ్చినట్లయితే... గణితంలో ఎక్కువ స్కోర్ సాధించిన అభ్యర్థులకు సమాన మొత్తం మార్కులతో ఇతరులపై ప్రాధాన్యత ఇవ్వనున్నారు. JEE మెయిన్ టై బ్రేకింగ్ విధానం ప్రకారం.. మొదటి దశ తర్వాత కూడా టై కొనసాగితే అభ్యర్థుల కెమిస్ట్రీ, ఫిజిక్స్ స్కోర్‌ల ఆధారంగా ర్యాంకులు కేటాయించనున్నారు.

* BE, BTech కోసం అవరోహణ క్రమంలో టై బ్రేకర్ రూల్స్

గణితంలో NTA స్కోర్, ఆ తరువాత ఫిజిక్స్‌, ఆపై కెమిస్ట్రీ స్కోర్ ఆధారంగా లెక్కించనున్నారు. పరీక్షలో అన్ని సబ్జెక్టులలో తప్పు సమాధానాలు, సరైన సమాధానాలు తక్కువ నిష్పత్తిలో ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అంటే గణితంలో తప్పుడు సమాధానాలు, సరైన సమాధానాలను ప్రయత్నించినప్పుడు తక్కువ నిష్పత్తిలో ఉన్న అభ్యర్థి. అలాగే ఫిజిక్స్‌లో తప్పుడు సమాధానాలు - సరైన సమాధానాలను ప్రయత్నించినప్పుడు తక్కువ నిష్పత్తిలో ఉన్న అభ్యర్థి. ఇదే నియమం కెమిస్ర్టీలో కూడా వర్తించనుంది. ఆపై వయస్సు ఎక్కువ ఉన్న అభ్యర్థి, ఆరోహణ క్రమంలో దరఖాస్తు సంఖ్య వంటి అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు.

* BArch లేదా పేపర్ 2A రూల్స్

గణితంలో NTA స్కోర్‌కు టాప్ ప్రయారిటీ ఇవ్వనున్నారు. ఆపై ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో NTA స్కోర్, తరువాత డ్రాయింగ్ పరీక్షలో NTA స్కోర్‌ పరిగణలోకి తీసుకోనున్నారు. అన్ని సబ్జెక్టులు (గణితం పార్ట్1, ఆప్టిట్యూడ్ టెస్ట్ (పార్ట్-II), తప్పుడు సమాధానాలు - సరైన సమాధానాలను ప్రయత్నించినప్పుడు తక్కువ నిష్పత్తిలో ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అలాగే వయస్సు, ఆరోహణ క్రమంలో దరఖాస్తు సంఖ్యను సైతం పరిగణలోకి తీసుకోనున్నారు. ఈ ప్రమాణాల తర్వాత కూడా టై ఏర్పడితే, అభ్యర్థులకు అదే ర్యాంక్ ఇస్తారు. జూన్ 21 నుంచి 29 వరకు ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం సెషన్ వన్, జూలై 21 నుంచి 30 వరకు రెండో సెషన్ జరగనుంది.

TS Inter 1st Year: ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ఇంగ్లీష్‌లో బెస్ట్ స్కోర్ సాధించాలా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

IIM Bodh Gaya new Cources : కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఐఐఎం బోధ్ గయా.. అర్హత, దరఖాస్తు ప్రక్రియ వివరాలు...

* NEET-2022 టై బ్రేకర్ విధానం

నీట్‌లో టైబ్రేకర్ ప్రక్రియ కోసం జీవశాస్త్రంలో ఎక్కువ పర్సంటైల్ స్కోర్ పొందిన అభ్యర్థులకు అదే మొత్తం మార్కులు వచ్చిన ఇతర అభ్యర్థుల కంటే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అప్పటికీ టై కొనసాగితే, కెమిస్ట్రీలో ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు ఉన్నత ర్యాంక్ పొందుతారు. ఒకవేళ టై ఇప్పటికీ విచ్ఛిన్నం కానట్లయితే, మూడు విభాగాలలో కలిపి తక్కువ సంఖ్యలో ప్రశ్నలను ప్రయత్నించిన అభ్యర్థులకు ఇతరుల కంటే ప్రాధాన్యత ఇస్తారు.

NEET క్లియర్ చేయడానికి అభ్యర్థులు కనీసం 50 పర్సంటైల్ మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు అర్హత ప్రమాణాలలో 10 పర్సంటైల్ మార్కులతో సడలింపు ఉంటుంది. శారీరక వైకల్యం ఉన్న అభ్యర్థులు నీట్‌కు అర్హత సాధించాలంటే కనీసం 45 పర్సంటైల్ మార్కులు సాధించాలి. ఈ ఏడాది జూలై 17న మెడికల్‌ ఎంట్రన్స్‌ పరీక్ష నీట్ నిర్వహించనున్నారు.

Published by:Kishore Akkaladevi
First published:

Tags: Jee main 2022, NEET 2022

ఉత్తమ కథలు