Home /News /jobs /

NEET 2021 Counselling: త్వరలోనే నీట్ 2021 కౌన్సెలింగ్.. NTA నుంచి విడుదలైన ముఖ్యమైన ప్రకటన

NEET 2021 Counselling: త్వరలోనే నీట్ 2021 కౌన్సెలింగ్.. NTA నుంచి విడుదలైన ముఖ్యమైన ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జాతీయ స్థాయి వైద్య విద్య అర్హత పరీక్ష(నీట్‌)లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కౌన్సెలింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ ఆల్ ఇండియా ర్యాంకులు కేటాయించామని తాజా నోటిఫికేషన్‌లో తెలిపింది.

ఇంకా చదవండి ...
జాతీయ స్థాయి వైద్య విద్య అర్హత పరీక్ష(నీట్‌)లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కౌన్సెలింగ్ (NEET 2021 Counselling) త్వరలోనే ప్రారంభం కాబోతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ ఆల్ ఇండియా ర్యాంకులు (All India ranks) కేటాయించామని తాజా నోటిఫికేషన్‌ (Notification)లో తెలిపింది. తమ పరిధిలోని వైద్య కళాశాలల్లోని ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థుల ర్యాంకుల ఆధారంగా మెరిట్ లిస్టును (Merit list) కేంద్ర, రాష్ట్ర నీట్ కౌన్సిలింగ్ అథారిటీస్ ప్రిపేర్ చేస్తాయని నోటిఫికేషన్ తెలిపింది.

"ఇప్పటికే అభ్యర్థులకు ఆల్ ఇండియా ర్యాంక్‌ని ఎన్‌టీఏ (NTA) ప్రకటించేసింది. అడ్మిషన్లు కల్పించే అధికారులు వారి అధికార పరిధిలోకి వచ్చే ఎంబీబీఎస్/బీడీఎస్ (MBBS/BDS) సీట్ల కోసం ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. అభ్యర్థులు తమ రాష్ట్రానికి దరఖాస్తు (Apply) చేసినప్పుడు వారు స్టేట్ కేటగిరి లిస్ట్ (State category list) ప్రకారం వారి కేటగిరిని ప్రస్తావిస్తారు. రాష్ట్ర కౌన్సెలింగ్ అధికారులు తదనుగుణంగా వారి మెరిట్ జాబితాను తయారు చేస్తారు. నివాసం (domicile) విషయంలోనూ ఇదే విధానం అనుసరిస్తారు. ఈ విషయాల్లో ఎన్‌టీఏ కలుగజేసుకోదు. ఎన్‌టీఏ ఏ డేటాలో ఎలాంటి మార్పు చేయదు." అని ఎన్‌టీఏ అధికారిక ప్రకటన పేర్కొంది.

ఫార్మాలిటీలను పూర్తి చేయాల్సి ఉంటుంది..

కౌన్సెలింగ్ రౌండ్‌ల్లో అర్హత సాధించిన అభ్యర్థులు సంబంధిత కౌన్సెలింగ్ (Cancelling) అధికారులతో ఫార్మాలిటీలను పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (DGHS), రాష్ట్రాల వైద్య విద్యా డైరెక్టరేట్‌లు, మొదలైన అధికారులతో ఫార్మాలిటీలను విద్యార్థులు పూర్తి చేయాల్సి ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఆఫ్ స్టేట్స్ వెబ్‌సైట్‌లలో నీట్ కౌన్సెలింగ్ (NEET cancelling) వివరాలు, షెడ్యూల్ అందుబాటులో ఉంటాయి.

అత్యధిక మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను..

ఎన్‌టీఏ సెప్టెంబర్ 12న నీట్ 2021ని నిర్వహించి నవంబరు 1న ఫలితాలను విడుదల చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) నిర్దేశించిన అర్హత ప్రమాణాల ఆధారంగా, అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లలో సమర్పించిన సమాచారం ఆధారంగా ఎన్‌టీఏ నవంబర్ 1న ఫలితాలు విడుదల చేసింది. ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ 2021లో సాధించిన అత్యధిక మార్కుల ఆధారంగా ఆల్ ఇండియా మెరిట్ జాబితాను పర్సంటైల్‌లో తయారు చేశామని ఎన్‌టీఏ నోటిఫికేషన్ (NTA Notification) తెలిపింది.

నీట్ 2021 కౌన్సెలింగ్ సమయంలో, అర్హత ఉన్న అభ్యర్థుల అర్హత ప్రమాణాలు, స్వీయ-డిక్లరేషన్, వివిధ పత్రాలు మొదలైనవి సంబంధిత అధికారులు లేదా మెడికల్ (medical) లేదా డెంటల్ కాలేజీలు పేర్కొన్న విధంగా వెరిఫై చేస్తాయి. దరఖాస్తు ప్రక్రియలో అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్స్ జెన్యూనిటీ/సమాచారం పట్ల ఎన్‌టీఏ ఎలాంటి బాధ్యత వహించదని నోటిఫికేషన్ వివరించింది. నీట్ 2021 కౌన్సెలింగ్‌కు సంబంధించి మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు 011-40759000 లేదా neet@nta.ac.in ఈమెయిల్‌ను కూడా సంప్రదించవచ్చు. అభ్యర్థులు రాష్ట్రాలవారీగా అధికారిక వెబ్‌సైట్‌లలో నీట్ కౌన్సెలింగ్ వివరాలు తెలుసుకోవచ్చు.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Medical colleges, NEET, Students

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు