దేశ వ్యాప్తంగా మెడిక్ ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (National Eligibility Entrance Test) పరీక్షకు సంబంధించిన స్కామ్ మరో కొత్త మలుపు తిరగింది. నీట్-2021 (NEET 2021) పరీక్ష స్కామ్‌లో 25 మంది విద్యార్థుల ప్రమేయాన్ని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు గుర్తించారు. ఈ విద్యార్థులకు సంబంధించిన డేటాను పోలీసులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency)కి పంపించారు. ఈ విద్యార్థులకు సంబంధించిన ఫలితాలను ప్రకటించకుండా నిలిపివేయాలని పోలీసులు ఎన్‌టీఏ (NTA)ను కోరారు. వారణాసి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఈ విషయాన్ని ఏఎన్ఐ (ANI)తో తెలిపారు. 25 మంది విద్యార్థుల పాత్ర ఉన్నట్టు భావిస్తున్నమని అన్నారు. వీరికి సంబంధించిన పూర్తి బయోడేటాను ఎన్‌టీఏకు పంపినట్టు పోలీసులు తెలిపారు. విద్యార్థుల వేలిముద్రలు, ఫారమ్‌లను పరిశీలించాకా.. ఈ స్కామ్‌లో వీరి పాత్ర ఉన్నట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు.
ఇప్పటికే నీట్ -2021 స్కామ్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారిని వారణాసి పోలీసులు పట్టుకొన్నారు. అతనికి సహకరించిన వారిని పట్టుకొనే క్రమంలో 25 మందిని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం తమకు పక్కా ఆధారాలు లభించాయని, ఇతర రాష్ట్రాల్లోనూ ఈ స్కామ్‌లో పాల్గొన్న వారి ప్రమేయంపై దర్యాప్తు (Investigation) చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.
కోచింగ్ సెంటర్‌పై కేసు నమోదు..
నాగ్‌పూర్‌లోని ఒక కోచింగ్ సెంటర్‌పై కూడా సీబీఐ (CBI) ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఈ కోచింగ్ సెంటర్ NEET పరీక్ష రాసే అభ్యర్థుల తరుఫున నైపుణ్యంగ వైద్య విద్యార్థులను, నిపుణులను పరీక్షకు పంపినట్టు సీబీఐ గుర్తించింది. రాంచీ, ఢిల్లీలోని కనీసం ఐదు పరీక్షా కేంద్రాలపై పలు కేసులను పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నీట్ స్కామ్‌పై సెప్టెంబర్ 12, 2021లో ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది.
ఏం జరిగింది..
నీట్-2021లో స్కామ్ (Scam) జరిగిందని కొందరు కేసు నమోదు చేశారు. దీనిపై ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ కేసుపై సీబీఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పలువురు విద్యార్థులు నీట్-2021 పరీక్షకు దరఖాస్తు చేసుకొన్నారు. వారు తమ తరుఫున వేరొకరు పరీక్ష రాసేందుకు రూ.50లక్షలు చెల్లించారు. దీని ద్వారా మెరుగైన ర్యాంక్ సంపాధించి ఉత్తమ కళాశాలల్లో సీట్ సాధించేలా వారు ప్రయత్నించారు. అయితే ఒప్పందం కుదుర్చుకొన్న ఒక అభ్యర్థి పరీక్షకు హాజరు కాకపోవడంతో ఈ స్కామ్ బయట పడింది. ఈ కేసులో ఓఎంఆర్ (OMR)లు తారుమారు చేయబడినట్టు.. గుర్తించారు. ఏది ఏమైన ఈ కేసుపై పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహించి తమను న్యాయం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, CBI, NEET 2021, Police, Uttarpradesh