దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో(Medical College) సీట్ల భర్తీ కోసం అర్హత పరీక్షగా నీట్(NEET) నిర్వహిస్తుంటారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్షకు ఎంతో ప్రాధాన్యత ఉంది. నీట్-2022 దరఖాస్తు(Application) ప్రక్రియ ముగియడంతో అప్లికేషన్ ఎడిట్(Edit) ప్రక్రియ ప్రారంభమైంది. అప్లికేషన్ ఫారమ్‌లో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇందుకు మే 24 నుంచి 27 వరకు అవకాశం ఉంటుంది. నీట్ నోటిఫికేషన్ (Notification) విడుదలైన మొదట్లో ఎడిట్ ప్రక్రియ ఉండదని పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్‌టీఏ తెలిపింది. అయితే విద్యార్థులు(Students) అందుకు అభ్యంతరం తెలపడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఎడిట్(Edit) ప్రక్రియకు అనుమతి ఇచ్చింది. అభ్యర్థులు మే 27 రాత్రి 9 గంటల వరకు అప్లికేషన్‌లో ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ ప్రక్రియ గడువు ముగిసిన తరువాత ఎట్టిపరిస్థితుల్లో అప్లికేషన్‌లో(Application) మార్పులు చేయడానికి అనుమతించరు. అయితే ప్రత్యేక సందర్భాల్లో అది కూడా అవసరమైతేనే అదనపు రుసుము చెల్లించిన తర్వాత మాత్రమే ఫైనల్ ఎడిట్ ఆప్షన్ వర్తిస్తుందని ఎన్‌టీఏ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
జెండర్, కేటగిరి లేదా PwDలో ఏమైనా మార్పులు జరిగితే, ఫీజు మొత్తంపై ప్రభావం ఉంటుంది. దీంతో అభ్యర్థికి వర్తించే విధంగా అదనపు రుసుము వసూలు చేయనున్నారు. ఒకవేళ అభ్యర్థి అదనంగా చెల్లించి ఉంటే అది తిరిగి చెల్లించరని అని నోటీసులో స్పష్టం చేసింది.
* నీట్-2022 అప్లికేషన్‌లో ఎడిట్ చేయలేని అంశాలు
అప్లికేషన్‌లో మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్, జాతీయత వంటి అంశాలు మినహా మిగతా వాటిని ఎడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది.
ప్రస్తుతానికి పరీక్ష వాయిదా వేసి ఆగస్టులో నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేయడంతో నీట్ దరఖాస్తు గడువును రెండుసార్లు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈసారి గరిష్ట వయోపరిమితి తొలగించడంతో పోటీ మరింత తీవ్రం కానుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ మెయిన్ సబ్జెక్టులుగా 12వ తరగతి క్లియర్ చేసిన ఎవరైనా పరీక్ష రాయడానికి అనుమతి ఇచ్చారు. పోటీని బ్యాలెన్స్ చేయడానికి పరీక్ష వ్యవధిని 20 నిమిషాలకు పెంచారు. దీంతో నీట్ పరీక్షకు మొత్తంగా మూడు గంటల 20 నిమిషాల సమయం కేటాయించనున్నారు. ఇది విద్యార్థులకు గొప్ప సడలింపుగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ జూలై 17న OMR షీట్ ఫార్మాట్‌లో పెన్ అండ్ పేపర్ మోడ్‌లో నిర్వహించనున్నారు. పరీక్ష మొత్తం 720 మార్కులకు ఉంటుంది. ఇందుకోసం 3.20 గంటల సమయం కేటాయించనున్నారు.
నీట్ పరీక్ష రెండు విభాగాలుగా ఉంటుంది. అలాగే ప్రతి సబ్జెక్టులోనూ రెండు భాగాలు ఉంటాయి. సెక్షన్ Aలో 35 ప్రశ్నలు ఉండగా, సెక్షన్ Bలో 15 ప్రశ్నలు అడగనున్నారు. 15 ప్రశ్నలలో, అభ్యర్థులు ఏవైనా 10 ప్రశ్నలను ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇక సిలబస్ విషయానికి వస్తే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన అంశాలు ఉండనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Applications, Career and Courses, NEET, NEET 2022