హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET Answer Key, Result Date Out: నీట్‌ యూజీ ఆన్సర్‌ కీ, ఫలితాల తేదీ ప్రకటన.. రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి..

NEET Answer Key, Result Date Out: నీట్‌ యూజీ ఆన్సర్‌ కీ, ఫలితాల తేదీ ప్రకటన.. రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NEET Answer Key, Result Date Out: తాత్కాలిక ఆన్సర్‌ కీలు, ఓఎంఆర్‌(OMR) ఆన్సర్‌ షీట్‌ స్కాన్ చేసిన ఫోటోలు, నీట్‌ యూజీ 2022 కోసం రికార్డ్ చేసిన ప్రతిస్పందనలు అన్నీ ఆగస్టు 30న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ అప్‌లోడ్‌ చేస్తుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

నీట్‌- యూజీ(NEET- UG) 2022కి సంబంధించిన ఆన్సర్ కీ (Answer Key), ఫలితాలు (NEET- UG Results) విడుదల చేసే తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్రకటించింది. నీట్‌- యూజీ ఆన్సర్‌ కీని 2022 ఆగస్టు 30న, నీట్‌- యూజీ ఫలితాలను 2022 సెప్టెంబరు 7న విడుదల విడుదల చేయనుంది. అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆన్సర్ కీ, స్కోర్‌ను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inలో చూడవచ్చు.జులై 17న నీట్‌- యూజీ 2022 పరీక్ష జరిగింది. మొత్తం 18.72 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు రిజిస్టర్‌ చేసుకొన్నారు. వారిలో 95 శాతం మంది అభ్యర్థులు నేషనల్‌ మెడికల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌కు హాజరైనట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ పేర్కొంది.


* నీట్‌ యూజీ ఆన్సర్‌ 2022: ఎప్పుడు, ఎలా చెక్‌ చేసుకోవచ్చు?
తాత్కాలిక ఆన్సర్‌ కీలు, ఓఎంఆర్‌(OMR) ఆన్సర్‌ షీట్‌ స్కాన్ చేసిన ఫోటోలు, నీట్‌ యూజీ 2022 కోసం రికార్డ్ చేసిన ప్రతిస్పందనలు అన్నీ ఆగస్టు 30న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ అప్‌లోడ్‌ చేస్తుంది. ఆన్సర్‌ కీని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inలో చూడవచ్చు. అదనంగా OMR ఆనర్స్‌ షీట్‌ స్కాన్ చేసిన కాపీ దరఖాస్తుదారుల రిజిస్టర్డ్ ఇమెయిల్ అడ్రస్‌లకు పంపుతుంది.


* నీట్‌ యూజీ ఆన్సర్‌ కీ 2022: డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్టెప్‌1. ముందు neet.nta.nic.in వెబ్‌సైట్‌ని ఓపెన్‌ చేయాలి.

స్టెప్‌2. ఆ తర్వాత క్యాండిడేట్‌ యాక్టివిటీ ట్యాబ్‌ కింద నీట్‌ ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీ లింక్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్‌3. అప్లికేషన్ నంబర్, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ను ఎంటర్‌ చేయాలి.

స్టెప్‌4. లాగిన్ అయి ఆన్సర్ కీని చెక్‌ చేసుకోండి.* ఫిర్యాదులు చేయడానికి సమయం

ప్రతి క్వశ్చనబుల్‌ ఆన్సర్‌ కీకి రూ.200 చెల్లించిన తర్వాత, అభ్యర్థులు అభ్యంతరం చెప్పవచ్చు (నాన్‌ రీఫండబుల్). అదనంగా, వారు అంగీకరించని ప్రతి ప్రశ్నకు రూ.200 నాన్-రిఫండబుల్ ఫైలింగ్ ఛార్జీని చెల్లించడం ద్వారా ఓఎంఆర్‌ గ్రేడింగ్‌పై ఫిర్యాదును చేసుకునే అవకాశం ఉంటుంది. తాత్కాలిక ఆన్సర్ కీ పబ్లిక్‌గా ఉంచబడినప్పుడు దానికి ఫిర్యాదులను లేవనెత్తడానికి అభ్యర్థులకు సమయం ఉంటుంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తుది గడువు, ఫిర్యాదు చేసుకోవాల్సి వివరాలతో పాటు ఆన్సర్ కీని అందుబాటులో ఉంచుతుంది. ఆన్సర్‌ కీ సహాయంతో, అభ్యర్థులు తమ స్కోర్‌ను అంచనా వేయవచ్చు.


ఇది కూడా చదవండి : నిరుద్యోగ మహిళలకు సువర్ణ అవకాశం..! ఆ జిల్లాలో ఉద్యోగాల భర్తీ.. ఇలా అప్లై చేసుకోండి..!


* విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్ష నిర్వహణ

ఇండియాలోని 497 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో ఉన్న 3,570 టెస్ట్-టేకింగ్ సెంటర్‌లను పరీక్ష కోసం వినియోగించారు. దుబాయ్, కువైట్ సిటీలతో పాటు అబుదాబి, బ్యాంకాక్, కొలంబో, దోహా, ఖాట్మండు, కౌలాలంపూర్, లాగోస్, మనామా, మస్కట్, రియాద్, షార్జా, సింగపూర్‌లలో కూడా పరీక్ష మొదటిసారిగా నిర్వహించారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS, NEET, NEET 2022

ఉత్తమ కథలు