NEET Answer Key : నీట్ ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల.. అభ్యంతరాలుంటే ఇలా నమోదు చేయండి

ప్రతీకాత్మక చిత్రం

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (National Eligibility Entrance Test) 2021 ప్రిలిమినరీ ఆన్సర్​ కీని విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency). ఆన్సర్​ కీతో పాటు అభ్యర్థుల ఆన్సర్​ షీట్లను కూడా విడుదల చేసింది. ఇందులో అభ్యంత‌రాలు ఉంటే అక్టోబ‌ర్ 17 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

  • Share this:
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (National Eligibility Entrance Test) 2021 ప్రిలిమినరీ ఆన్సర్​ కీని విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency). ఆన్సర్​ కీతో పాటు అభ్యర్థుల ఆన్సర్​ షీట్లను కూడా విడుదల చేసింది. ప్రిలిమినరీ ఆన్సర్​ కీని www.neet.nta.nic.in లేదా www.nta.ac.in వెబ్​సైట్ల​ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. మరోవైపు, అభ్యర్థుల ఓఎంఆర్ ఆన్సర్​ కీ స్కాన్​ కాపీలను ఇప్పటికే వారి ఈ–మెయిల్ (E-mail ID) ఐడీలకు పంపించినట్లు పేర్కొంది. ప్రిలిమినరీ ఆన్సర్​ కీపై అక్టోబర్ 17 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆన్సర్​ కీలోని జవాబులను సవాలు చేయాలంటే ప్రతి ప్రశ్నకు రూ .100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ఫీజు చెల్లింపు విండో అక్టోబర్ 17 వరకు తెరిచి ఉంటుంది.

నీట్ ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలను ఎలా నమోదు చేయాలి?

1. www.neet.nta.nic.in వెబ్​సైట్​ని సందర్శించండి.

FCI Recruitment 2021 : ఎఫ్‌సీఐలో ఐదు, ఎనిమిదో త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో 860 ఉద్యోగాలు.. జీతం రూ. 23,000


2. ‘అప్లై ఫర్​ ఆన్సర్ కీ ఛాలెంజ్​’ (Apply For Answer Key Challenge) పై క్లిక్ చేయండి.

3. టెస్ట్​ బుక్‌లెట్ కోడ్‌ను ఎంచుకోండి. మీ డీటెయిల్స్ (Details)​ ఉపయోగించి లాగిన్ అవ్వండి.

4: మీరు ఛాలెంజ్​ చేయదల్చుకున్న ప్రశ్నకు ప్రక్కన ఉండే బాక్స్​పై క్లిక్​ చేయండి.

5. మీరు అభ్యంతరం లేవనెత్తిన ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం కోసం సపోర్టింగ్​ డాక్యుమెంట్లను అప్​లోడ్​ చేయండి.

6. మీ రిక్వెస్ట్​ (Request)ను సేవ్ చేయండి. చెల్లింపు పూర్తి చేయండి.

అభ్యర్థులు ఎత్తి చూపిన అభ్యంతరాలను సబ్జెక్ట్ నిపుణుల (Subject Expert) ప్యానెల్ ధృవీకరిస్తుంది. అభ్యర్థుల వాదన సరైనది అనిపిస్తే, సమాధాన కీలో మార్పులు చేస్తుంది. ఆ తర్వాత నిపుణులు ఖరారు చేసిన ఫైనల్​ కీని విడుదల చేస్తుంది.

Online Course : నైపుణ్యానికి చిరునామా.. IIIT ఢిల్లీలో కంప్యూట‌ర్ సైన్స్‌ ఉపాధ్యాయుల‌కు ప్ర‌త్యేక కోర్సు


ఫైనల్​ కీ ఆధారంగానే తుది ఫలితాలను ప్రకటిస్తుంది. ప్రస్తుతానికి నీట్​ ఫలితాల తేదీని ఎన్​టీఏ అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఈ నెఖాలరు లోపు విడుదలయ్యే అవకాశం ఉంది.

స్కోర్‌ని ఎలా లెక్కించాలి?

ఆన్సర్​ కీని చూసుకొని మీ స్కోర్​పై ఒక ప్రాథమిక అంచనాకు రావొచ్చు. స్కోర్‌లను లెక్కించడానికి, విద్యార్థులు ముందుగా మెడికల్ ర్యాంకింగ్ (Medical Ranking) వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. ఇలా మీ స్కోర్​ను లెక్కించుకోవచ్చు. ఈసారి నీట్​ పరీక్షకు 16 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 95 శాతానికి పైగా హాజరయ్యారు.
Published by:Sharath Chandra
First published: