హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET: నీట్ అభ్యర్థులకు అలర్ట్.. మరోసారి అప్లికేషన్ ఎడిట్ విండో ఓపెన్.. ఎగ్జామ్ వాయిదా పడుతుందా?

NEET: నీట్ అభ్యర్థులకు అలర్ట్.. మరోసారి అప్లికేషన్ ఎడిట్ విండో ఓపెన్.. ఎగ్జామ్ వాయిదా పడుతుందా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NEET 2022 | జాతీయస్థాయి మెడికల్ ప్రవేశ పరీక్ష నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET)- 2022 కోసం అప్లికేషన్ ఎడిట్ విండోను మరోసారి ఓపెన్ చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA). విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచిన్నట్లు అధికారిక నోటీస్‌లో పేర్కొంది.

ఇంకా చదవండి ...

    జాతీయస్థాయి మెడికల్ ప్రవేశ పరీక్ష నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET)- 2022 కోసం అప్లికేషన్ ఎడిట్ విండోను మరోసారి ఓపెన్ చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA). విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచిన్నట్లు అధికారిక నోటీస్‌లో పేర్కొంది. జూన్ 16 రాత్రి 9 గంటల వరకు అభ్యర్థులు అప్లికేషన్‌లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత, ఎలాంటి దిద్దుబాటుకు అవకాశం ఉండదు. అదనపు రుసుము వర్తిస్తే, అభ్యర్థి దాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైన చోట అదనపు రుసుము చెల్లించిన తర్వాత మాత్రమే ఫైనల్ ఎడిట్ వివరాలను పరిగణనలోకి తీసుకుంటామని NTA అధికారిక నోటీసులో స్పష్టం చేసింది.

    TSSPDCL Recruitment 2022: నిరుద్యోగుల‌కు అల‌ర్ట్‌.. విద్యుత్ శాఖలో 201 ఉద్యోగాలకు ద‌ర‌ఖాస్తులు ప్రారంభం

    అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వన్-టైమ్ కరెక్షన్ అవకాశాన్ని కల్పించింది. దీంతో అభ్యర్థులకు కరెక్షన్ చేసుకోవడానికి మరో అవకాశం ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎడిట్ చేయాల్సి ఉంటుంది.

    కాగా, నీట్ కోసం నోటిఫికేషన్‌ను ప్రకటించినప్పుడు, అప్లికేషన్ ఎడిట్ విండో మళ్లీ ఓపెన్ చేయలేమని ఎన్‌టీఏ తెలిపింది. అయితే విద్యార్థుల అభ్యర్థన మేరకు తాజాగా ఎడిట్ విండోను మళ్లీ తెరిచింది. దీంతో దరఖాస్తు ప్రక్రియలో జాప్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే నీట్ పరీక్ష వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, పొడిగింపునకు తక్కువ వ్యవధి ఉండడంతో మెడికల్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన మొత్తం షెడ్యూల్‌పై ప్రభావం చూపే అవకాశం ఉండదు.

    TS Govt Jobs 2022: నిరుద్యోగుల‌కు అల‌ర్ట్‌.. 1,326 పోస్టుల‌తో ఆ శాఖ‌లో నోటిఫికేష‌న్ విడుద‌ల‌

    మరోవైపు, అనేక మంది ఔత్సాహిక అభ్యర్థులు నీట్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ ప్రారంభంలో టెస్ట్ నిర్వహించాలని ఎన్‌టీఏకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇతర పరీక్షలతో నీట్ క్లాష్ అవుతుందని విద్యార్థులు పేర్కొంటున్నారు. సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు జూన్ 15 ముగుస్తున్నాయని.. దీంతో నీట్ కోసం సన్నద్ధం కావడానికి కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉందని విద్యార్థులు వాపోతున్నారు.

    Jobs in Aadhar: హైద‌రాబాద్ యూఐడీఏఐలో రూ.9ల‌క్ష‌ల ప్యాకేజీతో జాబ్స్‌.. అప్లికేష‌న్ ప్రాసెస్ వివ‌రాలు

    అలాగే సీయూఈటీ-2022 కూడా జూలై మొదటి లేదా రెండో వారంలో జరిగే అవకాశం ఉంది. ఆ తరువాత కేవలం వారం రోజుల సమయం మాత్రమే నీట్ కోసం ఉంటుందని, దీంతో తాము చాలా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని విద్యార్థులు అంటున్నారు.

    కాగా, ఈ ఏడాది రికార్డు స్థాయిలో 18.72 లక్షల మంది అభ్యర్థులు నీట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఈ స్థాయిలో దరఖాస్తులు రాలేదు. అంతేకాకుండా ఈ ఏడాది గరిష్ట వయోపరిమితి ఎత్తేయడంతో గతంలో పరీక్షకు హాజరుకాని, గ్యాప్ తీసుకున్న వారు కూడా మళ్లీ పరీక్ష రాసే అవకాశం ఉంది.

    Job News: ఆ రంగాల్లోనే ఎక్కువ ఉద్యోగాలు.. క‌రోనా త‌రువాత మారిన ప‌రిస్థితి

    NEET - 2022 పరీక్షను 13 భాషల్లో పెన్ అండ్ పేపర్ మోడ్ లో నిర్వహించనున్నారు. నీట్ పరీక్ష వ్యవధి మూడు గంటల 20 నిమిషాలు. మొత్తం 200 ప్రశ్నలకు నీట్ పరీక్ష ఉంటుంది. వీటిలో అభ్యర్థులు 180 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు ఉంటాయి. తప్పు సమాధానాలకు 1 మార్కును తీసివేయనున్నారు.

    First published:

    Tags: EDUCATION, JOBS, Medical colleges, NEET 2021, NEET 2022

    ఉత్తమ కథలు