Home /News /jobs /

NEET ADMIT CARD TO CUCET TO CTET TO CBSE RESULT DATE IMPORTANT ACADEMIC EVENTS IN JULY UMG GH

Academic Events: నీట్‌ అడ్మిట్ కార్డ్ నుంచి CBSE ఫలితాల వరకు.. జులైలో ముఖ్యమైన అకడమిక్‌ ఈవెంట్స్ ఇవే..!

జులైలో వచ్చే నోటిఫికేషన్లు, ఎగ్జామ్స్, ఫలితాలు (Photo: PTI)

జులైలో వచ్చే నోటిఫికేషన్లు, ఎగ్జామ్స్, ఫలితాలు (Photo: PTI)

ఇంజనీరింగ్‌ ప్రవేశాలకు JEE మెయిన్, మెడికల్ కోసం NEET, భారతదేశంలోని అన్ని అగ్ర కళాశాలల్లో ప్రవేశానికి కొత్తగా ప్రవేశపెట్టిన CUET సహా ప్రధాన ప్రవేశ పరీక్షలు జులైలోనే జరగనున్నాయి. ఇలా జులైలో జరగనున్న ప్రధాన అకడమిక్‌ ఈవెంట్స్ ఏవో చూద్దాం.

ఇంకా చదవండి ...
జులైలో విద్యార్థులకు ముఖ్యమైన ఈవెంట్‌లు ఎక్కువగా ఉన్నాయి. ప్రతిష్ఠాత్మక ప్రవేశ పరీక్షలు (Entrance Exams), ఫలితాలు (Results), నోటిఫికేషన్‌ (Notification)లు ఉన్నాయి. జులైతో కొత్త ఎడ్యుకేషనల్ ఇయర్ ప్రారంభమవుతుంది. చాలా ఎడ్యుకేషన్ బోర్డులు పరీక్ష ఫలితాలను ప్రకటించాయి. త్వరలో సెంట్రల్ బోర్డులు CBSE, CISCE 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. జులైలో అడ్మిషన్ సీజన్ కూడా ప్రారంభమవుతుంది. చాలా రాష్ట్ర, కేంద్ర పరీక్షలకు నోటిఫికేషన్‌లు విడుదలయ్యాయి. జులై జరిగే పరీక్షలకు అడ్మిట్‌ కార్డులు కూడా జారీ అయ్యాయి. ఇంజనీరింగ్‌ ప్రవేశాలకు JEE మెయిన్, మెడికల్ కోసం NEET, భారతదేశంలోని అన్ని అగ్ర కళాశాలల్లో ప్రవేశానికి కొత్తగా ప్రవేశపెట్టిన CUET సహా ప్రధాన ప్రవేశ పరీక్షలు జులైలోనే జరగనున్నాయి. ఇలా జులైలో జరగనున్న ప్రధాన అకడమిక్‌ ఈవెంట్స్ ఏవో చూద్దాం.

* CBSE 10th, 12th ఫలితాలు
CBSE బోర్డ్ పరీక్షల ఫలితాలు ఈ నెలలోనే విడుదల కానున్నాయి. CBSE 10 తరగతి ఫలితాలు జులై 4న ప్రకటిస్తారని సమాచారం. CBSE 12వ తరగతి ఫలితాలు జులై 10 నాటికి వెలువడచ్చని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ప్రకటనకు ముందు CBSE ఫలితాల తేదీలను అలాగే మార్కులు కేటాయింపునకు సంబంధించిన ఫార్ములాను ప్రకటిస్తుంది. మొదటి సారి రెండు టర్మ్‌లుగా నిర్వహించిన పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి.

ఇదీ చదవండి: నీట్ ఎగ్జామ్ వాయిదాకు డిమాండ్.. విద్యాశాఖ మంత్రి స్పందన ఏంటంటే..?


* CISCE ఫలితాలు
మరో సెంట్రల్ బోర్డ్ CISCE కూడా జులై మధ్య నాటికి ICSE, ISC ఫలితాలను ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. జులై 15 నాటికి తుది ఫార్ములా, అలాగే ఫలితాలు వెలువడుతాయని కౌన్సిల్ గతంలో ప్రకటించింది. CBSE, CISCE తుది ఫలితాల లెక్కల కోసం ఇదే ఫార్ములాను ప్రకటించాలని భావిస్తున్నారు. CISCE వచ్చే ఏడాది రెండు పరీక్షలను నిర్వహించబోమని, ఏడాదికి ఒక పరీక్ష విధానంలోకి వెళ్తామని ప్రకటించింది.

* NEET అడ్మిట్ కార్డ్
జులై 1న వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్య ప్రవేశ పరీక్షను వాయిదా వేయాలని నీట్‌ అభ్యర్థులు నిరసనలు చేస్తున్నారు. తేదీలను దాదాపు 30-40 రోజులు పొడిగించడం వల్ల అకడమిక్‌ షెడ్యూల్‌లో భారీ వ్యత్యాసం ఉండదని, ఇతర ప్రవేశ పరీక్షలు కూడా అదే సమయంలో ఉండటంతో ప్రిపేర్‌ అవ్వడానికి సమయం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. కానీ పరీక్ష నిర్వహణ అధికారులు తేదీలను మార్చడానికి ఆసక్తి చూపడం లేదు. నీట్ 2022 జులై 17న జరగనుంది. అడ్మిట్ కార్డ్‌లు జులై 10 తర్వాత విడుదల అవుతాయి.

ఇదీ చదవండి: ఈ నెలలోనే క్యాట్ ఎగ్జామ్ నోటిఫికేషన్.. పరీక్షలు మాత్రం అప్పుడే..!!


* JEE మెయిన్‌ సెషన్ 2
జేఈఈ మెయిన్ 2022 రెండు సెషన్లలో జరుగుతుంది. సెషన్ 1 ఇప్పటికే నిర్వహించగా, రెండో సెషన్ జులైలో జరుగుతుంది. జేఈఈ మెయిన్ 2022 సెషన్ 2 జులై 21 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ ప్రవేశానికి సంబంధించిన అడ్మిట్ కార్డ్ పొందడం జులై 15 తర్వాత ముగుస్తుంది. ఇంకా జేఈఈ మెయిన్ సెషన్ 1 ఫలితాలు జులై చివరిలో లేదా ఆగస్టు ప్రారంభంలోనే విడుదలయ్యే సూచనలు ఉన్నాయి.

* IIM ఎంట్రన్స్‌ నోటిఫికేషన్
CAT 2022 నోటిఫికేషన్ జులై మూడో వారంలో విడుదల అవుతుంది. CAT అనేది IIMలు సహా టాప్ బిజినెస్‌ స్కూల్‌లలో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్ష. CAT 2022 నవంబర్ లోపు జరగాల్సి ఉంది. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది ఐఐఎం బెంగళూరు లేదా ఐఐఎం లక్నో పరీక్షలను నిర్వహించనున్నాయి.



* CUET
43 సెంట్రల్ యూనివర్సిటీలు, 13 స్టేట్ యూనివర్సిటీలు, 12 డీమ్డ్ యూనివర్సిటీలు, 18 ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్న 86 యూనివర్సిటీల్లో అడ్మిషన్ కోసం తొలిసారిగా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్(సీయూఈటీ) నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జామ్‌ జులై 15, 16, 19, 20 తేదీల్లో, ఆ తర్వాత ఆగస్టు 4, 5, 6, 7, 8, 10వ తేదీల్లో జరగనుంది. దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడంతో సంవత్సరంలో అతిపెద్ద ప్రవేశ పరీక్షల్లో ఇది ఒకటి. CUET అడ్మిట్ కార్డ్ కూడా జులై రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ కాలేజీల్లో కొత్త కోర్సులు


*సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET)
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(CTET) నోటిఫికేషన్ జులైలో విడుదల కానుంది. జులై మొదటి రెండు వారాల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ctet.nic.inలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. CTET సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తారు. రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది. 1 నుంచి 5వ తరగతి వరకు ఉపాధ్యాయులు కావాలంటే పేపర్‌ 1, 6 నుంచి 8వ తరగతి వరకు ఉపాధ్యాయులు కావాలంటే పేపర్‌ 2కు హాజరుకావాలి.
Published by:Mahesh
First published:

Tags: Entrance exams, Jee main 2022, JOBS, NEET 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు