Home /News /jobs /

NEET ADMIT CARD DATE AND TIME ANNOUNCED KNOW HOW TO DOWNLOAD HALL TICKET UMG GH

NEET-2022: నీట్ ఎగ్జామ్స్‌పై సస్పెన్స్ క్లియర్.. అడ్మిట్ కార్డ్ రిలీజ్ డేట్ అనౌన్స్..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జాతీయ స్థాయిలో మెడికల్ సీట్ల భర్తీ కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET)ను నిర్వహిస్తారు. ఈ పరీక్షకు సంబంధించి కీలక ప్రకటన చేసింది ఎన్‌టీఏ. నీట్ అడ్మిట్ కార్డులను రేపు (జులై 13) ఉదయం 11.30 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.  

ఇంకా చదవండి ...
జాతీయ స్థాయిలో మెడికల్ సీట్ల భర్తీ కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET)ను నిర్వహిస్తారు. ఈ పరీక్షకు సంబంధించి కీలక ప్రకటన చేసింది ఎన్‌టీఏ. నీట్ అడ్మిట్ కార్డులను రేపు (జులై 13) ఉదయం 11.30 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inలో అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకునే లింక్ అందుబాటులోకి రానుంది. అభ్యర్థులు అడ్మిట్ కార్డులను‌ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీని జత చేయాల్సి ఉంటుంది. కాగా, ఇప్పటికే సిటీ ఇంటిమేషన్ స్లిప్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఎగ్జామ్ సిటీ మార్పునకు సంబంధించి కొన్ని అభ్యర్థులు వచ్చినట్లు ఎన్ టీఏ తెలిపింది. వాటిని పరిశీలించి, మార్పుకు అవకాశం ఉన్నవాటిని మార్చినట్లు పేర్కొంది.

* వాయిదాకు విజ్ఞప్తి
చాలా మంది అభ్యర్థులు నీట్‌ను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో ఎన్‌టీఏ అడ్మిట్ కార్డులను జారీ చేసే తేదీని ప్రకటించింది. విద్యార్థులే కాకుండా పలువురు రాజకీయ నేతలు కూడా ఆన్‌లైన్ నిరసనలో పాల్గొన్నారు. ప్రధాని కూడా జోక్యం చేసుకోవాలని విద్యార్థులు గతంలో విజ్ఞప్తి చేశారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో పరీక్ష వాయిదా పడే అవకాశం లేదని తెలుస్తోంది.

 ఇదీ చదవండి: తెలంగాణ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్.. బెస్ట్ ప్రిపరేషన్ టిప్స్ ఇవే..


* పరీక్ష కేంద్రాల వివరాలు
దేశవ్యాప్తంగా 546 నగరాల్లో, విదేశాల్లో 14 నగరాల్లో నీట్ నిర్వహణకు పరీక్ష కేంద్రాలను ఎన్‌టీఏ ఏర్పాటు చేస్తోంది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు జరుగుతుంది. ధ్రువీకరణ కోసం అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌ను పరీక్ష హాల్‌కు తీసుకురావడం తప్పనిసరి. అడ్మిట్ కార్డులపై పరీక్ష కేంద్రం వివరాలు, రిపోర్టింగ్ సమయంతో పాటు ఇతర సూచనలు ఉంటాయి. మధ్యాహ్నం 1:15 గంటలకు అభ్యర్థులను పరీక్ష హాలులోకి అనుమతిస్తారు. 1:30 గంటల తర్వాత పరీక్షా కేంద్రంలోకి రావడానికి అభ్యర్థులను అనుమతించరు. పరీక్షకు సంబంధించిన సూచనలను మధ్యాహ్నం 1:20 నుండి 1:45 వరకు అధికారులు చేయనున్నారు. ఇక పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 5:20 గంటల వరకు జరగనుంది.

* నీట్- టైబ్రేకర్ విధానం
నీట్‌లో టై బ్రేకర్ ప్రక్రియ కోసం జీవశాస్త్రంలో ఎక్కువ పర్సంటైల్ స్కోర్ పొందిన అభ్యర్థులకు అదే మొత్తం మార్కులు వచ్చిన ఇతర అభ్యర్థుల కంటే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అప్పటికీ టై కొనసాగితే, కెమిస్ట్రీలో ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు ఉన్నత ర్యాంక్ పొందుతారు. ఒకవేళ టై ఇప్పటికీ విచ్ఛిన్నం కానట్లయితే, మూడు విభాగాలలో కలిపి తక్కువ సంఖ్యలో ప్రశ్నలను ప్రయత్నించిన అభ్యర్థులకు ఇతరుల కంటే ప్రాధాన్యత ఇవ్వనున్నారు.



అలాగే పరీక్షలో అన్ని సబ్జెక్టుల్లో(జీవశాస్ర్తం, కెమిస్ట్రీ, ఫిజిక్స్) తప్పు సమాధానాలు - సరైన సమాధానాలను ప్రయత్నించిన సంఖ్యలో తక్కువ నిష్పత్తిలో ఉన్న అభ్యర్థికి టాప్ ప్రయారిటీ ఇవ్వనున్నారు. అంతేకాకుండా వయస్సులో పెద్ద అభ్యర్థి, ఆరోహణ క్రమంలో దరఖాస్తు సంఖ్య సైతం పరిగణనలోకి తీసుకోనున్నారు.

నీట్ క్లియర్ చేయడానికి అభ్యర్థులు కనీసం 50 పర్సంటైల్ మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు అర్హత ప్రమాణాలలో 10 పర్సంటైల్ మార్కులతో సడలింపు ఉంటుంది. శారీరక వైకల్యం ఉన్న అభ్యర్థులు నీట్ అర్హత సాధించాలంటే కనీసం 45 పర్సంటైల్ మార్కులు సాధించాలి.
Published by:Mahesh
First published:

Tags: Exams, JOBS, NEET 2022, Preparation

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు