Home /News /jobs /

NEET 2022 UG NOTIFICATION WILL BE RELEASED SOON KNOW APPLICATION PROCEDURE AND DETAILS OF REQUIRED DOCUMENTS GH EVK

NEET 2022: త్వరలోనే నీట్ యూజీ 2022 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు విధానం.. కావాల్సిన డాక్యుమెంట్ల వివరాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NEET 2022 | దేశంలోని ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజీల్లో అండర్​ గ్రాడ్యుయేట్ ప్రవేశాల కొరకు ఏటా నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) యూజీ 2022 నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏప్రిల్ మొదటి వారంలో నీట్​ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

ఇంకా చదవండి ...
దేశంలోని ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజీ (Medical College) ల్లో అండర్​ గ్రాడ్యుయేట్ ప్రవేశాల కొరకు ఏటా నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) యూజీ 2022 నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏప్రిల్ మొదటి వారంలో నీట్​ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. నీట్ 2022 కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ www.neet.nta.nic.in ని సందర్శించి దరఖాస్తు ఫారమ్​ను పూరించవచ్చు. జూన్‌లో అనేక పోటీ పరీక్షలతో పాటు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు కూడా ఉన్నందున.. నీట్ పరీక్షను జూలైలో నిర్వహించే అవకాశం ఉంది. కాగా, నీట్ యూజీ దరఖాస్తు ఫారమ్‌ సబ్​మిట్​ చేసేందుకు.. అభ్యర్థులు మొదట వారి ఈ–మెయిల్ ఐడి, మొబైల్ నంబర్‌ (Mobile Number) ను ఉపయోగించి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి. ఆపై దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి.

CUET: ఒక సంవత్సరంలో రెండు సార్లు CUET.. ఎన్‌టీఏ కొత్త ఆలోచ‌న: యూజీసీ చైర్మన్‌

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

Step 1 - మీ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి.

Step 2 - ‘దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి’పై క్లిక్ చేయండి.

Step 3 - సూచనలను జాగ్రత్తగా చదివి ప్రొసీడ్​పై క్లిక్​ చేయండి.

Step 4 -మీ పర్సనల్​ డీటెయిల్స్​, ఐడెంటిటీ ప్రూఫ్​, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్​కు

Step 5 - సంబంధించిన అన్ని వివరాలను నమోదు చేయండి.

Telangana Police Jobs: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఫ్రీగా హైదరాబాద్‌లో ప్రీ-రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్

Step 6 - మీకు నోటిఫికేషన్​కు సంబంధించిన అప్​డేట్లు రావాలంటే మీ కాంటాక్ట్ వివరాలను నమోదు చేయండి.

Step 7 - ఫోటోగ్రాఫ్, సంతకం, ఇతర అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.

Step 8 - తర్వాత 'సేవ్ అండ్​ కంటిన్యూ 'పై క్లిక్ చేయండి.

Step 9 - ఎగ్జామ్​ ఫీజును చెల్లించి సబ్​మిట్​పై క్లిక్ చేయండి.

దరఖాస్తు చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్లు?

పదో తరగతి, 12వ తరగతి మార్క్ షీట్లు

2. పాస్‌పోర్ట్ స్కాన్ చేసిన కాపీ, అభ్యర్థి పాస్​ఫోటో

3. అభ్యర్థి సంతకం స్కాన్డ్ కాపీ

ISRO Jobs: ఇస్రో-ఐఐఆర్ఎస్‌లో జాబ్స్‌.. వేత‌నం రూ. 56,100.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

4.లెఫ్ట్​ హ్యాండ్​ థంబ్​ స్కాన్డ్ కాపీ

వ్యాలిడ్​ ఐడీ ప్రూఫ్​

డాక్యుమెంట్లను స్కానింగ్ చేయడానికి గైడ్​లైన్స్​

పాస్‌పోర్ట్ ఫోటో వైట్ బ్యాక్​గ్రౌండ్​తో ఉండాలి. ఫైల్​ సైజు 10 kb నుంచి 200 kb మధ్య ఉండాలి. ఫోటోపై అభ్యర్థి పేరు, ఫోటో తీసిన తేదీ ఉండాలి. ఫోటో సెప్టెంబర్ 1, 2019లోపు తీసి ఉండకూడదు. టోపీలు, గాగుల్స్ ఉండకూడదు.

Govt Jobs 2022: సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో జాబ్స్‌.. నేరుగా ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌, అర్హ‌త‌లు!

తెల్ల కాగితంపై బ్లాక్​ పాయింట్ పెన్‌తో సంతకం చేయాలి. మీ సిగ్నేచర్​ స్కాన్డ్​ కాపీ 4 kb నుంచి 30 kb మధ్య ఉండాలి.  లెఫ్ట్ హ్యాండ్ థంబ్​ ఇంప్రెషన్ సైజు 10 kb నుంచి 50 kb మధ్య ఉండాలి. పదో తరగతి, 12వ తరగతి మార్కు షీట్‌లు 100 kb నుండి 300 kb మధ్య సైజులో ఉండాలి.
Published by:Sharath Chandra
First published:

Tags: Career and Courses, EDUCATION, NEET 2022

తదుపరి వార్తలు