నీట్ 2022 (NEET 2022) నోటిఫికేషన్ (Notification) త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారనే అంశంపై కచ్చితమైన సమాచారం అందుబాటులో లేకపోయినా.. జూన్‌లో నీట్ జరగవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. నీట్లో అర్హత సాధించి మెడికల్ కళాశాలల్లో సీటు సంపాదించాలనుకొనే విద్యార్థులు పరీక్షకు పూర్తిగా సన్నద్ధమై ఉండాలి. నీట్‌కు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ(జువాలజీ, బోటనీ) అనే మూడు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. మూడింటిలో కెమిస్ట్రీలో సులువుగా మార్కులు సంపాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు. నీట్ మొత్తం మార్కుల్లో కెమిస్ట్రీ(Chemistry) మార్కులు 25 శాతం ఆక్రమిస్తాయి. కెమిస్ట్రీలో ఎక్కువ మార్కులు సాధించగలిగితే నీట్లో మంచి ర్యాంకు దక్కించుకొనే అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థులు నీట్లో అర్హత సాధించాలంటే.. సబ్జెక్టును సబ్ కేటగిరీలుగా విభజించుకొని.. అందులో ముఖ్యమైన అంశాలను, ప్రాధాన్యమున్న చాప్టర్లను పూర్తిగా చదవాల్సి ఉంటుంది.
కెమిస్ట్రీని మొత్తంగా మూడు సబ్ కేటగిరీలుగా విభజించవచ్చు. అవి ఫిజికల్ కెమిస్ట్రీ(Physical Chemistry), ఆర్గానిక్ కెమిస్ట్రీ(Organic Chemistry), ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ(Inorganic Chemistry). ఈ మూడు విభాగాలకు విద్యార్థులు ప్రత్యేక స్ట్రాటజీలను అనుసరించి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నీట్ 2022 కెమిస్ట్రీ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించేలా, ఆ విభాగంలో పూర్తి పట్టు సాధించేలా కొందరు నిపుణులు సూచించిన స్ట్రాటజీలు ఇవే.. NEET 2022: కొత్తగా అప్డేట్ అయిన నీట్ 2022 వెబ్సైట్.. నోటిఫికేషన్‌కు ముందు అభ్యర్థులు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలివే..
నీట్ 2022: ఫిజికల్ కెమిస్ట్రీ
ఫిజికల్ కెమిస్ట్రీలో కాన్సెప్ట్‌లు మాత్రమే కాకుండా అప్లికేషన్స్‌కు సంబంధించిన న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఫిజికల్ కెమిస్ట్రీలోని అన్ని అంశాలపై పట్టు సాధించాలంటే NCERT పుస్తకాలను చదవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ కాన్సెప్టులకు సంబంధించి న్యూమరికల్ ప్రాబ్లమ్స్‌ను వీలైనంత ఎక్కువగా సాధన చేస్తే మంచి మార్కులు సాధించవచ్చు. నీట్ కెమిస్ట్రీ సెక్షన్లో ఫిజికల్ కెమిస్ట్రీ విభాగం నుంచి 32 నుంచి 36 శాతం ప్రశ్నలు వస్తాయి. న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయాలంటే ఫిజికల్ కెమిస్ట్రీ అంశాలు, అప్లికేషన్స్‌పై పూర్తి అవగాహన సాధించాలి. దీనికి సంబంధించిన ఫార్ములాలను మర్చిపోకుంగా ప్రత్యేక నోట్స్ ప్రిపేర్ చేసుకొంటే రివిజన్ చేసుకొనేందుకు వీలుగా ఉంటుంది. వీలైనన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేస్తే ఫిజికల్ కెమిస్ట్రీలో మంచి మార్కులు సాధించేందుకు వీలుంటుంది. NEET 2022 Free Coaching: నీట్ కు ప్రిపేర్ అవుతున్నారా? ఈ యాప్ లో ఫ్రీ కోచింగ్, స్టడీ మెటీరియల్, మాక్ ఎగ్జామ్స్.. ఓ లుక్కేయండి
నీట్ 2022: ఆర్గానిక్ కెమిస్ట్రీ
నీట్ కెమిస్ట్రీ విభాగంలో ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 28 నుంచి 33 శాతం వరకు ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలోని అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలంటే NCERT పుస్తకాలను పూర్తిగా చదవడం కీలకం. అన్నీ ఈక్వేషన్లను అర్థం చేసుకొని గుర్తు పెట్టుకోవడం, ఫార్ములాలు నేర్చుకోవడం, ఆర్గానిక్ రియాక్షన్స్‌పై పట్టు సాధించడంపై ఈ విభాగంలో మార్కులు సాధించడం ఆధారపడి ఉంటుంది. వివిధ రియాక్షన్లను, కాంపౌండ్స్‌ను గుర్తుపెట్టుకోవడంతోపాటు ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడిగే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలంటే నిరంతర సాధన అవసరం.
నీట్ 2022: ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ
నీట్ ప్రవేశ పరీక్షలో కెమిస్ట్రీ విభాగం నుంచి అడిగే ప్రశ్నల్లో 30 నుంచి 35 శాతం ప్రశ్నలు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వస్తాయి. నీట్లో కెమిస్ట్రీలో ఎక్కువ మార్కులు సాధించడమనేది గుర్తుంచుకొనే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఈ విభాగంలోనూ విద్యార్థులు మంచి మార్కులు సాధించాలంటే NCERT పుస్తకాలే ప్రధానం. ఈ విభాగానికి సంబంధించి NCERT పుస్తకాల్లోని ప్రశ్నలను కొన్ని సందర్భాల్లో అడిగారు. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి NCERT పుస్తకాలను చదువుతూ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొంటే ఉపయోగపడుతుంది. రివిజన్ చేసుకొనేందుకు వీలుగా ఉంటుంది. పీరియాడిక్ టేబుల్లోని ప్రాపర్టీస్ పూర్తిగా అభ్యసించాలి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.