హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET Students: నీట్‌ వాయిదా వేయాలని విద్యార్థుల డిమాండ్‌.. కారణం ఏంటో తెలుసా..?

NEET Students: నీట్‌ వాయిదా వేయాలని విద్యార్థుల డిమాండ్‌.. కారణం ఏంటో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రిపరేషన్‌కు తగినంత సమయం లేదనే ఉద్దేశంతో విద్యార్థులు నీట్‌ను వాయిదా వేయాలని సోషల్‌ మీడియా వేదికగా వాదనలు వినిపిస్తున్నారు. ఇందుకు ముఖ్యంగా 4 కారణాలను విద్యార్థులు ఎత్తి చూపుతున్నారు. అవేంటో చూద్దాం.

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-National Eligibility Cum Entrance Test)- 2022ను జులై 17న నిర్వహిస్తున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ(NTA-National Testing Agency) ఇటీవల ప్రకటించింది. దీనివల్ల విద్యార్థికి నీట్‌ పరీక్షకు సిద్ధం కావడానికి కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంటుంది. దీంతో ప్రిపరేషన్‌కు(Preparation) తగినంత సమయం లేదనే ఉద్దేశంతో విద్యార్థులు నీట్‌ను వాయిదా వేయాలని సోషల్‌ మీడియా వేదికగా వాదనలు వినిపిస్తున్నారు. ఇందుకు ముఖ్యంగా 4 కారణాలను విద్యార్థులు ఎత్తి చూపుతున్నారు. అవేంటో చూద్దాం.

* ప్రిపరేషన్‌కు సమయం తక్కువ

జేఈఈ మెయిన్‌ను రెండు విడతల్లో నిర్వహిస్తున్నారని, నీట్‌కు మాత్రం ఒక అవకాశమే కల్పిస్తున్నారని కొందరు గుర్తు చేస్తున్నారు. తక్కువ సమయం ఉండటంతో సక్రమంగా సన్నద్దం కాలేపోయిన విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోతే.. మరో ఏడాదిపాటు వేచి ఉండాలని చెబుతున్నారు. నీట్‌ను ఆగస్టు లేదా సెప్టెంబరు మొదటి వారంలో నిర్వహించాలని విద్యార్థులు సోషల్‌ మీడియా వేదికగా కోరుతున్నారు.

* బోర్డు పరీక్షలకు, నీట్‌కు మధ్య సమయం తక్కువ

కొన్ని రాష్ట్రాల్లో బోర్డు పరీక్షలు పూర్తయ్యే సమయాన్ని పరిశీలిస్తే.. రెండు నెలల కంటే తక్కువ సమయం విద్యార్థులకు మిగులుతోంది. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష జూన్ 15న ముగియనుంది. ఇంత తక్కువ సమయం ఉండటంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఇప్పుడు మెడికల్ ప్రవేశ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

* డ్రాపర్స్ డిమాండ్

NEET 2021కి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యంగా ముగిసిందని, దీని వల్ల విద్యార్థులు ప్రిపేర్ కావడానికి తక్కువ సమయం పడుతుందని గత సంవత్సరం డ్రాపర్లు చెబుతున్నారు. #postponeneetug2022, #ReschduleNEETUG2022 అనే హ్యాష్‌ట్యాగ్‌లతో ట్విట్టర్‌ వేదికగా విద్యార్థులు తమ డిమాండ్‌లను వినిపిస్తున్నారు.

* జేఈఈ మెయిన్ తర్వాతే నీట్..

జేఈఈ మెయిన్‌తో నీట్‌ను పోలుస్తూ.. పరీక్ష సక్రమంగా రాయలేకపోయిన వారికి మరొక అవకాశం ఉండదని, అలాంటి విద్యార్థులు మరో సంవత్సర కాలం వేచి ఉండాల్సి వస్తోందని విద్యార్థులు పేర్కొంటున్నారు. నీట్ యూజీ 2022ను జేఈఈ మెయిన్ సెకండ్ అటెమ్ట్ తర్వాత.. అంటే ఆగస్టు మొదటి వారం తర్వాత మాత్రమే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు ఒకే ఒక్క అవకాశం లభిస్తున్నందున.. ఈ మేరకు అదనపు సమయం కావాలని కోరుతున్నారు.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 6వ తేదీ. ఈ సంవత్సరం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ వ్యవధిని 20 నిమిషాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పెంచింది. ఇప్పుడు విద్యార్థులు పరీక్షను 3 గంటల 20 నిమిషాలు లేదా 200 నిమిషాలలో పూర్తి చేయాల్సి ఉంటుంది. పరీక్షలో అడిగే మొత్తం ప్రశ్నల సంఖ్య 180గా ఉంటుంది. ఈ ఏడాది వయోపరిమితిని కూడా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ తొలగించింది. గతేడాది వరకు సాధారణ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 25 ఏళ్లు, రిజర్వ్‌డ్ అభ్యర్థులకు 30 ఏళ్లు. ఈ నిబంధనను ఇప్పుడు తొలగించారు

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, NEET 2022, Students

ఉత్తమ కథలు