NEET 2022: పేదరికానికి, ప్రతిభకు సంబంధం లేదని మరోసారి నిరూపితమైంది. ఒడిశాలోని మారుమూల గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థులు మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ (Neet Results 2022) లో సత్తా చాటారు. పేదరికం, ఆర్థిక కారణాలు విజయానికి అడ్డంకి కాదని నిరూపించారు ఈ మట్టిలో మాణిక్యాలు. తమ పిల్లలు విజయం సాధించడం పట్ల ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ అభ్యర్థుల సక్సెస్ స్టోరి (Success Story) తెలుసుకుందాం.
నీట్ 2022లో (NEET) ఒడిశా (Odisha)కు చెందిన రోజు కూలీ కొడుకు, కూరగాయాలు అమ్మేవ్యక్తి కూతురు ఇద్దరూ మంచి ర్యాంకులు సాధించారు. గంజామ్ జిల్లా పొలసరకు చెందిన శంతను దలయి ఎగ్జామ్‌లో 19,678వ ర్యాంకు సాధించాడు. గజపతి జిల్లా అడవ గ్రామానికి చెందిన ఇశ్రిత పాండ 11,895వ ర్యాంకు సాధించారు. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితిని చూసి వారు దిగులు చెందకుండా ఉన్నత లక్ష్యంతో కష్టపడి నీట్ ఎగ్జామ్ క్లియర్ చేశారు. ఇప్పుడు మంచి కాలేజీలో అడ్మిషన్ కోసం చూస్తున్నారు.
* రెండో ప్రయత్నం
ఈ ఇద్దరు అభ్యర్థులు గతేడాది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు. కాగా, అప్పుడు వీరు క్వాలిఫై కాలేదు. ఈ సారి మాత్రం సత్తా చాటారు. ఇశ్రిత పాండ తండ్రి కూరగాయాలు అమ్ముకుంటూ తన కుటుంబాన్ని పోషించారు. కూతురును వైద్యురాలి చేయడం తన కలని ఆయన చెప్పారు. తన కలను నిజం చేయబోతున్న కూతుర్ని చూసి సంతోషపడుతున్నానని వివరించారు. కొవిడ్ మహమ్మారి కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చి, వ్యాపారంలో సరిగా లాభాలు రాలేదని, అయినా తన కూతురు చదువుకు తగిన ప్రోత్సాహం ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఆమె కూతురు చదువు పట్ల ఏనాడు నిర్లక్ష్యం వహించలేదని వివరించారు. నీట్‌లో 720 మార్కులకు గాను ఈ విద్యార్థి 622 మార్కులు సాధించడం విశేషం.
Rail India Jobs: రైల్ ఇండియాలో ఉద్యోగాలు .. దరఖాస్తు చేసుకోండిలా..
* ఫ్రీ కోచింగ్‌తో..
రోజు కూలీ కొడుకు అయిన శంతను దలయి సైతం కష్టపడి చదివి నీట్ ఎగ్జామ్ క్లియర్ చేశాడు. తాను ఆర్యభట్ట అనే ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫ్రీగా కోచింగ్ తీసుకున్నట్లు తెలిపాడు. సుధీర్ రౌత్ అనే ప్రొఫెసర్ నడిపే ఈ ఇన్‌స్టిట్యూట్ వారు తనకు అండగా నిలిచారని పేర్కొన్నాడు. ఒడిశాలోని ఏదైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ కోసం తాను ఎదురు చూస్తున్నానని తెలిపాడు. శంతను దలయి సక్సెస్‌పై ఆయన తండ్రి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
లక్ష్యం నిర్దేశించుకుని కష్టపడి పట్టుదలతో కృషి చేస్తే అనుకున్నది తప్పకుండా సాధించవచ్చని ఒడిశాకు చెందిన ఈ విద్యార్థులు నిరూపించారు. తాము ప్రయోజకులమైన తర్వాత.. ఉన్నత కలలు కనే పేద విద్యార్థులకు అన్ని విధాలుగా సాయం చేస్తామని వీరు తెలిపారు. తల్లిదండ్రులు తమపైన పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయడం కోసం చదువుల్లో కష్టపడి, లక్ష్యం కోసం పోరాడాలని యువతకు సూచిస్తున్నారు. తొలి ప్రయత్నంలో తాము విఫలమయ్యామని, అయినా వెనుకడుగు వేయకుండా పట్టుదలతో విజయం సాధించామని చెప్పారు. లక్ష్యాలను చేరుకోవడానికి పట్టుదల, హార్డ్ వర్క్ ఉంటే చాలని శంతను, ఇశ్రిత చెప్పుకొచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EDUCATION, Medical study, NEET, NEET 2022