Home /News /jobs /

NEET 2022 REGISTRATIONS SOON HOW TO APPLY FOR MEDICAL ENTRANCE DOCUMENTS NEEDED GH VB

NEET 2022: త్వరలోనే నీట్ 2022 నోటిఫికేషన్​ విడుదల.. దరఖాస్తు విధానం, కావాల్సిన డాక్యుమెంట్ల వివరాలివే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వైద్య విద్యా కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ NEET) 2022 రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్​ను వచ్చే వారం విడుదల చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ

ఇంకా చదవండి ...
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వైద్య విద్యా కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ NEET) 2022 రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్​ను వచ్చే వారం విడుదల చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సన్నాహాలు చేస్తుంది. ఈ పరీక్షను జూన్ చివరి నాటికి నిర్వహించాలని ఎన్​టీఏ భావిస్తోంది. కాగా, గత రెండేళ్లుగా కోవిడ్​–19 కారణంగా నీట్ నిర్వహణ ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో అకడమిక్​ ఇయర్​ ఆలస్యంగా ప్రారంభమైంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది సకాలంలో నీట్(NEET) పరీక్షను​ నిర్వహించాలని ఎన్​టీఏ భావిస్తోంది. ప్రస్తుతం కోవిడ్​ ఉధృతి తగ్గుముఖం పట్టడంతో పాటు దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు తమ కార్యకలాపాలను యథావిథిగా కొనసాగిస్తున్నాయి. అన్ని రకాల పోటీపరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నీట్​ ప్రవేశాలను కూడా సకాలంలో పూర్తి చేసేందుకు ఎన్​టీఏ ఏర్పాట్లు చేస్తోంది.

Application Invited: వాళ్లు ఏడాదికి రూ.60 వేలు పొందే అవకాశం.. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 15.. వివరాలివే..


నీట్ 2022 అర్హత ప్రమాణాలు
ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/బయోటెక్నాలజీ లేదా మ్యాథమెటిక్స్ లేదా ఏదైనా ఇతర ఆప్షనల్​ సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు నీట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది 12వ తరగతి పరీక్షకు హాజరైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

కావాల్సిన డాక్యుమెంట్లు

1. అభ్యర్థి ఫోటో స్కాన్డ్​ కాపీ

2. దరఖాస్తుదారు సంతకం స్కాన్ చేసిన కాపీ

3. పదో తరగతి పాస్ సర్టిఫికేట్

4. ఇంటర్మీడియట్​ పాస్ సర్టిఫికేట్

5. ఆధార్ కార్డు

6. కేటగిరీ సర్టిఫికేట్ (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​)

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

- NTA NEET 2022 అధికారిక పోర్టల్ neet.com, www.nta.nic.in వెబ్​సైట్లు ఓపెన్ చేయండి

- హోమ్‌పేజీలోని రిజిస్ట్రేషన్ ఫారమ్‌ లింక్​పై క్లిక్ చేయండి.

- వ్యాలిడ్​ ఈ–మెయిల్ ఐడి, మొబైల్ నంబర్‌ నమోదు చేసి రిజిస్ట్రేషన్​ పూర్తి చేయండి.

- రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, లాగిన్ డీటెయిల్స్​ను సేవ్ చేయండి.

- దరఖాస్తు ఫారమ్‌లోని అడిగిన అన్ని వివరాలను పూరించండి. అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.

- ఎగ్జామ్​ ఫీజు చెల్లించండి.

- కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్‌అవుట్ తీసుకోండి.

గతేడాది, నీట్​ పరీక్షను ఇంటర్నల్​ ఛాయిస్​ విధానంలో నిర్వహించారు. ప్రతి విభాగం నుంచి 45 ప్రశ్నలకు బదులుగా, 50 ప్రశ్నలు అడిగారు. సమాధానాలను గుర్తించడానికి ఓఎంఆర్​ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) షీట్‌ను అందించారు. పెన్ అండ్ పేపర్ మోడ్‌లో పరీక్ష నిర్వహించారు. అయితే, ఈ ఏడాది కూడా ఈ కొత్త విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు నీట్​ పరీక్షకు పోటీపడుతుంటారు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, NEET

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు