NEET 2022 PREPARING FOR WATER THESE ARE THE BOOKS THAT TOPPERS ARE REFERRING TO GH EVK
NEET 2022: నీట్‌కు ప్రిపేర్ అవుతున్నారా..? టాపర్‌లు సూచిస్తున్న పుస్తకాలు ఇవే!
(ప్రతీకాత్మక చిత్రం)
NEET- 2022 | రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. జులై 17న మెడికల్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్రకటించింది. లక్షలాది మంది అభ్యర్థులు మెడికల్, డెంటల్ కాలేజీల్లో సీటు కోసం పోటీపడనున్నారు. విద్యార్థులకు గత పరీక్షల్లో టాపర్‌గా నిలిచ
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET- 2022) రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. జులై 17న మెడికల్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్రకటించింది. లక్షలాది మంది అభ్యర్థులు మెడికల్, డెంటల్ కాలేజీల్లో సీటు కోసం పోటీపడనున్నారు. నీట్‌ను క్లియర్ చేయడానికి, నీట్‌లో ఉత్తీర్ణత సాధించడమే కాదు, అందులో మంచి ర్యాంక్ సాధించడం కూడా ముఖ్యం. ఈ ఏడాది మొదటిసారి పరీక్ష రాయనున్న విద్యార్థులకు గత పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన వారి కంటే స్టడీ ప్రిపరేషన్‌ను ఎవరు బాగా సూచించగలరు?
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) కోసం సిలబస్ స్టేట్ బోర్డ్, CBSE, CICSE, NIOS, COBSE 11వ తరగతి, 12వ తరగతి సిలబస్‌ను పరిగణనలోకి తీసుకొంటారు. గతంలో నీట్‌లో టాపర్లుగా నిలిచిన వారు సిఫార్సు చేసిన కొన్ని పుస్తకాలు ఇవే..
నీట్ 2018లో ఫస్ట్ ర్యాంక్: కల్పనా కుమారి
బీహార్‌కు చెందిన కల్పనా కుమారి 2018 నీట్‌లో మొదటి ర్యాంక్ సాధించింది. ఆమె 10వ తరగతి పరీక్ష తర్వాత రోజుకు దాదాపు 13 నుంచి 14 గంటలు నీట్‌కు సన్నద్ధమైంది. కల్పన 750 మార్కులకు 691 మార్కులు సాధించింది. ఆమె ప్రిపరేషన్ కోసం పూర్తిగా NCERT పుస్తకాలపై ఆధారపడింది. అవి చదివినందు వళ్లే చాలా సబ్జెక్టుల్లో ప్రాథమిక అంశాలు అర్థమయ్యాయని ఆమె చెప్పింది.
నీట్ 2021లో ఫస్ట్ ర్యాంక్: మృణాల్ కుట్టేరి హైదరాబాద్ (Hyderabad) కు చెందిన మృణాల్ కుట్టేరి మెడికల్ ప్రవేశ పరీక్షలో పూర్తి మార్కులు సాధించి 2021లో మొదటి ర్యాంకు దక్కించుకొన్నాడు. ప్రాథమిక సన్నాహాల కోసం అతను NCERT పుస్తకాలు, మునుపటి సంవత్సరం ప్రశ్నపత్రాలను అనుసరించాడు. నీట్ సన్నద్ధతపై మృణాల్ మాట్లాడుతూ.. ‘పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అందరికీ ఒకే విధానం సరిపోదు. నేను కూడా చాలా పద్ధతులను పాటించాను. చివరికి నిర్మాణాత్మక విధానం నాకు పని చేయదని గ్రహించాను. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఎవరైనా ధైర్యంగా ఉండాలి. ప్రయోగాలు చేయడానికి స్వేచ్ఛగా ఉండాలి. ఏ విధానం సరిపోతుందో గ్రహించి దానికే కట్టుబడి ఉండాలి.’ అని చెప్పాడు.
నీట్ 2021లో 4వ ర్యాంక్: అమన్ కుమార్ త్రిపాఠి
ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమన్ కుమార్ త్రిపాఠి 720కి 716 మార్కులు సాధించి 4వ ర్యాంక్ సాధించాడు. అతను ఎక్కువగా NCERT, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రానికి సంబంధించిన మాడ్యూల్స్ నుంచి ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడంపై దృష్టి సారించాడు. గంటల వారీగా కాకుండా ప్రతిరోజూ కవర్ చేయాల్సిన అంశాలు, సబ్జెక్టుల సంఖ్య ఆధారంగా అతను అధ్యయనం చేసేవాడు. "నేను రోజుకు కొన్ని టాపిక్‌లను ఎంచుకొని చదువుకొనే వాడిని. ఎంత సమయం తీసుకున్నా ఆ రోజు అవి తప్పక పూర్తి చేయాలని నా మనస్సులో నిశ్చయించుకొని చదవడానికి కూర్చునేవాడిని." అని అతను చెప్పాడు.
నీట్ 2021లో 5వ ర్యాంక్: హ్రుతుల్ చాగ్
గుజరాత్‌కు చెందిన హృతుల్ గతేడాది 720కి 715 మార్కులు సాధించాడు. అతను కూడా NCERT పుస్తకాలపై ఎక్కువగా ఆధారపడ్డాడు. దానిని చాలా ముఖ్యమైన అధ్యయన వనరుగా పేర్కొన్నాడు. “ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను చదవడంపై దృష్టి పెట్టాలి. చాలా మంది విద్యార్థులు సరిగ్గా చదవరు. NCERT నుంచి తగినంత మొత్తంలో ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. ఎవరైనా NEET 2021ని క్లియర్ చేయలేక పోతే, వారు నిష్క్రమించకూడదు. విజయానికి సాధన, పట్టుదల కీలకం. కష్టపడి చదవండి, మీరు దానిని సాధించగలరు.” హ్రుతుల్ చాగ్ అన్నాడు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.