హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET 2022 Questions: నీట్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నారా..? అయితే ఈ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి..

NEET 2022 Questions: నీట్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నారా..? అయితే ఈ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నీట్ ఎగ్జామ్‌కు మూడు నెలల కన్నా తక్కువ సమయం మిగిలి ఉంది. ఈ సమయంలో NEET 2022 సిలబస్‌ను కవర్ చేసే సాధారణ పుస్తకాలను చదవడమే కాకుండా, క్వశ్చన్ బ్యాంక్స్ ప్రాక్టీస్ చేయడం మంచిది.

అండర్ గ్రాడ్యుయేట్(Under Graduate) మెడికల్ కోర్సులలో(Medical Course) ప్రవేశాలకు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) 2022 పరీక్షను(Exam) జూలై 17న నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం నీట్ ఎగ్జామ్(NEET Exam) జరుగుతుంది. 12వ తరగతి విద్యార్థుల కోసం సెట్(SET) చేసే ఈ పరీక్ష, అత్యంత కఠినమైన ఎగ్జామ్స్‌లో ఒకటిగా నిలుస్తోంది. సాధారణంగా నీట్‌లో 11వ తరగతి, 12వ తరగతి సిలబస్ కవర్ అవుతుంది. బయాలజీ(Biology), ఫిజిక్స్(Physics), కెమిస్ట్రీ(Chemistry) సబ్జెక్ట్స్‌పై ప్రశ్నలు వస్తాయి. ప్రస్తుత సంవత్సరానికి కామన్ మెడికల్ ప్రవేశ పరీక్ష(Common Medical Entrance Test) కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను మే 6లోగా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. NEET 2022 కోసం అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ మే 7.

నీట్ ఎగ్జామ్‌కు మూడు నెలల కన్నా తక్కువ సమయం మిగిలి ఉంది. ఈ సమయంలో NEET 2022 సిలబస్‌ను కవర్ చేసే సాధారణ పుస్తకాలను చదవడమే కాకుండా, క్వశ్చన్ బ్యాంక్స్ ప్రాక్టీస్ చేయడం మంచిది. తద్వారా ఎక్కువ శ్రద్ధ అవసరమయ్యే టాపిక్స్‌పై దృష్టి పెట్టవచ్చు. మీరు కూడా నీట్‌కు ప్రిపేర్ అవుతుంటే.. మీ ప్రిపరేషన్‌కు సాయం చేసే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి.

Scholarships: ఇండియన్ స్టూడెంట్స్ కోసం స్పెషల్ స్కాలర్‌షిప్‌.. ప్రకటించిన యూకే యూనివర్సిటీ.. వివరాలిలా..


Q1: పొటెన్షియోమీటర్ సర్క్యూట్‌లో EMF 1.5 V సెల్, వైర్‌పై 36 సెం.మీ పొడవు వద్ద బ్యాలెన్స్ పాయింట్‌ను ఇస్తుంది. మొదటి సెల్‌ను మరో EMF 2.5 V సెల్ భర్తీ చేస్తే, అప్పుడు వైర్ ఏ పొడవు వద్ద బ్యాలెన్స్ పాయింట్ ఏర్పడుతుంది?

(1) 60 సెం.మీ

(2) 21.6 సెం.మీ

(3) 64 సెం.మీ

(4) 62 సెం.మీ

సమాధానం: ఆప్షన్ 1

Q2: పోలార్ మాలిక్యూల్స్ అంటే..

(1) జీరో డైపోల్ మొమెంట్ ఉండేది.

(2) ఛార్జీల స్థానభ్రంశం కారణంగా విద్యుత్ క్షేత్రం సమక్షంలో మాత్రమే డైపోల్ మొమెంట్ పొందేది.

(3) అయస్కాంత క్షేత్రం లేనప్పుడు మాత్రమే డైపోల్ మొమెంట్ పొందేది.

(4) శాశ్వత ఎలక్ట్రిక్ డైపోల్ మొమెంట్ కలిగి ఉంటుంది.

సమాధానం: ఆప్షన్ 4

Q3: ఘన-స్థితి, ఆవిరి దశలో బెరీలియం క్లోరైడ్ నిర్మాణాలు..

(1) చైన్, డైమర్

(2) రెండింటిలోనూ లీనియర్‌గా ఉండేవి

(3) డైమర్, లీనియర్

(4) చైన్.. రెండింటిలోనూ

సమాధానం: ఆప్షన్ 4

Q4: రీకాంబినెంట్ DNA టెక్నాలజీ కోసం శుద్దీకరణ ప్రక్రియలో చల్లబడిన ఇథనాల్ చేరిక..

(1) RNA

(2) DNA

(3) హిస్టోన్స్

(4) పాలీశాకరైడ్లు

సమాధానం: ఆప్షన్ 2

Q5: టర్బైన్‌ను ఆపరేట్ చేయడానికి 60 మీటర్ల ఎత్తు నుంచి 15 kg/s చొప్పున నీరు వస్తుంది. రాపిడి శక్తి వల్ల వచ్చే నష్టాలు ఇన్‌పుట్ శక్తిలో 10%. టర్బైన్ ద్వారా ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది? (గ్రా= 10మీ/సె²)

(1) 10.2 kW

(2) 8.1 kW

(3) 12.3 kW

(4) 7.0 kW

సమాధానం: ఆప్షన్ 2

Q6: కింది స్టేట్‌మెంట్‌లను చదవండి.

(ఎ) హెల్మిన్త్స్‌లో మెటాజెనిసిస్ ఉంటుంది.

(బి) ఎచినోడెర్మ్స్ అనేవి ట్రిప్లోబ్లాస్టిక్, కోలోమేట్ జంతువులు.

(సి) రౌండ్‌వార్మ్‌లు బాడీ ఆర్గనైజేషన్‌లో ఆర్గాన్ సిస్టమ్ లెవెల్‌తో ఉంటాయి.

(డి) సెటోనోఫోర్స్‌లో ఉండే కోంబ్ ప్లేట్స్.. జీర్ణక్రియకు సహాయపడతాయి.

(ఇ) వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఎచినోడెర్మ్స్ లక్షణం.

కింద ఇచ్చిన ఆప్షన్స్ నుంచి సరైన సమాధానాన్ని ఎంచుకోండి.

(1) (సి), (డి), (ఇ) సరైనవి

(2) (ఎ), (బి), (సి) సరైనవి

(3) (ఎ), (డి), (ఇ) సరైనవి

(4) (బి), (సి), (ఇ) సరైనవి

సమాధానం: ఆప్షన్ 4

Important Dates: ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు ఇవే

Q7: వైర్ యొక్క వ్యాసాన్ని కొలవడానికి ఉపయోగించినప్పుడు స్క్రూ గేజ్ కింది రీడింగ్‌లను ఇస్తుంది

ప్రధాన స్థాయి పఠనం: 0 మిమీ

సర్క్యులర్ స్కేల్ రీడింగ్: 52 విభాగాలు

ప్రధాన స్కేల్‌పై 1 మిమీ, వృత్తాకార స్కేల్‌పై 100 డివిజన్‌లకు అనుగుణంగా ఉంటుంది.

పై డేటా ఆధారంగా వైర్ వ్యాసం ఎంత?

(1) 0.52 సెం.మీ

(2) 0.026 సెం.మీ

(3) 0.26 సెం.మీ

(4) 0.052 సెం.మీ

సమాధానం- ఆప్షన్ 4

నీట్ 2022లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల నుంచి మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు ఇస్తారు. అయితే ప్రతి తప్పుకు నెగిటివ్ మార్కు ఉంటుంది.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, NEET, NEET 2022, Students