హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET 2022: నీట్‌కు ప్రిపేర్ అవుతున్నారా..? బెస్ట్ ర్యాంక్‌తో అడ్మిషన్ వ‌చ్చే టాప్-25 మెడికల్ కాలేజీలు ఇవే..

NEET 2022: నీట్‌కు ప్రిపేర్ అవుతున్నారా..? బెస్ట్ ర్యాంక్‌తో అడ్మిషన్ వ‌చ్చే టాప్-25 మెడికల్ కాలేజీలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NEET 2022 | నీట్‌లో మంచి ర్యాంక్ సాధించిన వారు దేశంలోని బెస్ట్ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ పొందవచ్చు. విద్యా శాఖ విడుదల చేసిన నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) 2021 ప్రకారం, దేశంలోని టాప్ 25 మెడికల్ కాలేజీలు ఏవో చూద్దాం.

ఇంకా చదవండి ...

మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ అయిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) 2022 కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) దరఖాస్తులను స్వీకరిస్తోంది. అప్లికేషన్‌ ఫారమ్‌ సమర్పించడానికి చివరి తేదీ మే 6. పరీక్షను జూలై 17న నిర్వహించనున్నారు. ప్రభుత్వ, రాష్ట్ర, ప్రైవేట్ కళాశాలల్లో మెడికల్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం ప్రతి సంవత్సరం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్‌లో మంచి ర్యాంక్ సాధించిన వారు దేశంలోని బెస్ట్ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ పొందవచ్చు. విద్యా శాఖ విడుదల చేసిన నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) 2021 ప్రకారం, దేశంలోని టాప్ 25 మెడికల్ కాలేజీలు ఏవో చూద్దాం.

TSPSC Group-1: గ్రూప్‌-1 అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. పోస్టుల కేటాయింపుపై సందేహాలా.. ఈ విష‌యాలు తెలుసుకోండి

1. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీ

2. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, చండీగఢ్

3. క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, వెల్లూరు

4. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ & న్యూరో సైన్సెస్, బెంగళూరు

5. సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, లక్నో

6. అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూరు

7. బెనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి

8. జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్, పుదుచ్చేరి.

TS Police Job Preparation: పోలీస్ ఉద్యోగాల‌కు ప్రిపేర్ అవుతున్నారా.. ఈ టైం టేబుల్ ట్రై చేయండి

9. కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ, లక్నో

10. కస్తూర్బా మెడికల్ కాలేజ్, మణిపాల్

11. శ్రీ చిత్ర తిరునాళ్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ, తిరువనంతపురం

12. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్, న్యూఢిల్లీ

13. జాన్స్ మెడికల్ కాలేజ్, బెంగళూరు

14. శ్రీ రామచంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, చెన్నై

15. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, అలీఘర్

16. మద్రాస్ మెడికల్ కాలేజ్ & గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, చెన్నై

17. మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్, ఢిల్లీ

18. వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజ్ & సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, న్యూఢిల్లీ

19. DY పాటిల్ విద్యాపీఠ్, పూణే

20. RM ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చెన్నై

21. శిక్ష `ఓ` అనుసంధన్, భువనేశ్వర్

22. లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్, న్యూఢిల్లీ

23. కస్తూర్బా మెడికల్ కాలేజ్, మంగళూరు

24. JSS మెడికల్ కాలేజ్, మైసూర్

25. జామియా హమ్దార్ద్, న్యూఢిల్లీ

Excise Constable Syllabus: ఎక్సైజ్ శాఖలో కొలువు మీ ల‌క్ష్య‌మా.. సిల‌బ‌స్, ప‌రీక్ష వివ‌రాలు తెలుసుకోండి

కోవిడ్-19 ప్రోటోకాల్స్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పరీక్ష కేంద్రాలను పెంచాలని NTA నిర్ణయించింది. నీట్ 2022 అడ్మిషన్ బ్రోచర్ ప్రకారం, భారతదేశంలోని 543 నగరాల్లో పరీక్ష జరుగుతుంది. ఇది గత సంవత్సరం ఎగ్జామ్ జరిగిన నగరాల సంఖ్య కంటే దాదాపు రెట్టింపు. ఈ సంవత్సరం NTA ఇండియన్ సిటిజన్స్‌కు పరీక్ష ఫీజును రూ. 100, విదేశీ అభ్యర్థులకు రూ. 1000 పెంచింది. పరీక్ష సమయాన్ని మూడు గంటల నుంచి 3 గంటల 20 నిమిషాలకు పెంచారు. అదనపు 20 నిమిషాలు పరీక్షను సకాలంలో ముగించడానికి కష్టపడే విద్యార్థులకు గేమ్-ఛేంజర్‌గా మారనుంది. దీంతోపాటు పరీక్షకు గరిష్ట వయోపరిమితిని కూడా తొలగించారు. దీంతో జాతీయ స్థాయి వైద్య పరీక్షను ఎవరైనా రాసే అవకాశం కలిగింది.

First published:

Tags: Career and Courses, EDUCATION, Medical colleges, NEET 2022

ఉత్తమ కథలు