Home /News /jobs /

NEET 2022 OFFICIAL NOTIFICATION TODAY ABOUT THE NEET EXAM DATE THE OPPORTUNITY TO TAKE THE EXAM ON JUNE 17 GH VB

NEET 2022: నీట్ ఎగ్జామ్ డేట్ గురించి నేడు అధికారిక నోటిఫికేషన్.. ఆ రోజున పరీక్ష నిర్వహించే అవకాశం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి నీట్ (NEET) పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది. 2022కు సంబంధించి నీట్ పరీక్ష తేదీ గురించి నేడు NTA అధికారిక వెబ్ సైట్ onneet.nta.nic.inలో నోటిఫికేషన్ విడుదల అవుతుందని అధికారులు తెలిపారు.

ఇంకా చదవండి ...
దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి నీట్ (NEET) పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది. 2022కు సంబంధించి నీట్ పరీక్ష తేదీ గురించి నేడు NTA అధికారిక వెబ్ సైట్ neet.nta.nic.inలో నోటిఫికేషన్ విడుదల అవుతుందని అధికారులు తెలిపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నీట్ పరీక్షను జూలై17న నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మెడికల్ అండ్ డెంటల్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష(నీట్) కోసం రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 2 నుండి ప్రారంభం కానుంది. నీట్-2022 పరీక్ష నిర్వహించే తేదీ, పూర్తి షెడ్యూల్‌తో కూడిన నోటిఫికేషన్‌ను నేడు అంటే మార్చి 31న విడుదల అయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం సంస్థ అధికారిక వెబ్‌సైట్ nta.ac.inను విద్యార్థులు సందర్శించవచ్చు.

నీట్ 2022 పరీక్షను దేశవ్యాప్తంగా 13 భాషల్లో నిర్వహించనున్నారు. ఆఫ్‌లైన్ మోడ్ అంటే పెన్ అండ్ పేపర్ విధానంలో చేపట్టనున్నారు. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ వంటి పాన్ ఇండియా లెవల్‌తో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, మలయాళం, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు మొత్తం పది ప్రాంతీయ భాషల్లో కూడా నీట్ పరీక్షను నిర్వహించనున్నారు. నీట్ 2022 పరీక్షకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని తొలగించింది నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC). డిసెంబర్ 31, 2022 నాటికి 17 ఏళ్లు నిండిన లేదా పూర్తి కావొస్తున్న విద్యార్థులందరూ నీట్ పరీక్ష రాయడానికి అర్హులు. నీట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే MBBS, BDSతో పాటు ఇతర అనుబంధ వైద్య రంగాల్లో అడ్మిషన్ పొందడానికి అర్హత ఉంటుంది. విదేశాల్లో మెడిసిస్ చదువుకోవడానికి అర్హత సాధించాలంటే నీట్ ఉత్తీర్ణత తప్పనిసరి.

Citi-Axis Bank Deal: యాక్సిస్‌ చేతికి సిటీబ్యాంక్‌ కన్సూమర్‌ బిజినెస్‌.. తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..


* నీట్-2022 దరఖాస్తుకు అవసరమైన పత్రాలు
అభ్యర్థి ఫొటో స్కాన్ కాపీ, అభ్యర్థి సంతకం స్కాన్ కాపీ, పదో తరగతి పాస్ సర్టిఫికేట్, 12వ తరగతి పాస్ సర్టిఫికేట్, ఆధార్ కాపీ, కేటగిరి సర్టిఫికేట్ తదితర పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

* నీట్-2022 అప్లై చేసుకునే విధానం

స్టెప్1- NTA NEET 2022 అధికారిక పోర్టల్ neet.nta.nic.inను సందర్శించాలి

స్టెప్2- హోమ్ పేజీకి వెళ్లి రిజిస్ర్టేషన్ ఫారం లింక్‌పై క్లిక్ చేయాలి

స్టెప్3- మీ ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఉపయోగించి మీ వివరాలను నమోదు చేసుకోవాలి

స్టెప్4-రిజిస్ట్రేషన్ పూర్తయిన తరువాత లాగిన్ ఆధారాలను సేవ్ చేయండి

స్టెప్5- అప్లికేషన్ ఫారంలోని మిగతా వివరాలను నమోదు చేసి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి

స్టెప్6- చివరగా అప్లికేషన్ ఫీజును చెల్లించండి

మెడికల్ సీట్ల భర్తీ వివరాలు
నీట్‌ పరీక్ష ద్వారా దేశంలోని 532 మెడికల్‌ కాలేజీల్లో 83,125 ఎంబీబీఎస్‌ సీట్లు, 313 డెంటల్‌ కాలేజీల్లో 26,949 బీడీఎస్‌ సీట్లు, 52,720 ఆయుష్, 525 బీవీఎస్‌సీ సీట్లకు ప్రవేశాలు కల్పించనున్నారు. తెలంగాణలో 2022–23 వైద్య విద్యా సంవత్సరంలో అదనంగా 8 వైద్య కళాశాలలు రానున్నాయి. వాటిల్లో 1,200 ఎంబీబీఎస్‌ సీట్లను భర్తీ చేయనున్నారు. మెడికల్‌ ప్రవేశాల్లో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలుకానున్నాయి. ఈ కోటా కింద ఆయా అభ్యర్థులకు 10% రిజర్వేషన్‌ లభిస్తుంది. ఈడబ్ల్యూఎస్‌ కోటాకు అనుగుణంగా ఈసారి 5,200 మెడికల్‌ సీట్లు రానున్నాయని NTA వర్గాలు తెలిపాయి. ఎయిమ్స్, జిప్‌ మర్‌ వంటి ప్రతిష్టాత్మక మెడికల్‌ విద్యాసంస్థలతో పాటు దేశంలోని అగ్రశ్రేణి వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ వంటి యూజీ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు నీట్‌ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, NEET 2022

తదుపరి వార్తలు