Home /News /jobs /

NEET 2022 NTA REDUCES NUMBER OF EXAM CITIES FOR MEDICAL ENTRANCE UMG GH

NEET 2022: నీట్ ఎగ్జామ్ సెంటర్లలో కోత.. ఎగ్జామ్ జరిగే నగరాల సంఖ్య తగ్గింపు.. కారణం ఏంటంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నీట్‌కు ఆతిథ్యం ఇచ్చే నగరాల సంఖ్యను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) చాలావరకు తగ్గించింది. ఇంతకుముందు మన దేశంలోని 546 నగరాల్లో, 14 విదేశీ సెంటర్లలో నీట్ ఎగ్జామ్ జరిగింది. అయితే ఈ ఏడాది పరీక్షలు జరిగే భారతీయ నగరాల సంఖ్య 497కి తగ్గింది.

ఇంకా చదవండి ...
మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ నీట్ (NEET) 2022 అడ్మిట్ కార్డులు మంగళవారం విడుదలయ్యాయి. దీంతో ఎగ్జామ్ వాయిదా పడే అవకాశం లేదని అధికారులు ధ్రువీకరించారు. అయితే ఎగ్జామ్ జరిగే నగరాల సంఖ్య మాత్రం ఈసారి తగ్గింది. నీట్‌కు ఆతిథ్యం ఇచ్చే నగరాల సంఖ్యను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) చాలావరకు తగ్గించింది. ఇంతకుముందు మన దేశంలోని 546 నగరాల్లో, 14 విదేశీ సెంటర్లలో నీట్ ఎగ్జామ్ జరిగింది. అయితే ఈ ఏడాది పరీక్షలు జరిగే భారతీయ నగరాల సంఖ్య 497కి తగ్గింది. ఇంటర్నేషనల్ సెంటర్స్ సంఖ్య మాత్రం అలాగే ఉంది.

NEET అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేసే తేదీ, సమయాన్ని ఎన్టీఏ ఇటీవల వెల్లడించింది. ఈ సందర్భంగా పరీక్షలు జరిగే నగరాల సంఖ్య మార్పులకు సంబంధించి కొన్ని రిప్రజెంటేషన్స్ అందాయని తెలిపింది. ఆ రిప్రజెంటేషన్స్‌ పరిశీలించామని, దీని ఆధారంగా పరీక్ష నిర్వహించే నగరాల సంఖ్యపై తుది నిర్ణయం తీసుకున్నామని NTA అధికారిక నోటీసులో తెలిపింది.

 ఇదీ చదవండి: యూరప్ మార్కెట్‌లో మన బ్యాగులకు ఫుల్ డిమాండ్.. మొత్తం ఒక్క విలేజ్ నుంచే వెళ్తాయంటా..! ఆ బ్యాగులను చూసేద్దామా..


గత సంవత్సరం NEET, JEE రెండింటిలోనూ చీటింగ్ కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ సంవత్సరం NTA పరీక్షకు అనేక సెక్యూరిటీ ఫీచర్లను జోడించింది. ఎగ్జామ్ సెంటర్స్ లిస్ట్‌ను బయటకు వెల్లడించలేదు. పరీక్ష హాళ్లలో జామర్‌లు, సీసీటీవీలు అమర్చడంతో పాటు తనిఖీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎగ్జామ్‌కు డ్రెస్ కోడ్, ఇతర కఠిన నిబంధనలను కూడా NTA విడుదల చేసింది. పొడవాటి చేతులు ఉండే దుస్తులు, బూట్లు, నగలు, బెల్టులు, వాచ్‌లను ఎగ్జామ్ హాల్‌లోకి అనుమతించరు.

కొన్ని ఎగ్జామ్ సెంటర్‌లను తక్కువ మంది విద్యార్థులు ఎంచుకున్నందున, నగరాల సంఖ్య తగ్గి ఉండవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికి సంబంధి ఎగ్జామ్ నోటిఫికేషన్‌లోనే ఒక రూల్ ఉంది. ఒకవేళ ఒక నగరాన్ని ఎంచుకునే అభ్యర్థుల సంఖ్య నిర్దిష్ట సంఖ్య కంటే తక్కువగా ఉంటే.. ఒకటి, రెండు లేదా అంతకంటే ఎక్కువ నగరాల్లోని ఎగ్జామ్ సెంటర్లను విలీనం చేసే హక్కు NTAకి ఉంటుందని నియమాల్లో ఉంది. “అభ్యర్థులు తమ సౌలభ్యం కోసం తమ రాష్ట్రంలో సొంత నగరాన్ని లేదా పొరుగున ఉండే నగరాలను మాత్రమే ఎంచుకోవచ్చు. ఇతర రాష్ట్రాల్లోని దూరపు నగరాలను ఎంచుకోలేరు. అభ్యర్థులు నగరాలను తప్పుగా ఎంపిక చేయడం వల్ల కలిగే అసౌకర్యానికి NTA బాధ్యత వహించదు" అని NTA తెలిపింది.



ఈ సంవత్సరం నీట్‌ ఎగ్జామ్‌కు ఎన్‌టీఏ కొన్ని మార్పులు చేసింది. అభ్యర్థుల వర్గంతో సంబంధం లేకుండా ప్రభుత్వం NEETలో గరిష్ట వయోపరిమితిని తొలగించింది. ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో 12వ తరగతి పూర్తి చేసిన ఎవరైనా మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంతకుముందు NEETకు హాజరు కావడానికి గరిష్ట వయోపరిమితి అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు 25 సంవత్సరాలుగా ఉండగా, ఈసారి రూల్స్ మార్చారు.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, JOBS, Medical, NEET 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు