NEET 2022 NOW IN SEPTEMBER PIB ISSUES CLARIFICATION OVER VIRAL NOTICE UMG GH
NEET 2022: నీట్ వాయిదా పడిందా..? సెప్టెంబర్‌లో పరీక్ష జరగనుందా..? అసలు విషయం ఏంటంటే..!
నీట్ వాయిదా పడిందా..?
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ (NEET) (యూజీ) పరీక్షను జూలై 17, 2022కి బదులుగా సెప్టెంబర్ 4, 2022కి రీషెడ్యూల్ చేసిందని పేర్కొంటూ సోషల్ మీడియా (Social Media)లో ఒక నోటీసు చక్కర్లు కొడుతోంది. ఈ నోటీసు ఫేక్. అభ్యర్థులు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.
గతేడాది సెప్టెంబర్ నెలలో నీట్ యూజీ (NEET UG) 2021 ఎగ్జామ్ కండక్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే మరో పది నెలల కాలంలోనే అంటే జులై 17న నీట్ యూజీ 2022 (NEET UG 2022) ఎగ్జామ్ నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నీట్ అభ్యర్థులు preparationకి కనీసం పది నెలలు కూడా సమయం లేదని, ఇంకో 40 రోజుల పాటు ఎగ్జామ్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక నోటిఫికేషన్ నీట్ అభ్యర్థులను గందరగోళంలో పడేసింది. ఈ నోటిఫికేషన్లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ 2022 సెప్టెంబర్ 4న జరగనుందని పేర్కొన్నారు. దీంతో అభ్యర్థుల డిమాండ్లకు తలొగ్గి ఎన్టీఏ పరీక్షను సెప్టెంబర్ 4కి వాయిదా వేసిందని కొందరు నమ్మేస్తున్నారు. కానీ ఈ నోటిఫికేషన్ ఫేక్ (Fake Notification) అని తాజాగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో క్లారిటీ ఇచ్చింది. ఎగ్జామ్ సెప్టెంబర్ 4న జరుగుతుందనేది పూర్తిగా అబద్ధం అని స్పష్టం చేసింది.
“నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ (యూజీ) పరీక్షను జూలై 17, 2022కి బదులుగా సెప్టెంబర్ 4, 2022కి రీషెడ్యూల్ చేసిందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక నోటీసు చక్కర్లు కొడుతోంది. ఈ నోటీసు ఫేక్! ఎన్టీఏ అటువంటి నోటీసు ఏదీ జారీ చేయలేదు" అని పీఐబీ (PIB) ఫ్యాక్ట్ చెక్ ఒక ట్వీట్ ద్వారా అభ్యర్థుల సందేహాలకు ఫుల్స్టాప్ పెట్టింది. అభ్యర్థులు పరీక్ష తేదీ గురించి మరింత స్పష్టత కోసం 011-40759000 కాల్ చేయవచ్చని లేదా neet@nta.ac.inకి ఈమెయిల్‌ను పంపించవచ్చని తెలిపింది.
ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు నీట్ పరీక్షలను కనీసం 40 రోజులు పోస్ట్‌పోన్ చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కోరుతున్నారు. ఈ పరీక్ష తమ భవిష్యత్తును నిర్ణయించేదని.. అందుకే ప్రిపేర్ అయ్యేందుకు కొంత ఎక్కువ సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే నీట్-యూజీ 2022 పరీక్ష తేదీలో ఇప్పటివరకు ఎలాంటి మార్పులు చేయలేదని ఎన్టీఏ వెల్లడించింది. దీంతో ప్రస్తుతానికి అయితే ఈ పరీక్ష యథావిధిగా జులై 17న జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎగ్జామ్ పోస్ట్‌పోన్ గురించి వచ్చే ఫేక్ నోటిఫికేషన్ల అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
మరోవైపు ఇండియా వైడ్ పేరెంట్స్ అసోసియేషన్ ఎగ్జామ్ వాయిదా వేయాలంటూ ప్రధాన మంత్రికి ఒక లేఖ కూడా రాసింది. కొత్త అకడమిక్ సెషన్ ఫిబ్రవరి 2023లో ప్రారంభమవుతుంది కాబట్టి పరీక్షను వాయిదా వేసినంత మాత్రాన విద్యా సంవత్సరానికి అంతరాయం కలగదని లేఖలో పేర్కొంది. కానీ పరీక్షను వాయిదాపై ఎన్టీఏ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా నీట్ 2022కి 10.64 లక్షల మంది మహిళలు, 8.07 లక్షల మంది పురుషులతో మొత్తంగా 18.72 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఈ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇందుకు ఈ ఏడాది అప్పర్ క్యాప్ ఎత్తివేయడం కూడా ఒక కారణమని నిపుణులు అంటున్నారు.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.