Home /News /jobs /

NEET 2022 NOTIFICATION WILL BE RELEASED SOON HERE ARE THE KEY CHANGES COMING IN THIS YEARS NOTIFICATION GH VB

NEET 2022: త్వరలో నీట్-2022 నోటిఫికేషన్.. ఈ ఏడాది నోటిఫికేషన్‌లో రానున్న కీలక మార్పులు ఇవే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నీట్ కోసం ప్రతి ఏటా దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారు. ఈసారి గరిష్ట వయోపరిమితిని తొలగించినందున దరఖాస్తులు మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే పరీక్ష విధానంలో మార్పులు చేర్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. నీట్ 2022కు సంబంధించి ప్రధాన మార్పులు ఇలా ఉండనున్నాయి.

ఇంకా చదవండి ...
వైద్యవిద్యను అందిస్తున్న కళాశాలల్లో ప్రవేశాల కోసం నీట్ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష)ను నిర్వహిస్తుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA). ఈ ఏడాదికి సంబంధించి ఏప్రిల్ చివరిలో నోటిఫికేషన్(Notification) విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో నీట్ పరీక్ష జూన్‌లో జరిగే అవకాశం ఉంది. నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తు ఫారమ్‌లు కూడా సంస్థ అధికారిక వెబ్‌సైట్ neet.nta.ac.in లేదా nta.ac.inలో విడుదల కానున్నాయి. నీట్ కోసం ప్రతి ఏటా దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారు. ఈసారి గరిష్ట వయోపరిమితిని తొలగించినందున దరఖాస్తులు(Applications) మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే పరీక్ష(Exam) విధానంలో మార్పులు చేర్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. నీట్ 2022కు సంబంధించి ప్రధాన మార్పులు ఇలా ఉండనున్నాయి.

వయో పరిమితి లేకపోవడంతో ప్రభావం ఇలా
విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నీట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు గరిష్ట వయోపరిమితిని తొలగించింది. దీంతో నీట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే ఎవరైనా, ఏ వయస్సు వారైనా వైద్యవిద్యను అభ్యసించవచ్చు. ఏటా దాదాపు 15 లక్షల మంది నీట్ ప్రవేశ పరీక్షకు హాజరవుతుండగా... వైద్య కళాశాలల్లో దాదాపు 80వేల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు విద్యార్థులు పోటీపడుతున్నారు. తాజాగా వయో పరిమితి తొలగించడంతో ఎక్కువ మంది ఔత్సాహికులు పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో పోటీ తీవ్రం కానుంది. గతంలో నీట్ పరీక్ష రాసినవారికి ఇది సహాయపడనుందని... మొదటిసారి రాసేవారికి మాత్రం సవాల్‌గా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇంటర్నల్ ఛాయిస్
NEET 2022 మెడికల్ ప్రవేశ పరీక్షలో విద్యార్థులకు ప్రశ్నలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి సెక్షన్‌లో ప్రశ్నలను ఎంపిక చేసుకోవచ్చు. జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం ఇలా ప్రతి సబ్జెక్టులో 50 ప్రశ్నలకు బదులుగా విద్యార్థులు 45 ప్రశ్నలకు మాత్రమే జవాబులు రాయాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని మొదటిసారిగా 2021లో ప్రవేశపెట్టారు.

JEE Mains 2022: బోర్డు పరీక్షలు క్లాష్ అవుతున్నాయంటూ విద్యార్థుల ఆందోళన.. సోషల్ మీడియా వేదికగా నిరసనలు..


ప్రభుత్వ రుసుము ప్రకారమే ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు
అధిక ఫీజు కారణంగా ఏ విద్యార్థి మెడికల్ సీట్ కోల్పోకూడదని నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) స్పష్టం చేసింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తమ సీట్లలో 50 శాతం వాటిని ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఫీజుతో సమానంగా ఉంచాలని కోరింది. అన్ని రాష్ట్రాల్లోని వైద్య కళాశాలు ఫీజు ఫిక్సేషన్ కమిటీ మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ కోటా సీట్లు మొత్తం మంజూరైన సీట్లలో 50 శాతం కంటే తక్కువగా ఉంటే, మిగిలిన అభ్యర్థులు పూర్తిగా మెరిట్ ఆధారంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో దానికి సమానమైన రుసుము చెల్లించవలసి ఉంటుంది.

నీట్ నిర్వహణ తేదీల్లో మార్పులు
సాధారణంగా నీట్‌ను మేలో నిర్వహిస్తుంటారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లలో సెప్టెంబర్‌లో నిర్వహించారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టుతుండడంతో నీట్ అకడమిక్ షెడ్యూల్ ను మళ్లీ ట్రాక్‌లోకి తీసుకురావడానికి NTA ప్రయత్నం చేస్తుంది. అందుకు అనుగుణంగా జూన్‌లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది.

నీట్ అట్మెంట్స్‌పై చర్చ
మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ నీట్‌ను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించేందుకు ఆరోగ్య, విద్యా మంత్రిత్వ శాఖలు చర్చలు జరిపాయి. పరీక్షను తక్కువ-స్టాక్ చేయడం ఒక ఉద్దేశం అయితే మరోపక్క విద్యార్థులకు మరొక అవకాశం కల్పించవచ్చు. అయితే ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. దాదాపు 15 లక్షల మంది అభ్యర్థులతో ఆఫ్ లైన్ మోడ్‌లో జరిగే నీట్ పరీక్షను రెండుసార్లు నిర్వహించడం అంత తేలిక కాదు. కాగా, నీట్ 2022 ప్రవేశ పరీక్షను ఇంగ్లీషు, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళం, కన్నడ, మరాఠీ, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ, పంజాబ్‌తో సహా 13 భాషలలో నిర్వహించనున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, NEET 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు