Home /News /jobs /

NEET 2022 MAY BE POSTPONED LIKELY TO BE HELD IN JULY NOTIFICATION WILL COME IN NEXT WEEK AK GH

NEET: నీట్‌ 2022 ఎగ్జామ్‌ వాయిదా పడే అవకాశం.. ఆ నెలలో ఉండే ఛాన్స్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ త్వరలో 2022 నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌కు విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోవచ్చని, జులైలో నీట్‌ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
కరోనా వ్యాప్తితో దాదాపు రెండేళ్లపాటు పాఠశాలలు, కళాశాలలు మూతబడ్డాయి. విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యారు. కొన్ని నెలల క్రితమే అందరికీ బడులు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు పూర్తిగా లాక్‌డౌన్‌(Lockdown) ఒత్తిడి నుంచి బయటపడక ముందే బోర్డు, ఇతర ప్రవేశ పరీక్షలు వచ్చేశాయి. విద్యార్థుల డిమాండ్లు, వాయిదాల ప్రకటనలతో దాదాపు అన్ని పరీక్షలకు తేదీలు ఖరారయ్యాయి. నీట్‌ ఎగ్జామ్‌(Neet Exam) విషయంలో మాత్రం సందిగ్ధం కొనసాగుతోంది. ఇప్పటికీ అధికారిక ప్రకటన విడుదల కాలేదు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA) త్వరలో 2022 నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(NEET- National Eligibility Cum Entrance Test) నోటిఫికేషన్‌(Notification)ను విడుదల చేయనుంది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌కు విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోవచ్చని, జులైలో నీట్‌ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. నీట్‌ నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌ neet.nta.nic.in ద్వారా విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

జూన్‌ నెలలోని చివరి రెండు వారాల్లో 2022 నీట్‌ నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచించింది. అయితే జూన్‌ నెలలో కాకుండా జులైలో నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. జూన్‌లో చాలా బోర్డు పరీక్షలు, ఇతర ప్రవేశ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో, జులైలో నీట్‌ నిర్వహించే బాగుంటుందని కొందరును నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు సైతం జూన్‌ నెల మధ్యలో జరగనున్నాయి.

మరోవైపు జేఈఈ మెయిన్‌ 2022 ఫలితాలను జూన్‌లో విడుదల చేయడంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(National Testing Agency) నిమగ్నమై ఉంటుంది. ఇది కూడా నీట్‌ను జులైలో నిర్వహించడానికి ఓ కారణంగా భావిస్తున్నారు. ఈ సమయంలో నీట్‌ పరీక్షను నిర్వహించడం ఎన్‌టీఏ నిర్వాహకులకు కష్టతరమవుతుంది. జులై నెలలో కూడా మధ్య వారంలో నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఉంటుందని, ఆగస్టు 31వ తేదీలోపు ఫలితాలు విడుదలయ్యే సూచనలు ఉన్నాయని సమాచారం. నీట్‌ 2021 కౌన్సెలింగ్‌ పూర్తయిన తర్వాత నీట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

2022 నీట్‌ ఎప్పుడు నిర్వహించాలనే అంశంలో సంబంధిత అధికారులు ఇంకా తర్జనభర్జనలు పడుతున్నారని తెలిసింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. ఈ సంవత్సరం దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ పరీక్ష రాయనున్నారని తెలిపారు. అధికారికంగా నోటిఫికేషన్‌ విడుదల కాక ముందే అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

NEET 2022: మెడికల్‌ సీట్‌ సాధనలో కెమిస్ట్రీ కీలకం.. 180 మార్క్స్ సాధించడానికి నిపుణుల సూచనలివే..!

TS EAMCET 2022: తెలంగాణ ఎంసెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ప‌రీక్ష తేదీల వివ‌రాలు

మెడికల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌కు గరిష్ఠ వయోపరిమితిని తొలగించడంతో.. ఈ ఏడాది పరీక్ష రాసే వారి సంఖ్య పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 2022 నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌)లో అర్హత సాధించిన విద్యార్థులు దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఇతర వైద్య సంబంధిత కోర్సుల్లో చేరవచ్చు.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: NEET 2022

తదుపరి వార్తలు