నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) త్వరలో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేయబోతోంది. నీట్ దరఖాస్తు ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానుంది. జూన్‌లో ఈ పరీక్షను నిర్వహించే అవకాశం ఉంది. నీట్ పరీక్ష ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 80,000 మెడికల్ సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షకు ఏటా దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు పోటీపడుతుంటారు. పోటీ లక్షల్లో ఉన్నప్పటికీ.. సీట్లు మాత్రం వేలల్లోనే ఉన్నాయి. కాబట్టి, నోటిఫికేషన్‌కు ముందే ప్రణాళికాబద్దంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ సారి వయోపరిమితి విషయంలోనూ కొన్ని నిబంధనలను మార్చింది ఎన్టీఏ (NTA). గతంలో 18 నుంచి 25 వయస్సులో ఉన్న వారు మాత్రమే నీట్ యూజీ దరఖాస్తుకు అర్హులు. అయితే, ఈ సారి గరిష్ట వయో పరిమితి నిబంధనను తొలగించింది. అంటే, 18 ఏళ్ల పైబడిన వారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
తద్వారా, ఈ సారి దరఖాస్తుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, పరీక్షకు సిద్ధమవుతున్న వారు తమ ప్రిపరేషన్‌ను మరింత వేగంతో పూర్తి చేయాల్సి ఉంటుంది. నీట్ విజయంలో ముందస్తు సన్నద్దత ఎంగానో ఉపయోగపడుతుంది. ముందుగా టాపిక్‌ల వారీగా వెయిటేజీని అర్థం చేసుకోవాలి. అందుకు అనుగుణంగా ప్రిపరేషన్ కొనసాగించాలి. 11, 12 తరగతులలో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రంలోని ప్రతి అధ్యాయానికి నీట్ పరీక్షలో వెయిటేజీ ఉంటుంది. నీట్ 2022లో సబ్జెక్ట్‌ల వారీగా ఏ చాప్టర్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయో చూద్దాం.
ఫిజిక్స్:
అధ్యాయాలు ప్రశ్నల సంఖ్య
-గతిశాస్త్రం 3 నుండి 4
-బల్క్ మ్యాటర్ లక్షణాలు 3 నుండి 4
-ఎలెక్ట్రోస్టాటిక్స్ 3 నుండి 4
- విద్యుత్తు 4
- పరమాణువులు, కేంద్రకాలు 3 నుండి 4
- ఎలక్ట్రానిక్ పరికరాలు 3
ఫిజికల్ కెమిస్ట్రీ
- ఘన స్థితి 2
- పదార్థ స్థితి 2
- ఎలక్ట్రోకెమిస్ట్రీ 2
- సొల్యూషన్స్ 2
- రసాయన గతిశాస్త్రం 2
ఇనార్గానిక్ కెమిస్ట్రీ
-రసాయన బంధం 5
- P -బ్లాక్ 3
ఆర్గానిక్ కెమిస్ట్రీ
- హైడ్రోకార్బన్లు 4
-కార్బొనిల్ సమ్మేళనం 3
బయాలజీ
- మొక్కల రాజ్యం 5
-జంతు రాజ్యం 4
-పుష్పించే మొక్కలు (అనాటమీ ) 3
-జంతువులలో నిర్మాణం 3
-జీవఅణువులు 3
-కణ చక్రం, కణ విభజన 7
-మొక్కలలో కిరణజన్య సంయోగక్రియ 4
-మొక్కల పెరుగుదల, అభివృద్ధి 3
-శ్వాస మరియు వాయువుల మార్పిడి 3
-శరీర ద్రవాలు, ప్రసరణ 3
-లోకోమోషన్, కదలిక 4
-పుష్పించే మొక్కలలో లైంగిక పునరుత్పత్తి 3
-మానవ పునరుత్పత్తి 3
-పునరుత్పత్తి ఆరోగ్యం 3
-పరమాణు ఆధారం 10
-మానవ ఆరోగ్యం, వ్యాధులు 3
-ఆహార ఉత్పత్తి వృద్ధికి వ్యూహాలు 3
-బయోటెక్నాలజీ సూత్రాలు, ప్రక్రియలు 6
-బయోటెక్నాలజీ అప్లికేషన్స్ 6
-జీవులు- జనాభా 4
- పర్యావరణ వ్యవస్థ 3
నీట్ ప్రిపరేషన్‌కు ఉపయోగపడే పుస్తకాలు
నీట్ పరీక్షకు ప్రిపేరయ్యే అభ్యర్థులు కొన్ని ప్రామాణిక పుస్తకాలతో ప్రిపరేషన్ కొనసాగించాలి. NEET కోసం సిద్ధమవుతున్న ప్రతి విద్యార్థి తప్పనిసరిగా 11, 12 తరగతుల NCERT పాఠ్యపుస్తకాలను చదవాలి. వాటిలోని ప్రతి అంశంపై క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలి. ఈ పాఠ్యపుస్తకాలను పూర్తి చేసిన తర్వాత, గత పదేళ్ల నీట్ ప్రశ్నపత్రాలను అధ్యాయాల వారీగా అభ్యసించాలి. మీ బలం, బలహీనత ఆధారంగా స్కోర్‌ను మూడు సబ్జెక్టుల వారీగా విభజించాలి. మాక్ టెస్ట్‌లు రాస్తూ ఎప్పటికప్పుడు ప్రిపరేషన్‌ను అంచనా వేసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.