హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET 2022: సెప్టెంబర్ 7న నీట్ ఫలితాలు.. అందుబాటులో ఉండే ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల వివరాలు..

NEET 2022: సెప్టెంబర్ 7న నీట్ ఫలితాలు.. అందుబాటులో ఉండే ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నీట్ యూజీ-2022 ఆన్సర్ కీని ఆగస్టు 30న ఎన్‌టీఏ విడుదల చేయనుంది. ఆ తరువాత సెప్టెంబర్ 7న తుది ఫలితాలు వెల్లడికానున్నాయి. నీట్ ఫలితాల తర్వాత మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) ఆల్ ఇండియా కోటా (AIQ) కింద సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్ ప్రక్రియను చేపడుతుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

నీట్ యూజీ-2022(NEET UG 2022) ఆన్సర్ కీని ఆగస్టు 30న ఎన్‌టీఏ(ATA) విడుదల చేయనుంది. ఆ తరువాత సెప్టెంబర్ 7న తుది ఫలితాలు వెల్లడికానున్నాయి. నీట్ ఫలితాల తర్వాత మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) ఆల్ ఇండియా కోటా (AIQ) కింద సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్ ప్రక్రియను చేపడుతుంది. మరోవైపు రాష్ట్ర కౌన్సెలింగ్ సంస్థలు స్టేట్ కోటా కింద సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ (Counseling) నిర్వహిస్తాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో(Medical Colleges) మొత్తం మెడికల్ సీట్లలో 15 శాతం ఆల్ ఇండియా కోటా (AIQ) కింద రిజర్వ్ చేస్తారు. మిగిలిన 85 శాతం సీట్లు ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల కోసం రాష్ట్ర కోటా కిందకు వస్తాయి. నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ మల్టిపుల్ రౌండ్స్‌లో(Multiple Rounds) జరుగుతుంది. ఇందులో ఒక మాప్-అప్ రౌండ్, స్ట్రే వేకెన్సీ రౌండ్ కూడా ఉంటుంది.


Seventy Five Thousand Vacancies: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. Delhiveryలో 75 వేల ఉద్యోగాలు..


*నీట్-2022: కౌన్సెలింగ్ కోసం వివిధ కోటా సీట్లు


- ఆల్ ఇండియా కోటా సీట్లు,


- సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్స్, యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీ సీట్లు


- సెంట్రల్ పూల్ కోటా సీట్లు


- ప్రైవేట్ అన్‌ఎయిడెడ్/ఎయిడెడ్ మైనారిటీ/నాన్-మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా, మేనేజ్‌మెంట్ కోటాతో సహా అన్ని సీట్లు


* రాష్ట్ర ప్రభుత్వ కోటా సీట్లు


- ప్రైవేట్ కాలేజీ లేదా యూనివర్సిటీలో స్టేట్, మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లు


- దేశ‌వ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ ఇన్‌స్టిట్యూట్స్, జిప్‌మర్(JIPMER) కోటా సీట్లుమెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(MCC).. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ (AFMC) కోసం రిజిస్ట్రేషన్‌ మాత్రమే నిర్వహిస్తుంది. అడ్మిషన్ ప్రాసెస్ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థుల డేటాను AFMC అధికారులకు ఫార్వర్డ్ చేస్తుంది. సెంట్రల్ యూనివర్సిటీలు ఆఫర్ చేసే ఇతర రిలవెంట్ కోర్సుల ప్రవేశాల కోసం కూడా నీట్ స్కోర్‌ను అడగవచ్చు.


నీట్ తుది ఫలితాల తరువాత కటాఫ్ వివరాలు వెల్లడికానున్నాయి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు తప్పనిసరిగా 50 పర్సంటైల్ స్కోర్ సాధించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు కనీసం 40 పర్సంటైల్ స్కోర్ చేయాలి. ఈ ఏడాది 18,72,329 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. ఈ ఏడాది వయోపరిమితి నిబంధన ఎత్తేయడంతో గతేడాది కంటే 2.5 లక్షలకు పైగా దరఖాస్తులు పెరిగాయి.


ఎంత కష్టమొచ్చెనే : ప్రియుడితో భార్య జంప్..కొడుకుని ఎత్తుకొని తండ్రి రిక్షా సవారీ


ఈ ఏడాది అగ్రశ్రేణి వైద్య కళాశాలల్లో సీటు సాధించడానికి పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కటాఫ్ కూడా ఈసారి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో అడ్మిషన్ పొందాలంటే, నీట్ 2022లో దాదాపు 600 మార్కులు సాధించాల్సి ఉంటుందని నిపుణులు తెలిపారు. అయితే, పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య, అందుబాటులో ఉన్న మొత్తం సీట్లు, పరీక్ష క్లిష్టత స్థాయి వంటి అనేక అంశాలపై కటాఫ్ స్కోర్ ఆధారపడి ఉంటుంది.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, NEET, NEET 2020, NEET 2022

ఉత్తమ కథలు